For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్నేహితుడు చనిపోయినట్లు కల వస్తే అర్థం ఏమిటి..?

కలలు ఎంతో స్ఫూర్తి దాయకం కావడమే కాక, చాలా అనిర్ధారిత నమ్మకాలకి తావు ఇవ్వడం, కలల సుదీర్ఘమైన చరిత్ర లో మనకి కనిపిస్తుంది. కలలలో ఏదో అంతరార్థం ఉందన్న నమ్మకం, కలల సహాయంతో భవిష్యత్తుని తెలుసుకోవచ్చన్న నమ్మ

|

నిద్రకి చెందిన కొన్ని స్థితులలో అసంకల్పితంగా మనసులో మెదిలే భావాల, భావావేశాల, ఐంద్రియ సంవేదనల సందోహాలను స్వప్నాలు లేదా కలలు (Dream) అంటారు. కలల యొక్క అంతరార్థం ఏమిటో, వాటి ప్రయోజనం ఏమిటో ఇప్పటికీ మనకి పూర్తిగా అర్థం కాదు. కాని కలల గురించి ఎంతో ఊహాగానం, అనిర్ధారిత చింతన మనకి చరిత్రలో కనిపిస్తుంది. కలల యొక్క శాస్త్రీయ అధ్యయనాన్ని ఓనేరాలజీ (Oneirology) అంటారు.

What does it mean when you dream your friend died in accident?

కలలు ఎంతో స్ఫూర్తి దాయకం కావడమే కాక, చాలా అనిర్ధారిత నమ్మకాలకి తావు ఇవ్వడం, కలల సుదీర్ఘమైన చరిత్ర లో మనకి కనిపిస్తుంది. కలలలో ఏదో అంతరార్థం ఉందన్న నమ్మకం, కలల సహాయంతో భవిష్యత్తుని తెలుసుకోవచ్చన్న నమ్మకం ఎన్నో సమాజాలలో అనాదిగా చలామణిలో ఉంది. కలలకు ఆధారం మనస్సులో ముద్రితమైన సునిశిత ఆలోచనలే! కొన్ని సందర్భాల్లో కొందరికి తీరని వాంఛలు కలల్లో తీరుతుంటాయన్నది నిజం.

What does it mean when you dream your friend died in accident?

ఏ అర్ధరాత్రో, తెల్లవారుజామునో సెడెన్ గా మెలకువ వస్తుంది. పాడు కలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటారు...

కలలో...మీ ఫ్రెండ్‌కు యాక్సిడెంట్ జరిగి చనిపోతాడు..! 'ఫ్రెండ్‌ను గుండెలో పెట్టుకొని ప్రేమించే నాకు ఇలాంటి కల రావడం ఏమిటి?' అని ఆశ్చర్యపోతారు. ఆ కలను అసహ్యించుకుంటారు. స్నేహితుడికే కాదు... ఆ కలను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి.

What does it mean when you dream your friend died in accident?

''నీకు తప్ప ఇలాంటి కలలు ఎవరికి వస్తాయి!'' అని వెక్కిరిస్తారేమోనని భయం. ఇటువంటి కలలను ఇతరుతో చెప్పుకోలేక, వారి మనస్సులోనే పెట్టుకుని మథన పడిపోతుంటారు. ఇటువంటి కలలకు అర్థం ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

మనం ఎవరినైనా బాగా ప్రేమిస్తున్నప్పుడు, అభిమానిస్తున్నప్పుడు...వారి బాగోగులు, యోగక్షేమాల గురించి చాలా ఎక్కువ శ్రద్ధ పెడతాం.

What does it mean when you dream your friend died in accident?

ఉదాహరణకు... 'వెళ్లొస్తాను' అని స్నేహితుడు టాటా చెప్పి బైక్ మీద బయలుదేరే సమయంలో 'జాగ్రత్తగా వెళ్లు' అంటాం.

ఇక మన మనసు మహల్‌లో ఈ 'జాగ్రత్త' రకరకాల రూపాలు ధరిస్తుంది. అనేకానేక ప్రశ్నలు పుట్టగొడుగుల్లా పుడుతుంటాయి.

'జాగ్రత్తగానే వెళ్లాడా?' 'మొన్న ఒక రోడ్డు యాక్సిడెంట్‌ను కళ్లారా చూశాను. వీడికి అలా కాలేదు కదా?' 'డ్రైవింగ్ చేస్తూ ఏదో ఆలోచిస్తుంటాడు. ఎన్నో సార్లు చెప్పాను, అలా ఆలోచించవద్దని.

What does it mean when you dream your friend died in accident?

జాగ్రత్తగానే వెళ్లి ఉంటాడా?' 'వేగంగా డ్రైవ్ చేయవద్దని వెయ్యిసార్లు చెప్పి ఉంటాను. ఇప్పుడు కూడా అలానే వెళ్లి ఉంటాడా?...' ఇలా రకరకాల జాగ్రత్తలన్నీ కలిసి ఒక రూపాన్ని తీసుకుంటాయి. అవే కలలుగా మారుతాయి. అంతకు మించి ఇలాంటి కలల గురించి భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు.

English summary

What does it mean when you dream your friend died in accident?

Dreams are a normal part of our physiological system that helps maintain restful sleep. According to a latest research, dreaming is considered as a sign of a healthy and interactive mind and it helps the brain to transfer the thoughts that are in your temporary memory to permanent memory.
Story first published: Wednesday, October 19, 2016, 7:33 [IST]
Desktop Bottom Promotion