For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఏ రెండు రాశులు కలవకూడదు ?

By Swathi
|

ఈ మధ్య కాలంలో పెళ్లి అయిన కొంతకాలానికే మనస్పర్దలు, గొడవలు, సమస్యలు. దీనివల్ల వెంటనే విడాకులకు సిద్ధమవుతున్నారు. ఇద్దరూ ఉద్యోగాలు చేయడం, లేదా ఫ్యామిలీ విలువలు తెలియకపోవడం, ఇద్దరి మధ్య ఇగో ప్రాబ్లమ్, డామినేషన్ వంటి కారణాల వల్ల పెళ్లిళ్లు మూడునాళ్ల ముచ్చటగా మారిపోతున్నాయి. కాబట్టి పెళ్లి బంధం కలకాలం హ్యాపీగా సాగాలంటే.. మీ పార్ట్ నర్ రాశి చాలా ముఖ్యమంటోంది జ్యోతిష్య శాస్త్రం.

మీ రాశి ప్రకారం మీరు ఎంచుకోవాల్సిన కెరీర్ ఏంటి ? మీ రాశి ప్రకారం మీరు ఎంచుకోవాల్సిన కెరీర్ ఏంటి ?

పెళ్లి అంటే అమ్మాయి, అబ్బాయి ఒకరికి ఒకరు నచ్చితే సరిపోదు. వాళ్ల మనసులతో పాటు, వాళ్ల జాతకాలు కూడా కుదరాలి అంటారు మన పెద్దలు. అందుకే ఇద్దరికి సంబంధించిన అన్ని విషయాలు చెక్ చేస్తారు. పేర్లు, రాశులు, నక్షత్రాలు అన్ని సరిగా కుదిరినప్పుడే వాళిద్దరి పెళ్లికి అంగీకరిస్తారు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు, బేధాభిప్రాయాలు రాకుండా.. హ్యాపీగా ఉండాలంటే.. రాశులు కలవడం చాలా ముఖ్యం.

మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే లక్కీ నంబర్ ఇదే.. !! మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే లక్కీ నంబర్ ఇదే.. !!

మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది ? మీ కాబోయే భర్త లేదా ఎలా ఉంటారు ? వివాహ జీవితానికి ఎంత విలువ ఇస్తారు ? మిమ్మల్ని ఎలా చూసుకుంటారు ? మీ నుంచి ఏం కోరుకుంటారు ? ఇలాంటి ప్రశ్నలు పెళ్లి చేసుకోబోయే ప్రతి ఒక్కరిని సతమతపెడుతుంటాయి. అయితే వీటన్నింటిపై రాశుల ప్రభావం కూడా ఉంటుంది. కొన్ని రాశుల వాళ్లు కలిస్తే చాలా డేంజర్. వాళ్ల వైవాహిక జీవితంపై చాలా ప్రభావం ఉంటుంది. ఇద్దరూ గొడవలు, మనస్పర్ధలతో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఏ రాశుల వాళ్లు పెళ్లి చేసుకుంటే.. వాళ్ల లైఫ్ క్రిటికల్ గా ఉంటుందో, ఏ రెండు రాశుల వాళ్లు పెళ్లి చేసుకోకూడదో ఇప్పడు చూద్దాం..

మేష రాశి, కర్కాటక రాశి

మేష రాశి, కర్కాటక రాశి

ఈ రెండు రాశుల వాళ్లు ఎట్టిపరిస్థితుల్లో పెళ్లి చేసుకోకూడదు. కర్కాటక రాశివాళ్లు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. వీళ్లు కొన్ని విషయాలను అంగీకరించినా.. కొన్ని సందర్భాల్లో మనస్పర్ధలకు కారణమవుతారు.

వృషభ రాశి, కుంభ రాశి

వృషభ రాశి, కుంభ రాశి

ఈ రెండురాశుల వాళ్లకు చాలా పొగరు, అహంకారం ఉంటుంది. ఒకరినొకరు డామినేట్ చేసుకునే తత్వం ఉంటుంది. వృషభరాశి వాళ్లు ఏ ఒక్క సందర్భంలో కూడా కుంభరాశి వాళ్లను పాజిటివ్ గా చూడలేరు. దీనివల్ల వీళ్లిద్దరూ ఒక్కటైతే.. ఎప్పుడూ గొడవలు ఎదురవుతాయి.

మిధునం, కర్కాటకం

మిధునం, కర్కాటకం

ఈ రెండు రాశులు ఏ మాత్రం కలిసిపోయేవి కావు. మిధున రాశి వాళ్లు చాలా ఫ్రాంక్ గా ఉంటారు. కర్కాటక రాశి వాళ్లు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. ఇక వీళ్లిద్దరూ ఒక్కటైతే.. సమస్యలు తప్పవు.

కర్కాటకం, కుంభం

కర్కాటకం, కుంభం

కుంభ రాశి వాళ్లు సమస్యాత్మక మనస్తత్వం కలిగి ఉంటారు. కర్కాటక రాశి వాళ్లు సున్నితంగా ఉంటారు. ఇక రెండు రాశులు కలిస్తే.. సమస్యలే ఎక్కువగా ఎదురవుతాయి. త్వరగా గొడవలు ఏర్పడతాయి.

సింహరాశి, వృషభ రాశి

సింహరాశి, వృషభ రాశి

సింహరాశి, వృషభరాశి వాళ్లు ఇద్దరూ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. లక్ష్యాలు నెరవేర్చుకునే మనస్తత్వం కలిగి ఉంటారు ఈ రెండురాశుల వాళ్లు. అయితే ఇలా ఇద్దరి తత్వాలు కలవడం మంచిదే. కానీ.. ఫేమ్, గుర్తింపు పొందడానికి ఇద్దరూ కష్టపడటం వల్ల సెక్యూరిటీ, స్టెబిలిటీ మిస్ అవుతుంది.

కన్యా రాశి, సింహరాశి

కన్యా రాశి, సింహరాశి

ఒకటి భూమిలాంటి నిర్మలమైన మనసు కలిగి ఉంటే.. మరొకటి అగ్నిలా ఎగసిపడుతుంది. వీళిద్దరూ ఒకరికి ఒకరు చాలా వ్యతిరేక మనస్తత్వాలు కలిగి ఉంటారు. దృఢమైన మనస్తత్వం కలిగిన సింహరాశి, నిర్మలమైన మనసు కలిగిన కన్యారాశికి ఏమాత్రం పొంతన కుదరదు.

కన్యా రాశి, మిధున రాశి

కన్యా రాశి, మిధున రాశి

కన్యారాశి వాళ్లది విశ్లేషణాత్మక స్వభావం అయితే.. మిధున రాశి వాళ్లది చాలా ఫ్రాంక్ గా ఉండే మిధున రాశి వాళ్లకు మ్యాచ్ అవదు. అయితే వీళ్లకు సర్దుకుపోయే తత్వం ఉండటం వల్ల.. ఇద్దరూ సమస్యలు ఎదురైనా పరిష్కరించుకోవచ్చు.

తులారాశి, మకరరాశి

తులారాశి, మకరరాశి

తులారాశి వాళ్లు జీవితంలో అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎప్పుడూ కార్యసాధన కోసం ఆరాటపడే మకరరాశి వాళ్లను అర్థం చేసుకోవడం తులారాశి వాళ్లకు కష్టంగా ఉంటుంది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని, సర్దుకుపోతే.. వీళ్ల రిలేషన్ బలంగా ఉండే అవకాశం ఉంటుంది.

వృశ్చిక రాశి, మేషరాశి

వృశ్చిక రాశి, మేషరాశి

ఈ రెండు రాశుల వాళ్లు కొంతకాలం మాత్రమే హ్యాపీగా ఉండగలరు. ఇద్దరూ వ్యక్తిగత స్వభావం కలిగి ఉంటారు కాబట్టి.. ఇద్దరి మధ్య సమస్యలకు ఎక్కువ అవకాశం ఉంటుంది.

ధనస్సు, మకరం

ధనస్సు, మకరం

ధనస్సు రాశి వాళ్లు చాలా ఈజీగా కలిసిపోయే తత్వం కలిగి ఉంటారు. కానీ మకర రాశి వాళ్లు అంత తేలికగా ఎవరితోనూ కలవలేరు. వీళ్లిద్దరూ మనస్తత్వాలు చాలా వేరుగా ఉంటాయి. దీంతో ఈ రెండు రాశులు కలవడం కాస్త కష్టంగా ఉంటుంది.

మకర రాశి, మిధున రాశి

మకర రాశి, మిధున రాశి

కార్యసాధనపై ఎక్కువ ఫోకస్ పెట్టే మకర రాశి వాళ్లు, మిధున రాశివాళ్లు సరసమైన, సరదాగా ఉండే తత్వం కలిగి ఉంటారు. కాబట్టి వీళ్లిద్దరూ ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉండలేరు. వీళ్ల కాంబినేషన్ ఏ మాత్రం మ్యాచ్ అవదు.

కుంభం, వృశ్చికం

కుంభం, వృశ్చికం

వృశ్చిక రాశివాళ్లు ఏ విషయాన్నైనా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. చాలా రిలాక్స్ గా ఉంటారు. వృశ్చిక రాశి వాళ్లు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. వీళ్లిద్దరివీ వేర్వేరు ఫిలాసఫీలు.. దీనివల్ల ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువగా వస్తాయి.

మీన రాశి, సింహ రాశి

మీన రాశి, సింహ రాశి

డ్రీమ్స్ ఎక్కువ కలిగి ఉంటారు మీన రాశి వాళ్లు. కమాండ్ చేసే తత్వం ఉంటుంది మీన రాశి వాళ్లలో. ఇద్దరి మధ్య వచ్చే మనస్పర్ధలను పక్కనపెట్టడం వీళ్లిద్దరికీ చాలా కష్టమైన పని.

మీన రాశి, మిధున రాశి

మీన రాశి, మిధున రాశి

వెంటనే తమాషా చేసే తత్వం మిధున రాశి వాళ్లది. అలాగే వీళ్లు చాలా ప్రేమగా ఉంటారు. డ్రీమ్స్ పై ఎక్కువ శ్రద్ధ చూపించే మీన రాశి వ్యక్తి.. ఏమాత్రం అర్థం చేసుకోలేరు. మొదట్లో వీళ్లిద్దరి మధ్య ఉన్నప్రేమ తర్వాత ఉండదు.

English summary

Danger signs! Zodiac pairings that are destined to fail

Danger signs! Zodiac pairings that are destined to fail. The fiery Aries can rarely make it work with the sensitive Cancer. While they may agree on certain things initially, their intrinsic natures will always lead to clashes.
Desktop Bottom Promotion