Just In
- 3 hrs ago
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- 4 hrs ago
మీ ప్రియుడిలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీతో ‘ఆ కార్యానికి’ఆసక్తి చూపకపోవచ్చు..!
- 5 hrs ago
డయాబెటిస్: రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువ సూచించే లక్షణాలు
- 5 hrs ago
ఈ 4 రాశుల వారికి లీడర్ షిప్ క్వాలిటీస్ ఉండవు... ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి...
Don't Miss
- Movies
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- News
దక్షిణాదిలో ఒకే దెబ్బకు - బెంగాల్లో మాత్రం 8దశల్లో ఎన్నికలా? -ఈసీ తీరుపై మమత ఫైర్ -మోదీకి షాక్
- Sports
India vs England: 'టీమిండియాలో ఎందుకు లేవని ప్రశ్నించేవాళ్లు.. ఆ మాటలు నిత్యం గుర్తుకొచ్చేవి'
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మెయిన్ డోర్ ఎదురుగా కూల్చేసిన ఇల్లు ఉండకూడదా ?
ఇంటికి మెయిన్ ఎంట్రన్స్ డోర్ చాలా ముఖ్యమైనది. పాజిటివ్ ఎనర్జీ లేదా నెగటివ్ ఎనర్జీ ఏదైనా ఎంటర్ అవడానికి, బయటకుపోవడానికి ముఖద్వారం ప్రధానం. ఒకవేళ నెగటివ్ ఎనర్జీ.. మెయిన్ డోర్ ద్వారా ఇంట్లోకి వచ్చిందంటే.. ఆ వ్యక్తి ఎప్పటికీ సంపన్నుడు కాలేడు.
అలాగే.. మెయిర్ డోర్ ద్వారా పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రసరించిందంటే.. ఇంట్లోని వాళ్లందరికీ అదృష్టమే. అంటే వాస్తు శాస్త్రం చాలా ముఖ్యమైనదని అర్ధం. కాబట్టి మెయిన్ డోర్ నిర్మించేటప్పుడు.. ప్లాన్ మొత్తం చాలా కీలకంగా, పక్కాగా ఉండాలి.
మెయిన్ డోర్ విషయంలో పాటించాల్సిన, పాటించకూడని ముఖ్యమైన రూల్స్ ఉన్నాయి. చాలా ప్రాక్టికల్ ఉండే.. కొన్ని ఐడియాస్ ని, వాస్తు రూల్స్ ని మీకు వివరించబోతున్నాం. ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉందంటే.. దానికి రెమిడీస్ కూడా ఉన్నాయి. మరి ముఖద్వారం లేదా మెయిన్ డోర్ విషయంలో ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన వాస్తు నియమాలేంటో చూద్దాం..

స్టెప్స్
మెయిన్ డోర్ లో ఎంటర్ అవడానికి ముందు ఉండే స్టెప్స్ ఎప్పుడు బేసి సంఖ్యలో ఉండాలి. అంటే.. 3, 5,7 మెట్లు ఉండాలి.

ఎత్తు
మెయిన్ గేట్ ని.. రోడ్ లేదా లైన్ కంటే.. కొద్దిగా ఎత్తు ఉండేటట్టు నిర్మించుకోవాలి. సమానంగా లేదా ఎత్తు తక్కువగా ఉండకూడదు.

మెయిన్ డోర్ హైట్
మెయిన్ డోర్ ఎత్తు.. వెడల్పుకి రెండింతలు ఉండాలి. అంటే.. 5 అడుగుల వెడల్పులో ప్రధాన ముఖ్యద్వారం ఉంటే.. ఎత్తు వెడల్పుకి రెట్టింపు అంటే 10 అడుగులు ఖచ్చితంగా ఉండాలి.

నీడ
మెయిర్ డోర్ పై నీడ పడటాన్ని అశుభంగా భావిస్తారు. చెట్ల నీడలు కూడా తలుపుపై పడకూడదు.

ఎదురుగా
మెయిన్ డోర్ కి ఎదురుగా.. రద్దు చేసిన లేదా వదిలేసిన, లేదా కూలగొట్టిన ప్రదేశం ఉండకూడదు.

రోడ్డు
మెయిన్ గేట్ కలుస్తున్న రోడ్డుకి ఎదురుగా ఉండకూడదు. ఇలా ఉంటే.. మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ఆలోచనలు ఫలితాన్ని ఇవ్వలేవు.

మధ్యలో
మెయిన్ డోర్ ని గోడకు మధ్యలో ఉంచకూడదు. కొద్ది తేడాతో అయినా.. సైడ్ కి ఉండాలి.

చెక్క
మెటల్ ఫ్రేమ్స్ ఉపయోగించకపోవడమే మంచిది. మంచి క్వాలిటీ ఉన్న చెక్కతో తయారు చేసిన డోర్స్ ని ఉపయోగిస్తే మంచిది.

ఫేసింగ్
ప్రధాన ద్వారం తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్యంవైపు ఉండాలి. ఈ ముఖంగా ప్రధాన ద్వారం ఉంటేనే.. మంచిది. అదృష్టం, సంపద వరిస్తుంది.

నైరుతీ
నైరుతీ వైపు ఫేస్ చేసిన డోర్స్.. మంచిది కాదు. ఇలాంటి ఎంట్రన్స్ ఉంటే.. డెవిల్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుందట. అలాగే సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తీసుకొస్తాయి.

మెయిన్ డోర్
మెయిన్ డోర్ ఎప్పుడూ లోపలికి తీసేలా ఉండాలి. అంటే.. డోర్ ఓపెన్ చేస్తే.. బయటకు కాకుండా.. లోపలికి వెళ్లాలి. అది కూడా.. క్లాక్ వైజ్ వెళ్లాలి.

పరిష్కారం
ఒకవేళ మీ డోర్ పైన చెప్పినట్టు లేకపోతే.. కొండను ఎత్తుకున్న ఆంజనేయుడిని డోర్ పై అతికించాలి.

నైరుతీ
ప్రధాన ద్వారం నైరుతి వైపు ఉంటే.. అనారోగ్యం, కోపం, కోర్టు సమస్యలు తీసుకొస్తుంది. ఒక వేళ మీ డోర్ ఇలాంటి డైరెక్షన్ లో ఉంటే.. గాయత్రి మంత్రంతో ఉన్న రెండు స్టిక్కర్స్ ని ఎంట్రన్స్ లో అతికించాలి.