For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ పళ్ల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్స్..!!

By Swathi
|

మన శరీంలో రకరకాల అవయవాలు.. రకరకాల పనులు చేస్తాయి. ఈ అవయవాలు, భాగాలన్నీ సరైన విధంగా పనిచేస్తూ.. మన శరీరాన్ని హెల్తీగా ఉంచుతాయి. ఒకవేళ ఒక భాగం సరిగా పనిచేయకపోయినా.. ఏదో సమస్య ఉందని తెలియజేస్తుంది.

అయితే ఇవాళ మన పళ్ల గురించి.. కొన్ని ఆసక్తికర వాస్తవాలు మీకు వివరించబోతున్నాం. వాటిని ఖచ్చితంగా తెలుసుకోవడం వల్ల.. పళ్లను మరింత జాగ్రత్తగా చూసుకోగలుగుతాం. శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం పళ్లు. ఎందుకంటే.. ఆహారాన్ని నమలడానికి, జీర్ణం అవడానికి తేలికగా.. ఆహారాన్ని మార్చడానికి పళ్లు సహాయపడతాయి.

జీర్ణవ్యవస్థ హెల్తీగా, సజావుగా పనిచేయాలంటే.. డెంటల్ హెల్త్ చాలా ముఖ్యమైనది. అలాగే ఆహారం జీర్ణమవడానికి, ఆహారం తినడానికి ఎంతో ముఖ్యమైన.. పళ్ల గురించి.. ఆశ్చర్యకర నిజాలు మీకోసం..

స్ట్రాంగ్ టీత్ సీక్రెట్

స్ట్రాంగ్ టీత్ సీక్రెట్

బలమైన పళ్లకు ఫ్లోరైడ్ కారణం. ఇవి క్యావిటీస్ ని నివారిస్తుంది. టూత్ డికేని కూడా అరికడుతుంది. అందుకే టూత్ పేస్ట్ లు, మౌత్ వాష్ లలో ఫ్లోరైడ్ ని ఉపయోగిస్తారు.

పాచి

పాచి

బ్యాక్టీరియా, యాసిడ్, సాలివా, ఫుడ్ ద్వారా.. పళ్లపై పాచి ఏర్పడుతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా బ్రష్ చేయడం వల్ల.. పాచి వదిలించుకోవచ్చు. రెగ్యులర్ గా పాచి తొలగించకపోతే.. అది అతుక్కుపోతుంది. పంటిలో క్రిములు చేరడానికి కారణమవుతుంది.

పళ్లు పుచ్చిపోవడానికి

పళ్లు పుచ్చిపోవడానికి

పళ్లు పుచ్చిపోవడానికి ప్రధాన కారణం.. పంచదార. నోట్లో ఉండే బ్యాక్టీరియా పంచదారలోని యాసిడ్ ఉపయోగించి.. పంటిలో రంధ్రాలకు కారణం అవుతుంది.

తరచుగా తింటే రిస్క్

తరచుగా తింటే రిస్క్

చాలా తరచుగా ఆహారం పంటి దగ్గరకు చేరింది అంటే.. పంటిలో బ్యాక్టీరియా చేరుతుంది. దీనివల్ల.. మీ పళ్లను బలహీనంగా మార్చడానికి కారణమవుతుంది.

డ్రై మౌత్

డ్రై మౌత్

ఆహారాన్ని ముక్కలు చేయడానికి, తేలికగా మింగడానికి సాలివా చాలా ముఖ్యమైనది. అలాగే.. ఇది నోటిని మాయిశ్చరైజ్డ్ గా ఉంచి.. నోటి దుర్వాసన రాకుండా అడ్డుకుంటుంది.

పాచి తొలగించడం

పాచి తొలగించడం

పళ్లలో పాచి తొలగించడానికి దారం బాగా ఉపయోగపడుతుంది. పంటి చుట్టూ.. సీ షేప్ లో దారాన్ని పట్టి లాగితే.. పంటి చుట్టూ ఉన్న పాచి తొలగిపోతుంది.. మరీ గట్టిగా లాగితే.. చిగుళ్లకు హాని కలుగుతుంది.

బ్రషింగ్ వల్ల డ్యామేజ్

బ్రషింగ్ వల్ల డ్యామేజ్

పళ్లను బ్రష్ చేసేటప్పుడు.. మరీ దురుకుగా చేస్తే.. ఎనామిల్ పోయి, చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది. కాబట్టి.. చాలా సున్నితంగా, ఒత్తిడి లేకుండా.. బ్రష్ చేసుకోవాలి.

English summary

Things You Need To Know About Your Teeth

Things You Need To Know About Your Teeth. Our body is quite complicated and there are different functionalities for different organs and body parts.
Story first published:Tuesday, August 9, 2016, 15:30 [IST]
Desktop Bottom Promotion