For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాళ్లతో కాదు.. ఐస్ గడ్డతో.. కోటలు, గుహలు, లోయలు.. వావ్..! ఎంత అద్భుతం.. !

By Swathi
|

అది వెనీలా ఐస్ క్రీంలా ఉంటుంది. కానీ తినలేం. అది వాల్కనో కానీ.. లావా ఉప్పొంగదు. అక్కడ కోటలున్నాయి. కానీ.. రాళ్లతో కాదు.. మంచుతో ఏర్పడిన మంచు కోటలు. అంతా వింతగా.. విడ్డూరంగా ఉంది కదూ. నిజమే.. ఈ ఆర్టికల్ మొత్తం చదివేసరికి మీకు అలాంటి అనుభూతే కలుగుతుంది..

ఈ హాట్ సమ్మర్ లో ఏదైనా చల్లగా ఉండే ప్రదేశాలకు వెళ్లాలని, చల్లగా ఉన్నవాటిని తినాలని కోరుకుంటాం. అలాంటివే చాలా ఊరటనిస్తాయి. అయితే మీరు ఇంకాస్త వండరయ్యే కూలింగ్ మిస్టరీస్ మీతో పంచుకోబోతున్నాం. ఎవరూ తయారు చేయని.. అద్భుతమైన ఫ్రోజెన్ వండర్స్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి.

వీటన్నింటినీ చూశారంటే.. మీకు ఆ ప్రాంతాలకు వెళ్లి ఎంజాయ్ చేయాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒకవేళ వెళ్లలేకపోతే.. ఈ ఫోటోలు చూస్తే చాలు చాలా హ్యాపీగా, అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆ మంచుతో ఏర్పడిన అద్భుతమైన వండర్స్ చూసేద్దామా..

స్ట్రిప్డ్ ఐస్ బర్డ్

స్ట్రిప్డ్ ఐస్ బర్డ్

ఇది చూడ్డానికి చాక్లెట్ సాస్ తో ఉన్న వెనీలా ఐస్ క్రీం ఉంది కదూ. కానీ.. ఇది సహజసిద్ధంగా ఏర్పడినది. ఈ చాక్లెట్ కలర్ ఉన్న గీతలన్నీ సముద్రం ద్వారా ఏర్పడ్డాయి.

Image Courtesy

స్నో రోలర్

స్నో రోలర్

ఇది చూడ్డానికి చాలా అమేజింగ్ గా ఉంది కదూ. భారీ ఎత్తున గాలి వచ్చినప్పుడు గాలితో పాటు మంచు కూడా రావడం వల్ల ఇలా ఏర్పడింది.

Image Courtesy

ఐస్ కేవ్

ఐస్ కేవ్

దీన్ని చూస్తుంటే.. ఎవరో క్రియేట్ చేశారు అనిపిస్తుంది కదూ. కానీ.. ఇది కూడా.. న్యాచురల్ గా ఏర్పడిన ఐస్ కేవ్. అలాస్కాగా పిలిచే ఈ కేవ్ డే లైట్ లో చాలా అద్భుతంగా కనిపిస్తుంది.

Image Courtesy

కర్వ్డ్ ఐస్ బర్గ్

కర్వ్డ్ ఐస్ బర్గ్

పోలార్ గాలుల ద్వారా ఈ ఒంపులుగా తిరిగిన ఐస్ బర్గ్ ఏర్పడింది. ఇక్కడ జీరో టెంపరేటర్ ఉండటంతో.. నీళ్లు గడ్డకట్టుకుపోతాయి. ఇవి అంటార్కిటిక్ పెన్సులాలో ఏర్పడ్డాయి.

ఐస్ సర్కిల్

ఐస్ సర్కిల్

ఇది చాలా అందంగా కనిపిస్తోంది కదూ. దీన్ని ఐస్ ప్యాన్ లేదా ఐస్ డెస్క్ లేదా ఐస్ సర్కిల్ అని పిలుస్తారు. చల్లటి వాతావరణం ఉన్నప్పుడు ఇది న్యాచురల్ గా ఏర్పడింది.

Image Courtesy

మంచు లోయ

మంచు లోయ

ప్రపంచంలోనే అతి పెద్ద లోయ గ్రీన్ ల్యాండ్. 80 శాతానికంటే ఎక్కువ మొత్తంలో అడుగుభాగంలో ఐస్ ఏర్పడి ఉంటుంది.

Image Courtesy

మంచు శిల్పం

మంచు శిల్పం

మంచు వర్షం, పెద్ద గాలుల ద్వారా ఈ శిల్పం ఏర్పడింది. ఆశ్చర్యంగా ఉంది కదూ. నిజమే.. ఇంత సహజంగా ఎంత అందంగా ఏర్పడిందో కదూ.

Image Courtesy

గ్లేసియల్ కేవ్

గ్లేసియల్ కేవ్

ఈ గుహను చూస్తుంటే.. వెంటనే లోపలికి వెళ్లాలని ఉంది కదూ. హిమాలయాల్లో నీళ్లు ఏరులై పారుతూ.. ఇలా గుహలా ఏర్పడింది.

Image Courtesy

బ్లూ ఐస్

బ్లూ ఐస్

ఈ బ్లూస్ చాలా విభిన్నమైనది. కోటలా ఉన్న ఇది కూడా సహజసిద్ధంగా ఏర్పడినదే. ఐస్ బబుల్స్ ఏర్పడటం వల్ల మెరుస్తూ.. చాలా అందంగా ఆకట్టుకుంటోంది. ఇది నేచర్ వండరే.

Image Courtesy

ఐస్ వాల్కనో

ఐస్ వాల్కనో

వాల్కనో అంటే.. మనకు భూమిలో నుంచి ఉప్పొంగే.. మంటలే గుర్తొస్తాయి. కానీ.. ఐస్ వాల్కనోలు కూడా ఉన్నాయి. ఫ్యూమరోల్స్ గా పిలిచే ఈ వాల్కనోలు.. లావాకి బదులు గ్యాస్ రిలీజ్ అవుతుంది. చాలా చల్లగా ఉంటుంది. స్కీమ్ అంతా బయటకు పొంగుతూ ఉంటుంది. చూడ్డానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ..

Image Courtesy

Story first published:Wednesday, April 6, 2016, 11:04 [IST]
Desktop Bottom Promotion