For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్కాంలలో ఇరుక్కున్న పొలిటికల్ లీడర్ల క్వాలిఫికేషన్స్ ఏంటో తెలుసా ?

By Swathi
|

ఇండియన్స్ పొలిటీషియన్స్, పాలిటిక్స్ అంటే స్కాంలకు పెట్టింది పేరు. ప్రతి ఏడాది ఏదో ఒక స్కాంతో.. రచ్చ అవుతూ ఉంటుంది. పబ్లిక్ అవసరాలు తీర్చే నాయకుల కంటే.. కుంభకోణాలతో ఎక్కువ పాపులారిటీ సంపాదిస్తారు మన ఇండియన్ పొలిటీషియన్స్. ఇలా స్కాంలలో ఇరుక్కునే రాజకీయ నాయకులకు చదువు లేదా అంటే.. ఫేమస్ యూనివర్సిటీలు, కాలేజీల నుంచి పట్టాలు అందుకుని మరి.. ఇక్క పబ్లిక్ లో పరువు పోగొట్టుకుంటున్నారు.

వాళ్లంతా గొప్ప గొప్ప యూనివర్సిటీలు, కాలేజీల నుంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఏదో సాధిద్దామనే ఆలోచనలు, దేశాన్ని అత్యుతన్నత స్థానానికి తీసుకెళ్తామనే వాగ్ధానాలతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పొలిటీషియన్స్.. ఆ రంగంలోకి రాగానే స్కాంలతో ఫేమస్ అవుతున్నారు. కొంతమందికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చాలా తక్కువగా ఉంటే.. మరికొందరు పీజీలు చేశారు. మరి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే పొలిటీషియన్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ గురించి చూద్దాం..

మన్మోహన్ సింగ్

మన్మోహన్ సింగ్

భారత 13వ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. ఈయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా ? ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేట్ చేశారు. ఇంత గొప్ప క్వాలిఫికేషన్ ఉండి కూడా.. 1.86 లక్షల కోట్ల బొగ్గు స్కామ్ లో ఇరుక్కున్నారు.

పవన్ కుమార్ బన్సాల్

పవన్ కుమార్ బన్సాల్

పవన్ కుమార్ బన్సాల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచ్ లర్ ఆఫ్ సైన్స్ అండ్ లా. చట్టాలు, న్యాయాల గురించి చదువుకున్న ఈ గ్రేట్ పొలిటీషియన్ కూడా.. రైల్వే బ్రైబరీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

రాజా

రాజా

2జీ స్పెక్ట్రం కేసులో ఇరుక్కున్న రాజా బ్యాచ్ లర్ ఆఫ్ సైన్స్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ లా పూర్తి చేశారు. దేశంలో రెండో అతి పెద్ద స్కాం అయిన 2జీ స్పెక్ట్రం కేసులో మొదటి నిందితుడిగా రాజా ఉన్నారు. ఈ స్కాం విలువ 1.76 లక్షల కోట్లు. ప్రస్తుతం రాజా బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులోనే ఉంది.

కపిల్ సిబాల్

కపిల్ సిబాల్

మాజీ మానవవనరుల శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కమ్యునికేషన్స్ అండ్ ఐటి, లా అండ్ జస్టిస్ మంత్రి కపిల్ సిబాల్. అమెరికాలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన ఈ పొలిటీషియన్ జీరో లాస్ థియరీ పేరుతో.. మాయాజాలం ప్రదర్శించారు.

లాలూ ప్రసాద్ యాదవ్

లాలూ ప్రసాద్ యాదవ్

పాట్నా యూనివర్సిటీ నుంచి బ్యాచ్ లర్ ఆఫ్ లా పూర్తి చేశారు లాలూ ప్రసాద్ యాదవ్. అయితే ఈయన పొలిటీషియన్ కంటే బీహార్ గుండా రాజ్ గా ఎక్కువ ఫేమస్ అవుతున్నారని వార్తలున్నాయి. మంచి పొలిటీషియన్ గా కంటే కుల రాజకీయాలు, అవినీతి ఆరోపణలు ఇతనిపై ఎక్కువగా విమర్శలున్నాయి.

షీలా దీక్షిత్

షీలా దీక్షిత్

షీలా దీక్షిత్ హిస్టరీలో గ్రాడ్యుయేషన్ అందుకున్నారు. ఈ లేడీ పొలిటీషియన్ కామన్ వెల్త్ గేమ్స్ స్కాంలో ప్రధాన వ్యక్తిగా ఉన్నారు. 2013లో ఈమెపై ఎఫ్ఆర్ఐ కూడా నమోదైంది. అలాగే అసెంబ్లీ ఎలెక్షన్స్ లో కూడా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు షీలాపై ఆరోపణలున్నాయి.

సురేష్ కల్మాడీ

సురేష్ కల్మాడీ

సురేష్ కల్మాడీ పూనెలో గ్రాడ్యుయేషన్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఆరేళ్లు సేవ చేసిన ఈయనకు కూడా కామన్ వెల్త్ గేమ్స్ స్కాంలో హస్తమున్నట్లు ఆరోపణలున్నాయి.

అశోక్ ఛావన్మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ ఛావన్ ఎమ్ బీ ఎమ్ చేశారు. ఇంతటీ క్వాలిఫికేషన్ ఉన్న ఈ పొలిటీషియన్ కు ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కాంలో హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

అశోక్ ఛావన్మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ ఛావన్ ఎమ్ బీ ఎమ్ చేశారు. ఇంతటీ క్వాలిఫికేషన్ ఉన్న ఈ పొలిటీషియన్ కు ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కాంలో హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ ఛావన్ ఎమ్ బీ ఎమ్ చేశారు. ఇంతటీ క్వాలిఫికేషన్ ఉన్న ఈ పొలిటీషియన్ కు ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కాంలో హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

Story first published:Tuesday, May 10, 2016, 15:00 [IST]
Desktop Bottom Promotion