For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లి జరిగినట్లు, మంగళ వాయిద్యాలు, కలలొస్తుంటే దేనికి సంకేతం..?!

|

శుభాలకి సంబంధించిన కలలు మంచి ఫలితాలనే ఇస్తాయని పండితులు అంటున్నారు. వీటిలో ముఖ్యంగా వివాహానికి సంబంధించిన కలలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో యువతులకి వచ్చే కొన్ని శుభాలతో కూడిన కలలు త్వరలో వారి వివాహం జరగనుందనే విషయాన్ని సూచిస్తూ ఉంటాయి.

Different Dream Meaning Of Wedding

మంగళ వాయిద్యాలు ఎదురైనట్టుగా, తమ ఇంటికి మామిడితోరణాలు కట్టినట్టుగా కల వస్తే ఆ ఇంటి పెళ్ళి భాజాలు మోగడం తప్పనిసరి అని పంచాంగ నిపుణులు అంటున్నారు.

నెమలిని కలలో చూసినట్లైతే విశేష లాభము కలుగును.వివాహము కాని వారికి నెమలి కలలో కనిపిస్తే త్వరలో వివాహము జరుగును. అత్తవారి మూలముగా విశేష ధన లాభము కలుగును.

Different Dream Meaning Of Wedding

పెళ్లి వయసుకు రాని వాళ్లకు, వృద్ధులకు 'పెళ్లి' అయినట్లు కల వస్తుంటుంది. ''ఈ వయసులో ఇలాంటి కలలు ఏమిటి?'' అని ఆశ్చర్యపోతుంటారు.

కలలో 'పెళ్లి'కి రకరకాల అర్థాలు ఉన్నాయి.

తన కుటుంబ సభ్యులకు దూరంగా వెళుతున్నట్టుగా, తాను మరొకరి ఇంటిలో దీపం వెలిగిస్తున్నట్టుగా, బంగారు ఆభరణాలు ధరించినట్టుగా, చేతి నిండుగా గాజులు వేసుకుంటున్నట్టుగా, ఆలయంలో అమ్మవారిని దర్శించి ఆమె ప్రసాదాన్ని స్వీకరించినట్టుగా యువతులకు కలలో కనిపిస్తే త్వరలోనే వారి వివాహమవుతుంది.

Different Dream Meaning Of Wedding

ఒకటి
కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు నచ్చకపోయినా ఆమోదించాల్సి వస్తుంది. కారణం ఏదైనా ''ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాను? తీసుకోవాల్సింది కాదు...'' ఇలా మనసులో ఆలోచనలు సుడి తిరుగుతుంటాయి. ఈ ఆలోచన తీవ్రత కలగా మారుతుంది.

కలలో... పెళ్లి పందిరి చుట్టుపక్కల ఆనందం వెల్లివిరుస్తుంటుంది. ఇందుకు విరుద్ధంగా వరుడి (లేదా వధువు) ముఖంలో విషాదం తాండవిస్తుంటుంది. ఇక్కడ 'పెళ్లి' అనేది ఒక నిర్ణయమైతే, దాని మీద 'అనిష్టం' అనేది వరుడు (లేదా వధువు) ముఖంలో కనిపించే 'విషాదం'.

Different Dream Meaning Of Wedding

రెండు
మన జీవితంలో పెళ్లి అనేది అపురూపమైన విషయం.
''నా పెళ్లి ఇలా జరగాలి. అలా జరగాలి'' అని భావుకంగా ఊహించుకుంటాం. పరిస్థితులు కుదరక... మన ఊహల్లో లాగా నిజజీవితంలో పెళ్లి ఉండకపోవచ్చు. ఆ రకమైన అసంతృప్తి ఒకటి సున్నితంగా బాధ పెడుతుంటుంది.

Different Dream Meaning Of Wedding

''పెళ్లి గురించి గొప్పగా ఊహించుకున్నాను. కానీ, పేలవంగా జరిగింది'' అనే భావన అసంతృప్తుల జాబితాలో ఏదో ఒక మూల చేరిపోతుంది. కాలక్రమంలో దీన్ని మరిచిపోతాం. కానీ, అసంతృప్తి జాబితాలో ఉన్న 'పేలవంగా పెళ్లి' మళ్లీ కలలోకి వస్తుంది. అందుకే...ఒకవైపు పెళ్లిసందడి కనిపిస్తున్నా దాన్ని పట్టించుకోకుండా మరోవైపు వరుడి ముఖంలో విషాదం కనిపిస్తుంటుంది.

Different Dream Meaning Of Wedding

మూడు
కలలో పెళ్లి కనిపించడమనేది ఒక కొత్త ప్రారంభానికి సూచనప్రాయమైన వ్యక్తీకరణ కూడా.

English summary

Different Dream Meaning Of Wedding

Different Dream Meaning Of Wedding
Desktop Bottom Promotion