For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మానవ జన్మకు ముందు.. ఎన్ని కోట్ల జన్మలు ఉంటాయో తెలుసా ?

By Swathi
|

ఆత్మ మనుషుల శరీరంలో చేరే విషయం గురించి మాట్లాడటానికి ముందు.. ప్రతి ఒక్కరూ ఒక విషయం తెలుసుకోవాలి. మనషుల ఆత్మ ఎప్పటికీ మరణించదనే విషయం గుర్తుంచుకోవాలి. ఇది కేవలం మోక్షానికి చేరుతుంది అంతే. మంచి పనులు చేసినప్పుడే.. ఆత్మ మోక్షానికి చేరుతుంది. అంటే.. ఆత్మ ఒక జాతి నుంచి మరొక జాతికి మారుతూ ఉంటుంది.

వావ్: మరణం తర్వాత మనకు లైఫ్ ఉంటుందా ?

జంతువులు, పక్షులు, క్రిమీ కీటకాలు, మొక్కలు.. ఇలా ఒక్కో జీవితాన్ని అనుభవిస్తూ.. మంచి పనులు చేసిన దాన్ని బట్టి.. ఆత్మ మనుషుల శరీరం పొందగలుగుతుంది. అంటే.. ఎంత ఎక్కువ మంచి పనులు చేస్తే.. అంత త్వరగా.. గొప్ప జన్మ అయిన మనిషి జన్మ ఎత్తుదుందన్నమాట. అందుకే.. మనిషి జన్మ పొందడం పూర్వ జన్మ సుకృతం అని మన పెద్ద వాళ్లు చెబుతూ ఉంటారు.

మరణం తర్వాత యమలోకానికి వెళ్లడానికి 47 రోజుల భయంకర జర్నీ..!!

మనిషి జన్మ పొందడానికి మన ఆత్మ ప్రయాణించే సైకిల్ గురించి వింటే ఆశ్చర్యపోతారు. మనిషి పుట్టుక పొందాలంటే.. ఆత్మ 8 కోట్ల 40 లక్షల జాతులు దాటుకుని రావాలని.. పురాణాలు, భగవత్ గీత చెబుతోంది. మరి మనిషి జన్మ పొందడానికి ముందు ఆత్మ ఎన్ని కష్టాలు పడుతుందో మీరే చూడండి...

మనిషి జన్మ

మనిషి జన్మ

భగవత్ గీత, మన పూర్వీకుల ప్రకారం మనం మనుషులం అంత తేలికగా.. మానవ శరీరాన్ని పొందలేము.

రహస్యాలు

రహస్యాలు

మనుషుల జీవితం, శరీరం గురించి రహస్యాలను.. శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు.

8 కోట్ల 40 లక్షల జాతులు

8 కోట్ల 40 లక్షల జాతులు

కృష్ణుడి ప్రకారం మన ఆత్మ.. 8 కోట్ల 40 లక్షల జాతులు దాటుకుని.. మనుషుల శరీరానికి చేరుకుంటుందట.

బొద్దింకలు, పాముల రూపంలో

బొద్దింకలు, పాముల రూపంలో

కొన్నిసార్లు మనుషులు బొద్దింకలు, పాములు, సాలె పురుగు, చీమ, సముద్రపు జీవులు, మరికొన్ని మనం ఊహించని విధంగా కూడా జన్మించవచ్చట.

గత జన్మ

గత జన్మ

మనం కొన్ని ప్రాణులను అసహ్యంచుకుంటూ ఉంటాం. దానికి కారణం.. గత జన్మలో మనం ఆ జాతిలో పుట్టడం వల్ల ఈ జన్మలో వాటిని అసహ్యించుకుంటామని ఒక నమ్మకం ఉంది.

మంచి పనులు

మంచి పనులు

గతంలో అనేక మంచి పనులు చేయడం వల్లనే మనం మానవ శరీరం పొందగలుగుతామట.

దుర్వినియోగం చేయకూడదు

దుర్వినియోగం చేయకూడదు

మనం పొందిన గొప్ప మానవ జన్మను ఒకవేళ దుర్వినియోగం చేసుకుంటే.. మళ్లీ జంతువుల జాతిలోనే పుడతామట.

ఆఖరి జీవితం

ఆఖరి జీవితం

అలాగే.. మనిషి జీవితం అనేది.. చివరిగా లభించే లైఫ్ అని ఒక నమ్మకం ఉంది.

సహాయ ఫలితం

సహాయ ఫలితం

ఎన్నో నీచమైన జన్మల తర్వాత మనిషి జన్మ లభిస్తుంది.. కాబట్టి దాన్ని సార్థకం చేసుకోవాలని సామెత ఉంది. ఎన్నో రకాలుగా మనం జీవితం అనుభవించిన తర్వాత.. ఎంతో మందికి సహాయపడిన తర్వాత.. మనిషి జీవితం పొందగలుగుతాం.

సైన్స్

సైన్స్

అయితే 8 కోట్ల 40 లక్షల జాతుల తర్వాత మనిషి జీవితం పొందుతామనే దానిపై ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు.

8.7 మిలియన్ల జాతులు

8.7 మిలియన్ల జాతులు

కానీ.. ఈ భూమ్మీద మాత్రం 8.7 మిలియన్ల జాతులు ఉన్నాయని మాత్రం నిరూపించింది. దీన్ని బట్టి ఆత్మ ఈ జాతులను దాటిన తర్వాతే మనిషి జన్మ పొందుతుందని అంచనా వేస్తున్నారు.

30 లక్షల జంతువులు

30 లక్షల జంతువులు

9 లక్షల జలచరాలు, 20 లక్షల మొక్కలు, 11 లక్షల క్రిమీకీటకాలు, 10 లక్షల పక్షులు, 30 లక్షల జంతువులు, 4 లక్షల మనుషుల జాతులు భూమ్మీద ఉన్నాయని వేద సిద్ధాంతం తెలుపుతోంది.

శరీర మరణం

శరీర మరణం

మనం చనిపోయిన తర్వాత శరీరం మరణిస్తుంది.. కానీ.. ఆత్మ ఒక శరీరం నుంచి మరో శరీరానికి మారుతూనే ఉంటుందని ఒక ప్రముఖుడు తెలిపాడు.

ఆత్మ

ఆత్మ

కొత్త జన్మ పొందిన ప్రతిసారి.. గత జన్మ శరీరం మరణిస్తూ ఉంటుంది. కానీ.. ఆత్మ మాత్రం బతికే ఉంటుంది.

English summary

Here's Why Our Soul Passes 84,00,00,00 Species To Get A Human Body!

Here's Why Our Soul Passes 84,00,00,00 Species To Get A Human Body! Before we start this, we all should be aware that a soul never really dies. It only reaches the cycle of ‘Moksha’ after doing innumerable good deeds.
Desktop Bottom Promotion