For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాములు 12ఏళ్లు పగ పట్టడం వాస్తవమేనా ?

By Swathi
|

పాము కనిపించగానే.. వామ్మో అంటూ.. ఆమడదూరం పరుగుపెడతారు. విషపూరితమైన సరీసృపం కావడమే ఇందుకు కారణం. ఎక్కడ కాటేస్తుందో అని.. కొందరు భయపడితే.. మరికొందరు దాన్ని చంపాలని ప్రయత్నిస్తారు. పాముల గురించి అనేక నమ్మకాలు, కథలు, అపోహాలు ప్రజల్లో అనాదిగా పాతుకుపోయాయి. నాటువైద్యం, మంత్రాల పేరుతో మరికొందరు అమాయకుల నుంచి అడ్డంగా దోచుకుంటున్నారు.

మన ఇండియాలో బాగా ప్రసిద్ది చెందిన మూఢనమ్మకాలు

పాము పగ గురించి కూడా అనేక నమ్మకాలు తాండవం చేస్తున్నాయి. ఒకప్పుడు పాములు జన్మజన్మల పగ తీర్చుకుంటాయని నమ్మేవాళ్లు. పాము పగ పన్నెండేళ్లని చెప్పడం వింటూ ఉంటాం. ఇంట్లో ఉండే పెద్దవాళ్లు పాముల జోలికి వెళ్లకూడదు.. అవి పగతీర్చుకుని చంపేస్తాయని చెప్పడం వినే ఉంటాం. దాన్ని కొట్టినా.. చంపినా.. పగ తీర్చుకుంటుందని చాలా మంది భావిస్తారు. అలాగే సినిమాల్లో కూడా పాములు పగపట్టాయని కొన్ని సన్నివేశాలు చూపిస్తూ ఉంటారు.

Do Snakes Take Revenge

పాముల గురించి భారతీయుల్లో ఉన్న నమ్మకాలు, మూఢ నమ్మకాలు చాలా ఆశ్చర్యాన్ని కల్గిస్తాయి. నిజామో, భ్రమో తెలియని పరిస్థితిని కల్పిస్తాయి. ఇలాంటి భావాలను కొందరు సిల్లీగా తీసుకుంటే.. మరికొందరు చాలా నమ్మకంగా తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఇవన్నీ అపోహలు అనిపించినా.. నమ్మాల్సిన పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.

Do Snakes Take Revenge

నాగపంచమి విశిష్టత మరియు పూజావిధానం

సాధారణంగా తాచుపాము దానంతట అది ఎవరి మీదకు దాడికి రాదు. దానిని బంధించే ప్రయత్నం, రెచ్చగొట్టే ప్రయత్నం, చంపే ప్రయత్నం చేయడం వల్ల దాని ప్రాణానికి ముప్పేమో అని దాడి చేయడానికి వెనకాడదు. మామూలుగా పామును కొడితే ఆ దెబ్బ తగలకపోతే దగ్గరలో ఎక్కడో ఒక దగ్గర మూలకి దాక్కుని.. తనని తాను రక్షించుకుంటుంది. మనిషికి కనబడకుండా కాపాడుకుంటుంది.

Do Snakes Take Revenge

కొట్టడానికి వచ్చిన వ్యక్తి వెళ్లిపోతే దాని దారిలో అది వెళ్లిపోతుంది. తాచుపాముతో వ్యవహారం అలా ఉండదు. అది ఆ ప్రాంతంలోనే ఉంటుంది. అది దాగి ఉన్న స్థలం సమీపంగా ఎవరు వెళ్లినా వారి మీదకు దూకుతుంది. మనిషే కాదు, జంతువు వచ్చినా దాడికి దిగుతుంది. అయితే తాచుపామును ముందు ఎవరు కొట్టడానికి ప్రయత్నించారో వారిని పగబట్టి కాటు వేసి పగ తీర్చుకుంటుందనే దానిపై సరైన ఆధారాలు లేవు. దెబ్బతప్పించుకున్న తాచుపాము అదే ప్రాంతంలో సుమారు 15 మీటర్ల సమీపంలో ఉండగలదు. అందుకే ఇలాంటి నమ్మకం ప్రజల్లో ఉందేమో ఒక అభిప్రాయం ఉంది.

జాతకంలో గ్రహ ప్రభావం ఉంటే ఏ రత్నం ధరించాలి?

పాములకు సంగీతం, నాట్యం తెలుసేమో అన్నట్టు భలే అద్భుతంగా డాన్స్ చేస్తుంటే.. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. కానీ పాములకు చెవులు లేవు.. వినలేవు. అవి అసలు శబ్ధాన్నే గ్రహించలేవు. మరి ఫ్లూట్ వాయిద్యానికి అనుగుణంగా ఎలా నృత్యం చేస్తాయి.? ఆశ్చర్యంగా ఉందా ? నిజమే.. ఇది చాలా అప్రమత్తంగా ఉండే జంతువు కాబట్టి.. ఫ్లూట్‌ ఊదే వ్యక్తి శరీర కదలికలకు అనుగుణంగా అది తలాడిస్తుంది. వాయిద్యం వాయించే వ్యక్తి నిశ్చిలంగా కూర్చుంటే పాము కూడా కదలకుండా ఉంటుంది. కానీ.. ఈ విషయం తెలియక చాలామంది.. పాము ముందు నాదస్వరం ఊది ఆడిస్తున్నట్లు భావిస్తారు. ఇదంతా అపోహ మాత్రమే.

English summary

Do Snakes Take Revenge ?

Do Snakes Take Revenge? Snakes are very common in tropical countries. In villages and bushy places, people encounter snakes everyday. Many beliefs have developed based on their experiences.
Story first published: Friday, January 8, 2016, 11:38 [IST]
Desktop Bottom Promotion