For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఫెయిర్ గా ఉంటారా? డార్క్ గా ఉంటారా? మీ కలర్ ఏం చెబుతోంది ?

ఇండియన్స్ స్కిన్ టోన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇండియన్స్ లో చాలామందికి చర్మం కలర్ ఛామన చాయ (వీటిష్) కలిగి ఉంటారు. ఇలా ఏ స్కిన్ కలర్ కలిగిన వాళ్ల స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం..

By Swathi
|

కళ్లు, ముక్కు, చేతి రేఖలు, చేతి వేళ్లను బట్టి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడం విన్నాం. కానీ చర్మం కలర్ ని బట్టి కూడా స్వభావాన్ని తెలుసుకోవచ్చని మీరు ఎప్పుడైనా విన్నారా ? అవును ఎవరికి వారు డిఫరెంట్ గా అనిపించే స్కిన్ కలర్.. ఆ వ్యక్తి స్వభాన్ని తెలుపుతుందని.. లేటెస్ట్ స్టడీస్ చెబుతున్నాయి.

color of your skin

కొంతమంది పొట్టిగా, పొడవుగా, కొంతమంది బక్కగా, కొంతమంది లావుగా ఉంటారు. అలాగే కొంతమంది కళ్లు నీలిరంగులో ఉంటాయి. కొంతమందికి నలుపు రంగులో ఉంటాయి. అలాగే.. చర్మం కలర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే స్కిన్ కలర్ కూడా పర్సనాలిటీని వివరిస్తుంది.

ఇండియన్స్ స్కిన్ టోన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇండియన్స్ లో చాలామందికి చర్మం కలర్ ఛామన చాయ (వీటిష్) కలిగి ఉంటారు. కొంతమంది కాస్త ఫెయిర్ గా, మరికొంతమంది నల్లగా లేదా కాస్త నల్లగా ఉంటారు. ఇలా ఏ స్కిన్ కలర్ కలిగిన వాళ్ల స్వభావం ఎలా ఉంటుందో చూద్దాం..

చామన ఛాయ

చామన ఛాయ

సముద్ర శాస్త్రం ప్రకారం చామన ఛాయ రంగు కలిగిన వాళ్లు హెల్తీగా ఉంటారు, కష్టపడి పనిచేస్తారు. కెరీర్ ఓరియెంటెడ్ గా ఉంటారు. వీళ్ల ఉద్యోగాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. వాళ్లు ఎంచుకున్న రంగంలో సక్సెస్ అవుతారు.

నలుపు (డార్క్)

నలుపు (డార్క్)

డార్క్ స్కిన్ కలిగిన వాళ్లు చాలా ధైర్యంగా, తెలివిగా ఉంటారు. వీళ్లు చాలా సమస్యలు ఎదుర్కొంటారు, కానీ వాటికి ఏమాత్రం తలవంచరు, భయపడరు. రిస్క్ తీసుకుంటారు.

ఫెయిర్

ఫెయిర్

ఫెయిర్ కాంప్లెక్షన్ తోపాటు కాస్త పింకిష్ గా ఉండే స్కిన్ కలర్ ఉన్నవాళ్లు.. చాలా తెలివైనవాళ్లు. చాలా రొమాంటిక్ గా ఉంటారు. అలాగే చాలా ఆకర్షణీయంగా, చాలా అటెన్షన్ గా ఉంటారు.

ఎల్లోయిష్

ఎల్లోయిష్

కాస్త చర్మం రంగు ఎల్లోయిష్ గా ఉన్నవాళ్లు చాలా ఓర్పు కలిగి ఉంటారు. చాలా చురుగ్గా, తెలివిగా వ్యవహరిస్తారు. అలాగే సీరియస్ గానూ ఉంటారు, హ్యాపీగానూ ఉంటారు. అయితే వీళ్లు చాలా తరచుగా అనారోగ్యంపాలవుతూ ఉంటారు. కొన్నిసార్లు దీర్ఘకాలిక వ్యాధులను కూడా కలిగి ఉంటారు.

రెడ్ స్కిన్ టోన్

రెడ్ స్కిన్ టోన్

రెడ్డిష్ స్కిన్ కలర్ కలిగిన వాళ్లు చాలా ఓర్పు, తెలివి కలిగి ఉంటారు. అలాగే బాగా పనిచేస్తారు. చాలా నేర్పుగా ఉంటారు. ఆఫీస్ వర్క్ అయినా, ఇంటి వర్క్ అయినా చక్కగా చేసుకుంటారు.

మిక్స్డ్ కలర్

మిక్స్డ్ కలర్

కొన్ని భాగాల్లో ఫెయిర్, కొన్ని భాగాల్లో చామన ఛాయగా ఉండేవాళ్లు స్టేబుల్ గా ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. బాగా చదువుకుంటారు. అలాగే కొన్నిసార్లు లేజీగా కూడా ఉంటారు.

క్రియేటివ్

క్రియేటివ్

ఇలా రెండు రకాల స్కిన్ కలర్స్ కలిగిన వాళ్లు చాలా క్రియేటివ్ గా కూడా ఉంటారు. వాళ్ల ఆలోచనలు చాలా విభిన్నంగా ఉంటాయి. గొప్ప లీడర్స్, రాజకీయ వేత్తలు, కవులు, రచయితలు అయ్యే అవకాశాలుంటాయి.

ఆయిలీ అండ్ షైనీ

ఆయిలీ అండ్ షైనీ

ఇలాంటి చర్మ తత్వం కలిగిన వాళ్లు ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుంటారు. వాక్ చాతుర్యం కలిగి ఉంటారు. అందరినీ కలుపుకుని పోయే తత్వం ఉంటుంది. అలాగే మంచి వక్తలు కూడా.

నార్మల్ స్కిన్

నార్మల్ స్కిన్

నార్మల్ స్కిన్ కలిగిన వాళ్లు ఆలోచించే గుణం ఎక్కువ. వీళ్లు చాలా చమత్కారమైనవాళ్లు. కానీ అంతర్ముఖుడు, కానీ కార్యసాధన కలిగినవాళ్లు. ఏ విషయాన్నైనా తమలోనే దాచుకోవడం అలవాటు, కానీ ఎమోషనల్ గా కూడా ఉంటారు.

డ్రై స్కిన్

డ్రై స్కిన్

డ్రై స్కిన్ వాళ్లు అర్థం లేని తత్వం కలిగినవాళ్లు. వీళ్లు ఎక్కువగా మాట్లాడరు. మాటలతో వాళ్లకు కావాల్సిన పని పూర్తి చేసుకుంటారు.

బ్లాక్ హెడ్స్

బ్లాక్ హెడ్స్

బ్లాక్ హెడ్స్ వంటి చర్మ సమస్యలు కలిగిన వాళ్లు చాలా ఆసక్తికరమైన, సహజమైన మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రశ్నలు అడగటాన్ని ఇష్టపడతారు. చాలా నిజాయితీగా ఉంటారు. వాళ్లలో ఏం చూస్తారో వాళ్ల నుంచి అదే పొందుతారు.

సెన్సిటివ్ స్కిన్

సెన్సిటివ్ స్కిన్

సెన్సిటివ్ స్కిన్ కలిగిన వాళ్లు చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. ఎమోషనల్ గా ఉంటారు. చాలా ప్రేమగా, ఆనందకరంగా ఉంటారు.

చతురస్రాకారంలో ముఖం

చతురస్రాకారంలో ముఖం

ముఖం ఆకారం చతురస్రాకారంలో ఉన్నవాళ్లు అప్పుడప్పుడు చాలా ఆలోచిస్తారు. కాస్త లాజికల్ గా ఉంటారు. అయితే వీళ్లు ఎక్కువగా ఆలోచించే తత్వం కలిగి ఉండటం వల్ల.. ఒత్తిడికి గురవుతారు.

గుండ్రటి ముఖం

గుండ్రటి ముఖం

గుండ్రటి ఫేస్ కలిగిన వాళ్లు.. చాలా జాలి, దయ కలిగి ఉంటారు. తమ గురించి ఆలోచించరు. ఇతరుల సంతోసం కోసం ఎక్కువగా పనిచేస్తారు. మీ చుట్టూ ఉన్నవాళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.

డైమండ్

డైమండ్

డైమండ్ షేప్ లో ముఖం కలిగిన వాళ్లు.. చాలా లోతుగా విషయాలను తెలుసుకోవాలి అనుకుంటారు. వీళ్లు చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తారు. పర్ఫెక్షనిస్ట్ లు వీళ్లు. ఏ పని వీళ్లకు కష్టంగా అనిపించదు.

ఓవల్ షేప్

ఓవల్ షేప్

ఓవల్ షేప్ లో ముఖం కలిగిన వాళ్లు.. చాలా డిప్లొమాటిక్ గా ఉంటారు. సరైన సమయానికి సరైన విషయం చెప్పాలి అనుకుంటారు. వీళ్ల దగ్గర ఎప్పుడు మంచి పుస్తకాలు ఉంటాయి.

English summary

How the color of your skin determines your personality

How the color of your skin determines your personality. However, do you know that the colour of your skin too, determines your personality?
Story first published:Friday, December 16, 2016, 15:42 [IST]
Desktop Bottom Promotion