For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏటీఎమ్ (ATMs) మిషీన్ గురించి.. మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్..!

ఎన్ని ఏటీఎమ్ మిషీన్స్ ఉన్నాయి ? ఏటీఎమ్ ఎందుకు 4 డిజిట్ పిన్ నెంబర్ మాత్రమే ఉంటుంది ? ఒకవేళ ఏటీఎమ్ మిషీన్ మొత్తాన్ని ఎత్తుకునిపోతే ఏమవుతుంది ? ప్రపంచంలోనే మొదటి ఏటీఎమ్ ఎక్కడ ఏర్పాటు చేశారు ?

By Swathi
|

మన లైఫ్ లో ఏటీఎమ్స్ భాగమైపోయ్యాయంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. ఎప్పుడు, ఎలాంటి అవసరం వచ్చినా.. వెంటనే డబ్బు డ్రా చేసుకోవడానికి ఏటీఎమ్స్ చాలా అనుకూలంగా ఉండేవి. బ్యాంక్ లలో క్యూలలో నిలబడే అవసరం లేకుండా.. తేలికగా మనమే డబ్బు డ్రా చేసుకునే సదుపాయాన్ని ఏటీఎమ్ మిషీన్స్ కలిగిస్తున్నాయి.

facts about atms

ఇటీవల ఏటీఎమ్ మిషీన్లు.. చాలా సౌకర్యాలను కలిగిస్తున్నాయి. విత్ డ్రా చేసుకోవడమే కాకుండా.. డబ్బుని ఇక్కడే ట్రాన్స్ ఫర్ చేసే ఛాన్స్, బిల్స్ పే చేయడానికి ఏటీఎమ్స్ సహాయపడుతున్నాయి. అయితే.. ఏటీఎమ్ మిషీన్స్ గురించి మీకు తెలియని మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి.

ఎన్ని ఏటీఎమ్ మిషీన్స్ ఉన్నాయి ? ఏటీఎమ్ ఎందుకు 4 డిజిట్ పిన్ నెంబర్ మాత్రమే ఉంటుంది ? ఒకవేళ ఏటీఎమ్ మిషీన్ మొత్తాన్ని ఎత్తుకునిపోతే ఏమవుతుంది ? ప్రపంచంలోనే మొదటి ఏటీఎమ్ ఎక్కడ ఏర్పాటు చేశారు ? వంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఏటీఎమ్ (ATM)

ఏటీఎమ్ (ATM)

ఏటీఎమ్ అంటే.. ఆటోమేటెడ్ టెల్లర్ మిసీన్. ప్రపంచంలో మొత్తం 30 లక్షల ఏటీఎమ్ మిషీన్స్ ఉన్నాయి. కానీ.. ఇప్పటికీ.. ఇంకా లెక్కపెడుతూ ఉన్నారు.

ఫస్ట్ ఏటీఎమ్

ఫస్ట్ ఏటీఎమ్

1967లో లండన్ లోని ఈన్ ఫీల్డ్ టౌన్ లో మొదటి ఏటీఎమ్ ఇన్ స్టాల్ చేశారు. వావ్.. ఎన్నో ఏళ్ల క్రితం నుంచి.. ఏటీఎమ్ మిషీన్స్ బ్రిటీషర్స్ ఉపయోగిస్తున్నారంటే.. ఆశ్చర్యమే కదా.

ఇండియాలో ఫస్ట్ ఏటీఎమ్

ఇండియాలో ఫస్ట్ ఏటీఎమ్

1986లో ఎటీఎమ్ ని ఫస్ట్ ఏర్పాటు చేశారు. ముంబైలోని హెచ్ఎస్ బీసీ బ్యాంక్ లో ఏటీఎమ్ ని మొదటిసారి ప్రారంభించారు.

4 డిజిట్ పిన్

4 డిజిట్ పిన్

ఏటీఎమ్ మిషీన్ ని.. కనుగొన్న వ్యక్తి.. డైస్కాల్కులియా అనే వ్యాధితో బాధపడుతున్నాడు. కేవలం నాలుగు నెంబర్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవడం ఈ వ్యాధి ప్రధాన లక్షణం. అందుకే.. ఏటీఎమ్ మిషీన్ పిన్ నెంబర్ కేవలం 4 డిజిట్స్ నే కలిగి ఉంటుంది.

బ్రెజిల్ లో డిఫరెంట్

బ్రెజిల్ లో డిఫరెంట్

బ్రెజిల్ లో ఏటీఎమ్ లు చాలా విభిన్నంగా ఉంటాయి. వీళ్లు పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఫింగర్ ప్రింట్స్ ఇస్తే చాలు.. డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఈ ఐడియా బావుంది కదూ..

ఏ రోజు ఎక్కువగా డబ్బు డ్రా చేస్తారు ?

ఏ రోజు ఎక్కువగా డబ్బు డ్రా చేస్తారు ?

మీకు తెలుసా.. ఏటీఎమ్ లో ఎక్కువగా ఏరోజు డబ్బు డ్రా చేస్తారో ? శనివారం, ఆదివారం అని అంచనా వేస్తున్నారా ? అయితే పొరపాటు. ఎక్కువగా శుక్రవారం డ్రా చేస్తారట. ఎందుకో మీకు తెలుసుగా.. వీకెండ్ పార్టీకే.

బ్యాంక్ అకౌంట్ లేకపోయినా

బ్యాంక్ అకౌంట్ లేకపోయినా

అవును.. బ్యాంక్ అకౌంట్ లేకపోయినా.. ఏటీఎమ్ లో డబ్బు పొందే సౌకర్యం ఉంది. కానీ.. ఆగండి. ఇండియాలో కాదు.. రొమానియాలో.. బ్యాంక్ అకౌంట్ లేకపోయినా.. ఏటీఎమ్ ద్వారా ట్రాక్సాక్షన్ చేయవచ్చు.

ఏటీఎమ్ దొంగలిస్తే

ఏటీఎమ్ దొంగలిస్తే

అన్ని ఏటీఎమ్ మిషీన్లలో జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది. ఆ మిషిన్ ఎక్కడ ఉంది అని.. బ్యాంక్ కి తెలుస్తుంద.ి కాబట్టి.. దొంగలు.. ఏటీఎమ్ ని దోచేసి.. ఏంతో దూరం వెళ్లలేరు.

గోల్డ్ వెండింగ్ ఏటీఎమ్స్

గోల్డ్ వెండింగ్ ఏటీఎమ్స్

ఏటీఎమ్ లు డబ్బు మాత్రమే కాదు.. బంగారం కూడా.. అందిస్తాయి. అబుదబీలోని ఎమిరేట్స్ ప్యాలెస్ లో.. గోల్డ్ ప్లేటెడ్ వెండింగ్ మిషీన్ ఉంది. ఇది 320 రకాల బంగారు వస్తువులను ఇవ్వగలుగుతుంది.

English summary

Fascinating Facts about ATMs you must know

Interesting Facts About ATMs. There is a specific role of having a convex mirror in the ATM. The next time you visit, make sure you check it out!
Story first published: Saturday, November 19, 2016, 12:38 [IST]
Desktop Bottom Promotion