Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
క్రేజీ గాయ్స్ అంటూ.. మెరిసే అమ్మడికి బిలియన్స్ లో ఫ్యాన్స్
ఇంటర్నెట్.. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని క్రేజీగా మార్చేసినది. బస్ లో ఉన్నా.. ట్రైన్ లో ఉన్నా.. క్లాస్ లో ఉన్నా.. ఆఫీస్ లో ఉన్నా.. వంట చేస్తున్నా.. ఏ పనిలో ఉన్నా.. అందరినీ ఉర్రూతలూగిస్తోంది ఇంటర్నెట్. ప్రతి ఒక్కరికీ దీనితో పని ఉంది. అందుకే అందరూ అడిక్ట్ అయిపోయారు. ఇంటర్నెట్ లేకుండా.. ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నారు.
READ MORE: లైఫ్ క్రేజీగా ఉండాలంటే ఈ 25పనులు చేయాల్సిందే
యూత్ ని అతిగా ఆకట్టుకుంటోంది ఇంటర్నెట్. ప్రపంచం మొత్తాన్ని చుట్టేసి అరచేతిలో పెట్టే సింపుల్ రెమిడీ ఇంటర్నెట్. ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా.. క్షణాల్లో కళ్లముందు కళ్లకు కట్టినట్టు చూపించే ఇంటర్నెట్ అంటే.. కుర్రకారు తెగ ఎట్రాక్ట్ అవుతారు. అయితే ఇంటర్నెట్ కి ఉన్న క్రేజ్ కి తగ్గట్టే.. 2జీ పోయి.. 3జీ వచ్చింది. అది కూడా కనుమరుగై.. ఇప్పుడు 4జీ వచ్చి.. యువతరాన్ని పిచ్చెక్కిస్తోంది.

4జీ అంటేనే గుర్తొచ్చేది.. ఎయిర్ టెల్ 4జీ యాడ్. ఈ యాడ్ లో సమాచారం కంటే.. ఎక్కువగా యాడ్ గర్ల్స్ చాలా ఫేమస్ అయింది. ఒక్క యాడ్ తోనే కోట్లాది మంది యువత హృదయాలను కొల్లగొట్టింది. ఈ యాడ్ లో కనిపిస్తున్న సాషా ఛెత్రీ మధ్యప్రదేశ్ లోని భోపాల్ కి చెందిన అమ్మాయి. ప్రస్తుతం ఎంబీఏ చదువుతోంది ఈ అమ్మాయి. క్రేజీ గాయ్స్ అంటూ.. యాడ్ లో మెరిసిపోతున్న ఈ అమ్మడు.. క్రేజీ అంటూనే.. కుర్రకారుకి క్రేజీ అయిపోయింది. పొట్టి హెయిర్ కట్, గుండ్రటి నగుమోము.. చూస్తుంటే చూడాలనిపించే.. సౌందర్యం, చక్కటి వాక్చాతుర్యంతో అందరి దృష్టిని ఆకర్షించింది సాషా.
READ MORE: ఒక వ్యక్తి మిమ్మల్నిఎక్కువగా ఇష్టపడటానికి 10 మార్గాలు
ఈ అమ్మాయి పేరేమో గానీ.. ఎయిర్ టెల్ 4జీ గర్ల్ గా పేరు సంపాదించింది. ఈ అమ్మాయి 2015లో గూగుల్ సెర్చ్ లో ఎక్కువ మంది వెతికిన వారి జాబితాలో కూడా చేరిపోయిందంటే.. ఆశ్చర్యం కలుగక మానదు. అంతేకాదు.. 2015 డిసెంబర్ 1 వరకు ఈ క్రేజీ బ్యూటీ టీవీ స్క్రీన్ పై 475 గంటలపాటు కనిపించిందట.

ఇక సాషా క్రేజ్ కి యూట్యూబ్, ట్విట్టర్లు కూడా దాసోహమయ్యాయంటే.. నమ్మరేమో. చిన్న యాడ్ తోనే ఎంతలా పాపులర్ అయిందంటే.. యూత్ మొత్తం కేరింతలు కొట్టేస్తున్నారు. ఈ అమ్మాయి కోసం గాలిస్తున్న కుర్రకారు సంఖ్య పెరిగిపోయింది. కేవలం గూగూల్ లో మాత్రమే కాదు.. యూట్యూబ్, ట్విట్టర్ లలో 1.2 బిలియన్ల మంది సాషా కోసం గాలించారట.
READ MORE: ఆఫీసులో ఉన్నప్పుడు చెయ్యకూడని 12 పిచ్చి పనులు
సినిమా హీరోలు, బాలీవుడ్ స్టార్స్, హాట్ బ్యూటీస్ కోసం తపించిపోయే యూత్ యాడ్ లో మెరిసిన అందగత్తె కోసం ఇంతలా వెతుకుతున్నారంటే క్రేజీనే మరి. మోడల్ లా పాపులారిటీ సంపాదించిన ఈ అమ్మాయి నిజంగానే.. యాడ్ తోనే అనేక మంది ఫాలోవర్స్ ని సంపాదించింది. చాలా న్యాచురల్ గా కనిపించే ఎక్స్ ప్రెషన్స్, స్మైల్, వాయిస్ అన్నీ ఈ క్రేజీ గాల్ కి ప్లస్ పాయింట్స్ అయ్యాయి. అరనిమిషం యాడ్ కనిపించే అమ్మాయికి ఇంత ఫాలోయింగ్ ఉందంటే.. మామూలు విషయం కాదు కదా.. !!



Click it and Unblock the Notifications