For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సక్సెస్ ఫుల్ వ్యక్తులు ఫాలో అయ్యే ఇంట్రెస్టింగ్ హాబీస్.. !!

By Swathi
|

ప్రతి ఒక్కరికీ అభిరుచులు, అలవాట్లు ఉంటాయి. మనసు బాగోలేకపోయినా, ఖాళీ సమయం దొరికినా.. చేసేది.. మనకు నచ్చిన, ఇష్టమైన పని. కొంతమందికి పెయింటింగ్, డ్రాయింగ్, లాంగ్ డ్రైవ్, ఫోటోగ్రఫీ.. ఇలా రకరకాల అభిరుచులు ఉంటాయి. అయితే అభిరుచిని బట్టి కూడా వాళ్ల టాలెంట్, వాళ్ల ఆలోచనా శక్తి తెలుస్తుంది.

సుభాష్ చంద్రబోస్ చనిపోయారా ? చంపేశారా ? ఏం జరింగింది ?

అయితే చాలా బిజీగా.. రాత్రింబవళ్లు కష్టపడే వాళ్లకు కూడా అభిరుచులు ఉంటాయి. అంతేకాదు.. వాటికోసం తగిన సమయం కేటాయించడం వాళ్ల స్పెషాలిటీ. పొలిటీషియన్స్, క్రికెటర్స్, బిజినెస్ మ్యాగ్నేట్స్, సినీ స్టార్స్.. ఇలా ఏ రంగంలోని వాళ్లైనా.. చాలా బిజీగా ఉంటారు. ఎప్పుడు చూసిన ఉరుకుల పరుగుల జీవితం అనిపిస్తూ ఉంటుంది. కానీ వీళ్లు కూడా వాళ్ల అభిరుచులకు ప్రాధాన్యత ఇస్తారట.

మెంటలీ స్ట్రాంగ్ గా ఉండే వారి బిహేవియర్, క్వాలిటీస్ ఎలా ఉంటాయి..

మన ఇండియాలో చాలా పాపులర్ అయిన రిచ్ పీపుల్ అభిరుచులు తెలుసుకోవాలనుందా ? కొంతమందికి తమ ఫేవరేట్ పొలిటీషియన్ లేదా ఫేవరేట్ క్రికెటర్ లేదా ఫేవరేట్ స్టార్ హాబీ ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. అందుకే.. ఫేమస్ అండ్ రిచ్ పీపుల్ హాబీస్ ఏంటో ఇప్పుడు మీకు వివరించబోతున్నాం..

నరేంద్రమోడీ

నరేంద్రమోడీ

భారత ప్రధాని, ఫేమస్ పొలిటీషియన్, ఎంతో మందికి ప్రోత్సహకరంగా ఉండే వ్యక్తి నరేంద్రమోడీ. చాలామంది నరేంద్రమోడీ ఆలోచనలను ఇష్టపడతారు. మరి ఈయన హాబీ ఏంటో తెలుసా.. ? ఫోటో గ్రఫీ.

ముఖేష్ అంబానీ

ముఖేష్ అంబానీ

ఇండియన్ బిజినెస్ మ్యాగ్నేట్, రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ.. అత్యంత ధనవంతుల లిస్ట్ లో ఉన్నారు. కంపెనీ లావాదేవీల్లో ఎంతో బిజీగా ఉండే ఈయనకు హిందీ సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టమట.

ఐశ్వర్యారాయ్

ఐశ్వర్యారాయ్

అందానికే ఐకాన్ అయిన ఐశ్వర్యారాయ్.. సినిమాల్లో నటనతో ఆకట్టుకోవడం, ప్రేక్షకాధరణ పొందడం గురించి అందరికీ తెలుసు. ఈ బ్యూటీ క్వీన్ హాబీ.. ట్రెడిషనల్ గా ఉంది. కుట్లు, అల్లికలు అంటే.. ఈ అందాల తారకు తెగ ఇష్టమట.

అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్.. ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఈయనకు ఎప్పుడు తీరిక దొరికినా.. బ్లాగ్ లో స్పెండ్ చేసేస్తారు.

మాధురీ దీక్షిత్

మాధురీ దీక్షిత్

డ్యాన్స్ అంటే.. మాధురీ దీక్షిత్ చేయాలి అన్నంతగా ఫేమస్ అయిన ఈ బ్యూటీ అభిరుచి కూడా డ్యాన్సే. అందుకేనేమో.. ఈ అమ్మడి డ్యాన్స్ కి అందరూ ఫిదా అయిపోతారు.

షారుక్ ఖాన్

షారుక్ ఖాన్

మీకు గుర్తుందా చిన్నప్పుడు సండే వచ్చిందంటే చాలు వీడియో గేమ్ లలో మునిగిపోయేవాళ్లం. ఇది మన హాబీ మాత్రమే కాదు.. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా వీడియో గేమ్స్ పై క్రేజ్ పెంచుకున్నాడు.

దీపికా పదుకొనె

దీపికా పదుకొనె

సిల్వర్ స్క్రీన్ అందం, అభినయంతో అలరించే ఈ ముద్దుగుమ్మ.. స్పోర్ట్స్ అంటే ఎనలేని ప్రేమ. దీపికాకు బ్యాడ్మింటన్ ఆడటం చాలా ఇష్టమట.

సచిన్ టెండుల్కర్

సచిన్ టెండుల్కర్

క్రికెట్ దేవుడిగా.. ఫేమస్ అయిన సచిన్ కు సీడీలు కలెక్ట్ చేయడం చాలా ఇష్టం.

ప్రియాంకా చోప్రా

ప్రియాంకా చోప్రా

యాక్టర్ గా, సింగర్ గా బాలీవుడ్ లో తనదైన స్థానం సంపాదించుకున్న పిగ్గీ చాప్స్ కి సింగింగ్ చాలా ఇష్టమైన హాబీ. అందుకే.. అప్పుడప్పుడు తన గాత్రంతో.. ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉంటుంది.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

కండల వీరుడు సల్మాన్ ఖాన్ కాస్త తీరిక సమయం దొరికినా.. వెంటనే పెయింటింగ్ మొదలుపెట్టేస్తాడు. పెయింటింగ్ అంటే.. అంత ఇష్టం సల్లూకి.

కరీనా కపూర్

కరీనా కపూర్

కరీనా కపూర్ ఖాన్ హాబీ ఏంటో తెలుసా యోగా.

అమీర్ ఖాన్

అమీర్ ఖాన్

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.. అమీర్ ఖాన్ కి ఇష్టమైన అభిరుచి పుస్తకాలు చదవడం.

అనుష్కా శర్మ

అనుష్కా శర్మ

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ తీరిక సమయాల్లో, ప్రయాణాల్లో హాయిగా మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవుతుందట. ఏమాత్రం టెన్షన్ ఫీలయినా.. వెంటనే మ్యూజిక్ వింటూ టెన్షన్ తగ్గించుకుంటానంటోంది ఈ ముద్దుగుమ్మ.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

సిక్స్ లు, ఫోర్లతో.. క్రికెట్ మైదానంలో చాలా ఫేమస్ అవుతున్న విరాట్ కోహ్లీకి ట్రావెలింగ్ హాబీ అట. ఏ మాత్రం సమయం దొరికినా.. ఇష్టమైన ప్రదేశాలకు చెక్కేస్టాడు ఈ స్టార్ క్రికెటర్.

సోనాక్షి సిన్హా

సోనాక్షి సిన్హా

బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హాకి ఫోటో గ్రఫీ అంటే ఎనలేని అభిమానం.

సోనమ్ కపూర్

సోనమ్ కపూర్

ఆడవాళ్ల అభిరుచులపై మగవాళ్లకున్న అభిప్రాయాన్ని నిజం చేసింది.. సోనమ్ కపూర్. ఎందుకంటే.. ఈ ముద్దుగుమ్మకు షాపింగ్ అంటే పిచ్చి అట.

కంగనా రనౌత్

కంగనా రనౌత్

వావ్.. నోరూరించే వంటకాలు చేయడానికి ఇష్టపడుతుందట కంగనా రనౌత్.

జార్జ్ బుష్

జార్జ్ బుష్

అమెరికా మాజీ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ కి పెయింటింగ్ అంటే ప్రాణం.

English summary

Hobbies of the Rich and Famous People

Hobbies of the Rich and Famous People. Look out your favourate actor or cricket star or politician hobby.