Latest Updates
-
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.!
యూరిన్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ..!!
కుక్క మనిషికి ఆత్మీయ నేస్తం అని ఎవరన్నారో కాని అది తప్పు. మనిషికి ఆత్మీయ నేస్తం మూత్రం.అదెలా అని ఆశ్చర్య పడుతున్నారా?? వినడానికి ఇది పిచ్చి వాదనలా అనిపించినా కూడా మూత్రం గురించి కొన్ని యదార్ధాలు తెలుస
కుక్క మనిషికి ఆత్మీయ నేస్తం అని ఎవరన్నారో కాని అది తప్పు. మనిషికి ఆత్మీయ నేస్తం మూత్రం.అదెలా అని ఆశ్చర్య పడుతున్నారా?? వినడానికి ఇది పిచ్చి వాదనలా అనిపించినా కూడా మూత్రం గురించి కొన్ని యదార్ధాలు తెలుసుకుంటే మూత్రం మనిషికి ఆత్మీయ నేస్తం అని మీరు అంగీకరిస్తారు.సమయానికి మూత్ర విసర్జన చేస్తే నవ్వుల పాలయ్యే సందర్భనుండి బయట పడ్డవారవుతారు.

సమయానికి మూత్ర విసర్జన చెయ్యలేకపోతే మీ మైండ్ పనిచెయ్యదు.మీరు అత్యంత ముఖ్య సమావేశంలో ఉన్నప్పుడు కూడా లేదా ప్రయాణంలో ఉన్నప్పుడో ఎక్కద మూత్రం విసర్జించాలా అని ఆలోచిస్తూ అసౌకర్యానికి గురవుతుంటారు కదా. దీనిని బట్టే తెలుస్తోంది కదా మూత్ర విసర్జన ఎంత ముఖ్యమో.మూత్రం గురించి క్రింద మేము ఇచ్చిన కొన్ని యదార్ధాలని చూసి మీకు తెలీని కొన్ని కొత్త విషయాలని తెలుసుకోండి.

ఫ్యాక్ట్ # 1 :
మనిషి సగటున రోజుకి 7 సార్లు మూత్ర విసర్జన చేస్తాడని తెలుసా?? కానీ 7 సార్ల కంటే బాగా ఎక్కువ లేదా తక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తున్నట్లయితే ఏదో తెలీని అనారోగ్యం మీ శరీరంలో దాక్కుందని గుర్తు.

ఫ్యాక్ట్ # 2 :
ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యొక్క మూత్ర విసర్జన కాలం దాదాపు 7 సెకన్లు.మూత్ర విసర్జన చెయ్యాలనిపించి తీరా చేసే సమయానికి 2 సెకన్లు లేదా అంత కంటే తక్కువ సమయంలోనే మూత్ర విసర్జన పూర్తయితే వారికి ఇన్ ఫెక్షన్ ఉందని సూచన.

ఫ్యాక్ట్ # 3 :
మనం తీసుకున్న ఆహారాన్ని శరీరం వివిధ రకాలుగా విడగొడుతుంది. ఇలా విడగొట్టబడిన ఆహారంలో నుండి శరీరం కేవలం కావాల్సిన పోషకాలని గ్రహించి మిగిలిన వ్యర్ధాలని మూత్రం, మల రూపాల్లో విసర్జిస్తుంది.

ఫ్యాక్ట్ # 4 :
రోమన్లు తమ మూత్రంతో పుక్కిలించేవారని తెలుసా??మూత్రంలో ఉన్న అమోనియా వల్ల దంతాలు మిల మిలా మెరిస్తాయని వారు నమ్మేవారు.ఛీ...

ఫ్యాక్ట్ # 5 :
మీ మూత్రం రంగుని బట్టి మీ ఆరోగ్యాన్ని చెప్పచ్చు.మీ మూత్రం కనుక తెల్లగా స్వచ్చంగా ఉంటే మీరు సరిపోయినన్ని నీళ్ళు తాగుతున్నారని అర్ధం.మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే మీ శరీరానికి సరిపడా ద్రవ పదార్ధాలు అందట్లేదని అర్ధం.ఒక వేళ మూత్రం బ్రౌన్, రెడ్ లేదా పింక్ రంగులో ఉంటే మీ వైద్యుడిని సంప్రదించండి.

ఫ్యాక్ట్ # 6 :
పెద్దవారిలో మూత్రాశయం దాదాపుగా 300-500 మిల్లీ లీటర్ల మూత్రాన్ని మోయగలిగే సామర్ధ్యం కలిగి ఉంటుంది.

ఫ్యాక్ట్ # 8 :
మీ మూత్రం కనుక స్వీట్ స్మెల్ కలిగి ఉంటే మీకు మధుమేహం ఉందనడానికి సంకేతం.అందువల్ల మీరు మూత్ర విసర్జన సమయంలో మీ మూత్రాన్ని అసహ్యం అనుకోకుండా జాగ్రత్తగా పరిశీలించండి. మూత్రాన్ని పరిశీలించడం చాలా ముఖ్యం.



Click it and Unblock the Notifications
