For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అద్భుతం: 5వేల ఏళ్ల క్రితం శ్రీకృష్ణుడు చెప్పిన మాటలే నిజమవుతున్నాయా ?

|

నిజాయితీ, ధర్మం, మోక్షం గురించి.. మన హిందూ పురాణ గ్రంథాలు వివరిస్తాయి. అయితే శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకటి కాదు రెండు కాదు.. 5 వేల సంవత్సరాల క్రితం చెప్పిన విషయాలు.. ఇప్పుడు జరగబోతున్నాయట. వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉంది కదూ. మరి వాటిని చూడటానికి మనకి ఎంత ధైర్యం కావాలో మీరే అంచనా వేయండి.

Krishnas predictions

మనుషుల్లో వచ్చే మార్పులు, ప్రవర్తనలో వచ్చే మార్పులు, సమాజంలో పెరిగిపోయే అకృత్యాలు, నిజాయితీ కోల్పోవడం, జీవితకాలం తగ్గిపోవడం ఇలా.. ఒకటా రెండా.. రకరకాల విషయాల గురించి శ్రీకృష్ణుడు వేల సంవత్సరాల క్రితమే వివరించాడు. మరి భగవత్ గీత ఆధారంగా శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు ? ఏ విషయాలు నిజం కాబోతున్నాయి ? తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా.. ? అయితే.. ఇప్పుడే చెక్ చేయండి..

డబ్బు, ఆస్తులకే విలువ

డబ్బు, ఆస్తులకే విలువ

రానురాను మనుషులకు విలువ తగ్గిపోతుందని, మనిషి ప్రవర్తన కంటే.. వాళ్ల సంపాదన, ఆస్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని శ్రీకృష్ణుడు వివరించాడు. అంతేకాదు.. మంచి వ్యక్తి అనడానికి గుణగణాల కంటే.. డబ్బు, ఆస్తినే పరిగణలోకి తీసుకుంటారట.

జంధ్యంతో బ్రాహ్మణుల గుర్తింపు

జంధ్యంతో బ్రాహ్మణుల గుర్తింపు

బ్రాహ్మణులను కేవలం జంధ్యం చూసి మాత్రమే గుర్తించగలుగుతామట. అంటే.. వాళ్లు పాటించే నియమాలు రానురాను కనుమరుగవుతాయని శ్రీకృష్ణుడు 5 వేల ఏళ్ల క్రితమే అంచనావేశారన్నమాట.

MOST READ:దశావతారాలు: విష్ణువు పది అవతారాల వెనుకున్న రహస్యాలు...MOST READ:దశావతారాలు: విష్ణువు పది అవతారాల వెనుకున్న రహస్యాలు...

గారడి విద్య

గారడి విద్య

బయటకు కనిపించే గుర్తులు, మారువేశాలకు ఎక్కువ ఆకర్షితులు అవుతారని, ఆధ్మాత్మిక చింతన వదిలేస్తారు. గారడి విద్య చేసే వాళ్లనే.. వక్తలుగా, స్కాలర్లుగా నమ్ముతారని శ్రీకృష్ణుడు 5 వేల సంవత్సరాల క్రితమే చెప్పాడట.

అవినీతి పరులు

అవినీతి పరులు

భూమ్మీద అవినీతి పరులు ఎక్కువ అవుతారని, తనను తాను శక్తివంతుడని, డబ్బున్న వ్యక్తినని చెప్పుకునే వ్యక్తుల చేతుల్లోనే రాజకీయం ఉంటుంది. వాళ్లే రాజ్యమేలుతారని.. 5వేల ఏళ్ల క్రితం శ్రీకృష్ణుడు వివరించాడట.

పన్నుల భారం

పన్నుల భారం

పన్నులు పెరిగిపోతాయి, ఆకులు, కాండాలు, మాంసం, తేనె, పండ్లు, పూలు, గింజలు తిని బతకాల్సి వస్తుంది. మహిళలపై చిత్రహింసలు భయంకరంగా పెరిగిపోతాయని.. శ్రీకృష్ణుడు 5 వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు.

ఆకలి, దప్పిక

ఆకలి, దప్పిక

ప్రజలు విపరీతమైన చలి, గాలి, వేడి, వర్షాలు, మంచుతో బాధపడతారు. తినడానికి తిండిలేక, నీళ్లు లేక ఆకలి, దప్పిక, వ్యాధులు, తీవ్ర ఆందోళనతో బాధపడాల్సి వస్తుందని కృష్ణపరమాత్ముడు 5 వేల సంవత్సరాల క్రితమే వివరించాడు.

MOST READ:కంచిలోని బంగారు, వెండి బల్లి వెనుకున్న రహస్యం ఏంటి..?!MOST READ:కంచిలోని బంగారు, వెండి బల్లి వెనుకున్న రహస్యం ఏంటి..?!

50 ఏళ్లు మాత్రమే జీవితకాలం

50 ఏళ్లు మాత్రమే జీవితకాలం

కలియుగంలో మనుషుల జీవిత కాలం 50 ఏళ్ల కంటే మించదని.. శ్రీకృష్ణుడు అంచనా వేసి చెప్పారు. అదే నిజమనిపిస్తోంది కదూ. ప్రస్తుతం వస్తున్న అనారోగ్య సమస్యల కారణంగా 50 ఏళ్లకు మించి జీవితం అనుభవించలేకపోతున్నారు. శ్రీకృష్ణుడు 5 వేల ఏళ్ల క్రితమే ఈ విషయాన్ని ప్రబోధించాడు.

అనాధాశ్రమాలు

అనాధాశ్రమాలు

మనుషులు తమ తల్లిదండ్రుల సంరక్షణను ఏమాత్రం పట్టించుకోరు. కనిపెంచిన తల్లిదండ్రులను అనాధాశ్రమాలకు వదిలేస్తారని శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే ఉమ్మడి కుటుంబాల కంటే.. అనాధాశ్రమాలే ఎక్కువగా ఉంటాయన్నమాట.

క్రూర మనస్తత్వం

క్రూర మనస్తత్వం

మనుషులు చాలా క్రూరంగా మారుతారని, డబ్బుల కోసం.. సొంత బంధువులను, రక్త సంబంధాలను కూడా పట్టించుకోకుండా.. క్రూరంగా చంపేస్తారని.. శ్రీకృష్ణుడు భగవద్గీతలో వివరించారు.

నాగరికత లేనివాళ్లు

నాగరికత లేనివాళ్లు

నాగరికత లేని వ్యక్తులకు దేవాలయాల బాధ్యత అప్పగిస్తారు. దేవుడిని అడ్డం పెట్టుకుని వాళ్లు సొమ్ము చేసుకుంటారు. మతం గురించి ఏమీ తెలియని వ్యక్తులు అత్యున్న స్థానానికి చేరుకుని.. ఆధ్యాత్మిక విషయాలు, సిద్ధాంతాలను వల్లించే రోజులు వస్తాయని శ్రీకృష్ణుడు 5 వేల ఏళ్ల క్రితమే చెప్పాడు.

ఆవులను చంపడం

ఆవులను చంపడం

ఆవులు పాలు ఇవ్వడం మానేసిన తర్వాత వాటిని క్రూరంగా చంపేస్తారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆవులను మనుషులే.. చంపేసే గడ్డు పరిస్థితులు వస్తాయని శ్రీకృష్ణుడు 5 వేల ఏళ్ల క్రితమే హెచ్చరించాడు. అదే ఇప్పుడు జరుగుతోంది కదూ..

దొంగతనాలు

దొంగతనాలు

సిటీల్లో దొంగల రాజ్యం, వేదాలు నాస్తికులతో కలుషితమైపోతాయి. పురోహితులు భక్తుల పొట్టకొట్టి.. సొమ్ము చేసుకునే దాంట్లో మునిగిపోతారని.. కృష్ణ భగవానుడు.. 5000 సంవత్సరాల క్రితమే వివరించాడు. అంటే.. కలియుగంలో జరిగే విషయాలన్నింటినీ.. కృష్ణుడు ముందుగానే అంటే 5000 ఏళ్ల క్రితమే అంచనా వేశాడన్నమాట.

MOST READ:ఆస్ట్రాలజీ ప్రకారం, శరీరం మీద ఏబాగాల్లో బల్లి పడితే ఎలాంటి ఫలితం ఉంటుంది..MOST READ:ఆస్ట్రాలజీ ప్రకారం, శరీరం మీద ఏబాగాల్లో బల్లి పడితే ఎలాంటి ఫలితం ఉంటుంది..

నిజాయితీ, దయ

నిజాయితీ, దయ

కలియుగంలో మతం, నిజాయితీ, శుభ్రత, జాలి, దయ, జీవితకాలం, శారీరక బలం, మెమరీ వంటవన్నీ.. రోజురోజుకీ క్షీణిస్తాయని కృష్ణుడు వివరించాడు.

English summary

Krishna's predictions that were made 5000 years ago are actually coming true!

Krishna's predictions that were made 5000 years ago are actually coming true! Since eras, this 700-verse Hindu scripture in Sanskrit language has enlightened mankind about the righteous, dharma, and moksha.
Desktop Bottom Promotion