For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పూనకం ఒట్టి మూఢనమ్మకమేనా ? వాళ్లు అలా ప్రవర్తించడానికి కారణమేంటి ?

|

ఊళ్లో జాతర్లు, అమ్మవార్ల పూజలు జరుగుతున్నాయంటే.. కామన్ గా కనిపించేవి, వినిపించేవి అమ్మవారి పూనకం. ఇలాంటి జాతర్లలో ఎక్కువగా మహిళలకు అమ్మవారు ఒంట్లో పూనిందని నమ్ముతూ ఉంటారు. పూనకం వచ్చిన వ్యక్తి ఊగిపోతూ ఏవేవో మాట్లాడేస్తూ, ఆజ్ఞలు ఇచ్చేస్తూ ఉంటారు. అమ్మవారే తమతో మాట్లాడుతున్నారని నమ్మని చుట్టుపక్కల వాళ్లంతా.. చేతులెత్తి నమస్కరిస్తూ ''అలాగే తల్లీ, అలాగే అమ్మా మీరు చెప్పినట్టే చేస్తాం'' అని చెప్పేస్తుంటారు.

భక్తులంతా రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. పెళ్లి ఎప్పుడు అవుతుంది, పిల్లలు పుడతారా, ఏం పూజలు చేయాలి, ఏం మొక్కులు తీర్చుకోవాలి, ఈ సారి వర్షాలు పడతాయా.. అని ప్రశ్నిస్తారు. వీటన్నింటికీ.. అమ్మవారి పలుకులుగా.. పూనకం వచ్చినవాళ్లు సమాధానం చెబుతూ ఉంటారు. చుట్టూ ఉన్నవాళ్లంతా చేతులెత్తి నమస్కరించే సరికి.. పూనకం వచ్చినవాళ్లు మరింత గట్టిగా అరుస్తూ.. ఊగిపోతారు.

ఇలా మనుషుల శరీరంలోకి అమ్మవారు రావడం ఎంతవరకు నిజం ? ఇదంతా వాస్తవమేనా ? ఒట్టి మూఢనమ్మకమా ? అసలు ఆ సమయంలో ఏం జరుగుతుంది ? వాళ్లు అలా ప్రవర్తించడానికి కారణమేంటి ? ఈ ఆధ్యాత్మిక విషయంపై సైన్స్ ఏం చెబుతోంది ? వైద్య శాస్త్రం ఏం చెబుతోంది ? తెలుసుకోవాలంటే.. ఈ కింది స్లైడ్స్ క్లిక్ చేయాల్సిందే..

ఇండియాలో

ఇండియాలో

జాతర్లు, నవరాత్రుల సమయంలో.. ఇండియాలో పూనకం అనేది చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది.

పబ్లిక్

పబ్లిక్

మనుషుల శరీరంలోకి అమ్మవారు వచ్చిందంటూ.. కొంతమంది పండుగలు, జాతర్లలో నృత్యాలు చేస్తుంటారు.

MOST READ: మీ బాడీ షేప్ ని బట్టి.. మీరు ఎంతటి ఆరోగ్యవంతులో తెలుసుకోండి..!!

మైమరచిపోవడం

మైమరచిపోవడం

పూజ జరుగుతున్న సమయంలో అంటే భక్తి పాటలు పాడేటప్పుడు, భజనలు చేస్తున్నప్పుడు వాళ్లు మైమరిచిపోవడం వల్ల ఇలా పూనకం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి.. వింతగా ప్రవర్తించడం, భక్తిపారవశ్యంలో ఉన్నట్టు కదలికలు ఉంటాయి.

చాలా అరుదు

చాలా అరుదు

ఇలా దేవత ఆవహించడమనేది.. చాలా తక్కువ మందికి జరుగుతుంది. దీంతో వాళ్లను అమ్మవారు పూనడం ఆ దేవత అనుగ్రహమని, గొప్పవరమని చాలా మంది మూఢవిశ్వాసంతో ఉన్నారు.

అమ్మవార్లు

అమ్మవార్లు

కాళీ, దుర్గా, మరియమ్మ, సుంకలమ్మ, నూకాలమ్మ ఇలా గంభీరమైన అమ్మవార్లే పూనకంలోకి వస్తారని చెబుతారు.

ఎలా వస్తుంది ?

ఎలా వస్తుంది ?

డ్రమ్స్ వాయించడం, భజన చేయడం, మంత్రాలు చదవడం, కర్పూరం వెలిగించడం వంటి వాటి వల్ల.. పూనకం వస్తుందని.. చాలామంది నమ్ముతారు.

సంకేతాలు

సంకేతాలు

పూనకం వచ్చినప్పుడు మైమరిచిపోయి.. రకరకాలుగా ప్రవర్తిస్తారు. శరీరమంతా వణికిపోతున్నట్టు, వెనక్కి వాలిపోతున్నట్టు, ఒకవేళ మహిళలకు పూనకం వస్తే.. జుట్టు మొత్తం ముందుకు వేసుకుని ఊగిపోతూ, చేతులు విదిలిస్తూ ఉంటారు. పరుగెత్తడం, దొర్లడం వంటి ప్రవర్తన కనిపిస్తుంది.

ప్రభావం

ప్రభావం

ఇలా పూనకం వచ్చినప్పుడు అమ్మవారి దగ్గరకు వెళ్లి పూజలు చేయడం, చేతిలో కర్పూరం వెలిగించడం, నాలుక, దవడలో సూదులు గుచ్చుకోవడం చేస్తారు. ఇలాంటప్పుడు వాళ్లకు ఏమాత్రం నొప్పి ఉండదని చెబుతారు. ఇలా చేయడం వల్ల అమ్మవారు వాళ్ల శరీరం నుంచి వెళ్లిపోతారని భావిస్తారు.

పూనకం వచ్చినవాళ్లకు పూజలు

పూనకం వచ్చినవాళ్లకు పూజలు

పూనకం వచ్చినవాళ్లను సాక్షాత్తు అమ్మవారిలా భావించిన భక్తులంతా.. వాళ్లకు బొట్టు పెట్టడం, పసుపు రాయడం, పూలదండలు వేయడం వంటివి చేస్తూ ఉంటారు. ఇది ఎక్కువగా నవరాత్రులు, జాతర్ల సమయంలో జరుగుతుంది.

MOST READ: సన్నీ లియోన్ పై అభిప్రాయాన్ని మార్చే ఆసక్తికర విషయాలు

అనుభవం

అనుభవం

ఇలా పూనకం వచ్చినవాళ్లు సమాజానికి కొన్ని సలహాలు, సూచనలు ఇస్తారు. అలాగే కొంతమంది ఆలయం కట్టించాలని, మరికొందరికి మొక్కులు తీర్చుకోలేదని చెబుతూ ఉంటారు.

అసలు వాస్తవం

అసలు వాస్తవం

పూనకం రావడంపై ప్రతి ఒక్కరూ చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. అసలు దీనివెనక ఉన్న లాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దీని గురించి సైకాలజీ, ఆధ్యాత్మికత, చట్టాలు లేదా శాసనాలు ఏం చెబుతున్నాయో చూద్దాం..

సైకలాజికల్ డిజార్డర్స్

సైకలాజికల్ డిజార్డర్స్

మానసికంగా అనారోగ్య సమస్యల లక్షణాల వల్ల.. ఇలా పూనకం వంటి ఆలోచనలు వస్తాయని వైద్య శాస్త్రం చెబుతోంది. తీవ్రమైన మానసిక బాధ, మనో వైకల్యం కారణంగా ఇలా ప్రవర్తిస్తారని.. సైకలాజికల్ గా నిరూపితమైంది.

సోషల్ సైకాలజీ

సోషల్ సైకాలజీ

కొంతమంది సమాజంలో తమకు గుర్తింపు కోసం.. ఇలా ప్రవర్తిస్తారు. ఇతరుల నుంచి గౌరవం పొందడానికి కొంతమంది ఇలా నటిస్తూ ఉంటారు. అమ్మవారు శరీరంలోకి వస్తే.. ఎదుటివాళ్లు బొట్టు పెట్టి, దండలు వేసి గౌరవిస్తారు కదా అందుకే ఇలా చేస్తారట. వాళ్లకు కావాల్సిన పనులు పూర్తి చేసుకోవడానికి కూడా ఇలా ప్రవర్తిస్తారట.

గతంలో

గతంలో

గతంలో కొన్ని ఆచారాలు, మూఢనమ్మకాల కారణంగా.. వితంతువులు, బాల్యవివాహాలు, కోడళ్లపై రకరకాల చిత్రహింసలు ఉండేవి. దీనికారణంగా.. ఆ ఇంటి ఇష్టదేవత తనను పూనిందని లేదా చనిపోయిన వాళ్లు తనలోకి ప్రవేశించారని చెప్పి చిత్రహింసల నుంచి బయటపడేవాళ్లు. ఈ విధంగా పూనకం అనే దాన్ని పూర్వం ఉపయోగించుకునేవాళ్లు.

వాస్తమేమిటంటే ?

వాస్తమేమిటంటే ?

అమ్మవారు ఒంట్లోకి రావడం అనేది.. కేవలం ఒక మానసిక స్థితి. మానసికంగా కొన్ని అనారోగ్య సమస్యలకు ఇవి లక్షణాలు మాత్రమే అని వైద్యులు చెబుతున్నారు. దీన్నే మరోరకంగా చెప్పాలంటే పిచ్చి. మానసికంగా పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తారు. పూనకం తర్వాత అసలు ఏం జరిగింది అని అడిగితే.. ఏమీ గుర్తులేదు.. అని చెబుతుంటారు. లేదా అంతా అతీతశక్తి వల్ల అలా జరిగిందని సమర్థిస్తారు. కానీ పూనకం కేవలం మానసిక బలహీనత వల్ల వచ్చే విపరీత స్థితి మాత్రమే. దీనిపై మనమంతా కల్పించుకున్న మూఢనమ్మకమే పూనకం. ఇకనైనా.. ఇలాంటి మూఢనమ్మకాలకు స్వస్థి పలుకుతారేమో చూడాలి. .

English summary

Decoding the real phenomenon behind spiritual possession

Decoding the real phenomenon behind spiritual possession
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more