For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మన ఇండియన్స్ లో ఉండే అత్యంత భయంకరమైన ఫోబియాలు..

|

ఫోబియా అంటే భయం. చీకట్లో తాడును చూసి మనవాళ్ళు పాము అనుకోని భయపడతారు. ఇది ఒక భయం. అయితే, కొంతమంది సీలింగ్ ఫ్యాన్స్ ను చూసి భయపడతారు .

ఇంట్లో సీలింగ్ కు ఫ్యాన్ ఉన్నా ఎలాంటి పరిస్తితులలోను దానిని ఆన్ చేయరు. దీనిని ఫోబియా అంటారు. భూమిపై పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక ఫోబియా అన్నది ఉంటుంది.

ఫోబియా నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా కొందరికి సాధ్యం కాదు. దీనిని ఇలాగే వదిలేస్తే.. అది ముదిరి మానసిక వ్యాధిలా మారుతుంది. కాబట్టి ఫోబియా నుంచి బయటపడేందుకు తప్పకుండా మానసిక వైద్యులను సంప్రదించాలి.

విమాన ప్రయాణాలు:

విమాన ప్రయాణాలు:

కొంత మంది గాల్లో ప్రయాణాలంటే చచ్చేంత భయం. ఎయిర్ క్రాఫ్ట్ లో ప్రయాణించడం అంటే చచ్చేంత భయం.

చీకటంటే భయం:

చీకటంటే భయం:

వెలుగు లేకపోతే వచ్చేది చీకటే.. ఈ విషయం అందరికీ తెలిసిందే. చీకటిని చూడగానే.. భయం వేస్తుంది. చీకట్లో ఏముంటుందో.. లోపలికి వెళ్తే ఏమౌతుందో అని భయపడుతుంటారు. ఇలాంటి భయాలు ఎక్కువగా ఆడవారికి ఉంటాయి.

ఇంజెక్షన్స్:

ఇంజెక్షన్స్:

ఇంజెక్షన్స్ అంటే పిల్లలు మాత్రమే భయడపడుతారంటే అది ఒక అపోహ మాత్రమే. పెద్దలు కూడా ట్రైఫోనోఫోబియక్ ఫియర్ తో భయపడుతారు.

ఉరుములంటే భయం :

ఉరుములంటే భయం :

వర్షకాలం వచ్చిందంటే ఇక అంతే ఎప్పుడు ఉరుములు, మెరుపులొస్తాయో అన్న ఫోబియో వారిలో ఆందోళన కలిగిస్తుంది.

డర్టీ హ్యాండ్స్ అంటే అత్యంత భయం:

డర్టీ హ్యాండ్స్ అంటే అత్యంత భయం:

భోజనం చేసే సమయంలో చేతులు కడుక్కోవాలి. లేకపోతే చేతికున్న మట్టి భోజనంలో కలిసిపోయి రోగాలు వస్తాయి. ఇది ఆరోగ్య సూత్రమే. అయితే, ఈ ఆరోగ్య సూత్రాన్ని కొంతమంది మరి అతిగా ఫాలో అవుతారు. ఒకటికి రెండు నాలుగు సార్లు చేతులు కడుక్కుంటారు.

పబ్లిక్ లో మాట్లాడాలంటే:

పబ్లిక్ లో మాట్లాడాలంటే:

ఒంటరిగా ఉన్నప్పుడు.. లేదా తనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులతోనైనా బాగా మాట్లాడతారు. వాళ్ళని చూస్తే.. వీరెంత మాటకారులో అనిపిస్తుంది. వారి మాటలు కూడా అలాగే ఉంటాయి. కాని, సడెన్ గా మైక్ ఇచ్చి, పబ్లిక్ లో మాట్లాడమంటే మాత్రం ఒక్కమాట కూడా బయటకు రాదు. కాళ్ళు చేతులు గజగజ వణికిపోతాయి. చెమటలు పట్టేస్తాయి.

మరణం:

మరణం:

చావంటే భయపడే వారు చాలా మందే ఉంటారు. అందుకే చావును జయించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని కాపడుకుంటుంటారు.

ఎలివేటర్స్ అంటే మరింత భయం:

ఎలివేటర్స్ అంటే మరింత భయం:

మారుతున్న టెక్నాలజీతో పాటుగా మనంకూడా మారాలి. అప్పుడే ఏదైనా చేయగలం. టెక్నాలజీ అభివృద్ధి లోకి వచ్చాక ఎలివేటర్ల వాడకం పెరిగిపోయింది. బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జరుగుతుండటంతో ఎలివేటర్ల వాడకం పెరిగింది. కొందటి మాత్రం ఏది ఏమైనా సరే ఎలివేటర్ ఎక్కామని భీష్మించుకొని కూర్చుంటారు. బలవంతం చేస్తే.. ఎక్కుతారు కాని, కళ్ళుమూసుకొని బయటకు వచ్చేవరకు అలాగే ఉంటారట.

ఎత్తైన ప్రదేశాలంటే భయం :

ఎత్తైన ప్రదేశాలంటే భయం :

ఎత్తైన ప్రదేశాల నుంచి చూస్తే.. చూట్టు ఉన్న ప్రదేశాలు మొత్తం అందంగా కనిపిస్తాయి. పైగా ఎత్తైన ప్రదేశాలలో వాతావరణం చల్లగా ఉంటుంది. అయితే, కొంతమందికి హైట్ ప్రదేశాలకు వెళ్ళాలన్నా.. అక్కడి నుంచి కిందకు చూడాలన్న భయపడిపోతారు. అక్కడి నుంచి కింద పడిపోతామేమో అనే భయంతోనే వారు అక్కడికి వెళ్లరట.

పాములు:

పాములు:

పాములను చూడగానే ఆమడ దూరంగ పరుగెడుతుంటారు. ఈ ఫోభియా ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది.

బొద్దింకలంటే చచ్చేంత భయం:

బొద్దింకలంటే చచ్చేంత భయం:

బొద్దింక నిశాచర జీవి. ఎక్కువ రాత్రిళ్ళు మాత్రమే తిరుగుతుంటుంది. అంతేకాదు.. ఇది సర్వభక్షజీవి. బొద్దింక ను చూస్తే అందరికీ భయం వేస్తుంది. అయితే, కొందరు మాత్రం బొద్దింక పేరు వినగానే లేచి పరుగుతీస్తారు. కాక్రోచ్ ఫోబియా వలన ఇలా జరుగుతుందట.

కుక్కలు:

కుక్కలు:

కుక్కలు పెంపుడు జంతువులే అయినా చాలా మంది వీటికి బయపడుతారు. ముఖ్యంగా ఇవి కరిస్తే రెబిక్స్ వ్యాధి సోకుతుందని, బొడ్డు చుట్టూ ఇంజెక్షన్స్ వేయించుకోవాలనే ఫోబియా వీరిని పట్టి పీడిస్తుంది.

బైక్ రైడింగ్ కు బయపడుతారు:

బైక్ రైడింగ్ కు బయపడుతారు:

యువతకు బైక్ నడపడం అంటే మహా ఇష్టం. మేఘాలలో తెలిపోతున్నట్టుగా బైక్ ను నడుపుతుంటారు. వారి స్పీడ్ కు హద్దుండదు. అయితే, కొంతమంది మాత్రం బైక్ వచ్చిన ఎలాంటి పరిస్థితులలోను దాని జోలికి పోరు. ఎక్కడ పడతామో.. ఏం జరుగుతుందో అని భయపడతారు.

English summary

Top 13 Most Common Phobias in Indian People

Fear is an emotion that is experienced by all human beings. While some fear death, uncertainity, rejection and pain, others fear things like darkness, strangers, heights, animals and many more. Here is a list of fears that most of us deal with our in our day to day lives:
Story first published: Thursday, June 9, 2016, 18:51 [IST]
Desktop Bottom Promotion