జయలలిత గురించి ఎవరికీ తెలియని అసలు వాస్తవాలు..!

By Swathi
Subscribe to Boldsky

ఆమె తిరుగులేని నాయకురాలు, ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించిన ఐరన్ లేడీ, ప్రజల గుండెల్లో మరువలేని స్థానం సంపాదించిన అమ్మ, ఆరోపణలు, అవినీతి కేసులను లెక్కచేయని ధీర వనిత, ధైర్యం, గుండె నిబ్బరానికి నిలువెత్తు రూపం ఒన్ అండ్ ఓన్లీ పొలిటికల్ లేడీ జయలలిత.

Things About Jayalalitha All Indians Should Know

తమిళ ప్రజల్లో పురచ్చి తలైవిగా, అమ్మగా ఎంతో ఆప్యాయంగా పిలుపించుకునే రాజకీయ నాయకురాలు జయలలిత. ముఖ్యమంత్రిగా ఎన్నో స్కీములు, ప్రజాకర్షక పథకాలతో తమిళ ప్రజల గుండెల్లో గుడి కట్టించుకున్న జయలలిత తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

ఆల్ ఇండియా అన్నా డ్రవిడ మున్నేత్ర కళగం (AIADMK) పార్టీ జనరల్ అధ్యక్షురాలు జయలలిత. తమిళనాడు ప్రజలంతా ఆమెను దేవతలా, అమ్మ కంటే ఎక్కువగా ఆరాధిస్తారు. ఇలా ఎంతో గొప్ప సినీ ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం గురించి ఎంతో కొంత ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది.

కానీ జయలలిత గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మాత్రం చాలామందికి తెలియకపోవచ్చు. పవర్ ఫుల్ లేడీగా పాలిటిక్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జయలలిత గురించి ప్రతి ఇండియన్ తెలుసుకోవాల్సిన విషయాలేంటో చూద్దాం..

పేరు

పేరు

జయలలిత పూర్తీపేరు జయలలిత జయరామన్. అలాగే ఈమెను పురచ్చి తలైవి, అమ్మ అని పిలుస్తూ.. ఆమెపై తమకున్న అభిమానాన్ని వ్యక్తపరుస్తారు తమిళులు. పురచ్చి తలైవి అంటే.. విప్లవ నాయకి అని అర్థం.

మైసూర్

మైసూర్

జయలలిత పుట్టింది తమిళనాడులో కాదు. మైసూరులో. కానీ.. ఈమె ప్రస్థానమంతా తమిళనాడుకే అంకితమైంది.

16 ఏళ్లలోనే

16 ఏళ్లలోనే

జయలలిత మొదటి సినిమాలోనే వితంతువుగా నటించింది. ఈమె తమిళ సినిమా వెన్నిర ఆడాయ్ సినిమాతో తెరంగేట్రం చేసింది. అయితే ఆమె నటించిన సినిమాను ఆమె అప్పట్లో చూడలేకపోయింది. ఎందుకంటే.. ఆ సినిమాకు ఏ సర్టిఫికేట్ రావడంతో.. 16ఏళ్ల జయలలిత చూడలేకపోయింది.

నటనపై ఆసక్తి లేదు

నటనపై ఆసక్తి లేదు

నటనపై జయలలితకు ఆసక్తి లేదు. కానీ తన కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల కారణంగా.. తన తల్లి కోరిక ప్రకారం సినిమాల్లో నటించింది.

ప్రేమ

ప్రేమ

తెలుగు నటుడు శోభన్ బాబుతో జయలలిత ప్రేమలో పడింది. కానీ అప్పటికే శోభన్ బాబుకి పెళ్లి కూడా అయింది. తర్వాత వీళ్లిద్దరి మధ్య రూమర్స్ తారాస్థాయికి చేరాయి. వీళ్లిద్దరూ ఒక బాబు ఉన్నాడని రకరకాల చర్చలు రావడంతో.. జయలలిత శోభన్ బాబుకి దూరమైంది. ఆ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఆమెకు రాలేదు.

పుస్తకాల ప్రియురాలు

పుస్తకాల ప్రియురాలు

పుస్తకాలు చదవడం అంటే జయలలితకు చాలా మక్కువ. సినిమాలు లేదా రాజకీయ జీవితంలో ఎంత బిజీగా గడిపినా.. బుక్స్ చదవడానికి ఏదో ఒకలా సమయం కేటాయించేదట.

చరిత్రలోనే తక్కువ జీతం అందుకున్న సీఎం

చరిత్రలోనే తక్కువ జీతం అందుకున్న సీఎం

తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి జీతం చెక్ రూపంలో ఇస్తుంటే.. తన దగ్గర సమృద్ధిగా ఆదాయం ఉందని జీతం అవసరం లేదని చెప్పింది. పబ్లిక్ సర్వెంట్ మాదిరిగానే జీతం తీసుకుంటానని ఒక రూపాయి వేతనం తీసుకుంది తిరుచ్చి తలైవి. ఇది పబ్లిక్ లో చాలా ఆకర్షణగా మారింది.

ఆమె ఇంట్లో దర్యాప్తు

ఆమె ఇంట్లో దర్యాప్తు

జయలలిత కెరీర్ లో ఇది టర్నింగ్ పాయింట్. 750 జతల చెప్పులు, 800 కేజీల వెండి, 28 కేజీల బంగారం, 10 వేలకు పైగా చీరలు, 91 వాచ్ లు, 44 ఏసీలను ఆమె నుంచి ప్రభుత్వం సీజ్ చేసింది.

నగలకు దూరం

నగలకు దూరం

14 ఏళ్లు నగలకు దూరంగా ఉన్నారు జయలలిత. 2011లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన కేబినేట్ మంత్రులు, ఆప్తుల కోరిక మేరకు నగలు ధరించింది. దీన్ని బట్టి ఆమె ఎంత పట్టుదల కలిగిన వ్యక్తో తెలుస్తోంది. అలాగే ఆమె చీరకట్టు కూడా చాలా సాధారణంగా ఉంటుంది. ఆమె నిడారంబర జీవితానికి ఆమె డ్రెస్సింగ్ స్టైలే నిదర్శనం.

గిన్నీస్ రికార్డ్

గిన్నీస్ రికార్డ్

కోటి 50 వేల మంది అతిథులతో 1995లో తన దత్త పుత్రుడు సుధాగరన్ పెళ్లి నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది.. జయ.

మహిళా పోలీస్ స్టేషన్స్

మహిళా పోలీస్ స్టేషన్స్

మహిళా పోలిస్ స్టేషన్స్ పరిచయం చేసిన ఘనత జయలలితాది. తమిళనాడు మొత్తం 57 మహిళా పోలీస్ స్టేషన్స్ ని ఏర్పాటు చేసింది. ఈ పోలిస్ స్టేషన్స్ లో కేవలం మహిళా పోలీసులే ఉంటారు.

మొదటి మహిళా సీఎం

మొదటి మహిళా సీఎం

1991లో జయలలిత తమిళనాడుకి అత్యంత యువనాయకురాలిగా, మొదటి మహిళా ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పాలించి రికార్డ్ క్రియేట్ చేసింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Things About Jayalalitha All Indians Should Know

    Things About Jayalalitha All Indians Should Know. These are some of the things about Jayalalitha that all Indians should know. Check them out...
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more