For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు ఎన్ని సంవత్సరాలు బతుకుతారో తెలుసుకోవాలని ఉందా ?

By Swathi
|

మనం ఎంతకాలం బతుకుతాం ? ఎన్ని రోజులు ఈ లైఫ్ ని ఎంజాయ్ చేస్తాం ? అనేది ఎవరికీ తెలియదు. కానీ.. ఉన్నంత కాలం హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎప్పుడు, ఎలా వస్తుందో తెలియని మరణం గురించి కొంతమంది చాలానే భయం ఉన్నా.. మరికొందరికి ఎలాంటి భయం ఉండదు.

అనారోగ్యం, యాక్సిడెంట్స్, ఇతర సంఘటనల ద్వారా మరణం అనేది మన లైఫ్ లోకి వస్తుంది. కానీ.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది ఎవరూ ఊహించడం సాధ్యం కాదు. అందుకే.. మరణం అంటే.. దాదాపు అందరిలోనూ.. పైకి చెప్పలేని భయం ఉంటుంది.

కానీ మనం ఎంత కాలం బతుకుతాం, మన జీవితకాలం ఎంత అనేది తెలుసుకోవడానికి మాత్రం ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి ఉంటుంది. మరి మీ జీవిత కాలం ఎంత ? మీరు ఎన్ని రోజులు బతుకుతారు అనే విషయాలను తాజా అధ్యయనాలు అంచనావేస్తున్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడే తెలుసుకోండి..

జీవితకాలం

జీవితకాలం

సాధారణంగా ఒక వ్యక్తి జీవితకాలం సగటున 78 ఏళ్లు ఉంటుంది. వాళ్లు పాటించే నియమాలు, ఆరోగ్య సూత్రాలను బట్టి అది పెరగవచ్చు, తగ్గవచ్చు. మరి మీ లైఫ్ స్పాన్ ఎంత వరకో.. ఇప్పుడే తెలుసుకోండి.

అబ్బాయికి జన్మ

అబ్బాయికి జన్మ

ఒకవేళ మీరు మగపిల్లాడికి జన్మనిస్తే.. మీ జీవితకాలంలో.. ఒక ఏడాది తగ్గిపోయినట్టే. అంటే 78 ఏళ్లలో ఒక ఏడాది తీసేస్తే.. మీరు 77ఏళ్లు బతుకుతారట.

ఫ్యాట్

ఫ్యాట్

మీ శరీరంలో ఫ్యాట్ పేరుకుపోయి ఉంటే.. ఎక్కువ ఫ్యాటీగా కనిపిస్తుంటే.. మీ జీవితకాలంలో.. మూడేళ్లు తగ్గిపోతుంది. ఫ్యాట్ ఎక్కువగా ఉంటే.. ఇప్పుడు కాకపోయినా.. తర్వాత అనారోగ్య సమస్యలు రావడం వల్ల.. త్వరగా చనిపోతారు.

పేదరికం

పేదరికం

పేదరికంలో ఉండటం, ఆర్థిక సమస్యల్లో ఉన్నారు అంటే.. మీ జీవిత కాలంలో.. ఐదేళ్లు తగ్గిపోతుంది. ఎందుకంటే.. సరైన ఆహారం లేకపోవడం వల్ల.. జీవితకాలం తగ్గుతుంది.

6గంటలు టీవీ చూస్తే

6గంటలు టీవీ చూస్తే

రోజుకి ఆరు గంటలు, అంతకంటే ఎక్కువ సమయం టీవీ చూడటానికే కేటాయితే.. మీ జీవితకాలంలో.. ఐదేళ్లు తీసేయవచ్చు. ఇది.. మీ జీవితకాలాన్ని తగ్గిస్తుంది.

స్మోకింగ్

స్మోకింగ్

రోజుకి ఒక ప్యాకెట్ సిగరెట్స్ తాగేస్తున్నారు అంటే.. మీ జీవిత కాలంలో.. 10ఏళ్లు తగ్గిపోయినట్టే. కాబట్టి.. ఇకనైనా.. సిగరెట్ తాగడం మానేయడానికి ప్రయత్నించండి.

మీ జీవితకాలాన్ని పెంచే అలవాట్లు

మీ జీవితకాలాన్ని పెంచే అలవాట్లు

రోజుకి ఒక కప్పు పచ్చి కూరగాయలు తినే వాళ్లలో.. రెండేళ్ల జీవితకాలం పెరుగుతుంది.

మీ జీవితకాలాన్ని పెంచే అలవాట్లు

మీ జీవితకాలాన్ని పెంచే అలవాట్లు

ఎంత ఒత్తిడినైనా మీరు కంట్రోల్ చేసుకోగలిగితే.. మీ లైఫ్ మరింత ఎక్స్ టెండ్ అవుతుంది. పని ఒత్తిడైనా, లైఫ్ లో ఎదుర్కొనే ఒత్తిడినైనా కంట్రోల్ చేసుకునేవాళ్లు మరో నాలుగేళ్లు ఎక్కువ కాలం జీవిస్తారు.

మీ జీవితకాలాన్ని పెంచే అలవాట్లు

మీ జీవితకాలాన్ని పెంచే అలవాట్లు

సోషల్ నెట్ వర్క్, ఫ్రెండ్స్ ఇలా.. లైఫ్ ని సంతోషంగా గడిపడం, స్నేహితులతో బంధం స్ట్రాంగ్ గా ఉంటే.. మీ జీవితకాలానికి మరో ఏడేళ్లు పెరుగుతాయి.

మీ జీవితకాలాన్ని పెంచే అలవాట్లు

మీ జీవితకాలాన్ని పెంచే అలవాట్లు

వారానికి రెండుసార్లు చేపలు తినడం వల్ల.. హెల్తీగా, ఎక్కువకాలం జీవిస్తారు. చేపలు ఇష్టంలేని వాళ్లు చేపల ద్వారా పొందే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ని.. ఫ్లాక్స్ సీడ్స్ ద్వారా పొందవచ్చు.

మీ జీవితకాలాన్ని పెంచే అలవాట్లు

మీ జీవితకాలాన్ని పెంచే అలవాట్లు

రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ఫ్లాట్ టమ్మీ పొందుతారు. దీనివల్ల మీ జీవిత కాలం.. పెరుగుతుంది.

మీ జీవితకాలాన్ని పెంచే అలవాట్లు

మీ జీవితకాలాన్ని పెంచే అలవాట్లు

రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం వల్ల మానసికంగా ఒత్తిడి నుంచి రిలాక్స్ అవడమే కాకుండా.. హెల్తీగా ఉంటారు. మీ జీవితకాలం పెరుగుతుంది.

English summary

Surprising Secrets: How Long Will You Live ?

Surprising Secrets: How Long Will You Live ? 78.6 years is the average American life expectancy. Read on to find out how you may have more control over it than you think.
Desktop Bottom Promotion