Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
వావ్ వండర్: మీరు ఎప్పుడు నిద్రపోతారో మీ జుట్టుకి తెలుస్తుందట..!
జుట్టు అంటే అందరికీ ఇష్టం. అమ్మాయిలను, అబ్బాయిలను అందంగా, ఆకర్షణీయంగా చూపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే.. జుట్టు తెల్లబడుతుంది, రాలుతుంది వంటి విషయాలు కాదు.. జుట్టు గురించి కొన్ని ఆశ్చర్యకర ఫ్యాక్ట్స్ ఉన్నాయి.
మీ జుట్టుకి మీరు ఎప్పుడు నిద్రపోతారో తెలుసట. వావ్ అదెలా అని ఆశ్చర్యపోతున్నారా ? నిజమే.. ఇలాంటి ఆశ్చర్యకరమైన మరెన్నో విషయాలు మీకోసం..

జుట్టు తంతువులు
ఏ సందర్భంలో అయినా.. మీ స్కాల్ప్ ఒక లక్ష నుంచి ఒకటిన్నర లక్ష వరకు జుట్టు తంతువులను కలిగి ఉంటుంది.

బట్టతల
ఒకవ్యక్తి తనకు బట్టతల వస్తుందని గ్రహించడం చాలా కష్టమట. మొదట్లోనే గుర్తించలేరట. దాదాపు 50 శాతం బట్టతల వస్తే గానీ.. బట్టతల వస్తోందని గుర్తించలేరట.

ఫ్యాట్ టిష్యూ
జుట్టు రగ్గులా వ్యవహరిస్తుందట. ఎందుకంటే.. తలను వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. స్కాల్ప్ లో తప్ప శరీరమంతా ఫ్యాట్ టిష్యూస్ ఉంటాయట.

జీవిత కాలం
ఒక్కో జుట్టు తంతువు జీవిత కాలం 5 నుంచి 7 ఏళ్లు ఉంటాయి.

పెరుగుదల
సమ్మర్ లో హ్యుమిడిటీ జుట్టుని చిక్కుపడేలా చేసినా.. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఎందుకంటే.. హీట్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది.

హెయిర్ ఫోలికల్
మీకు ఐదు నెలలు ఉన్నప్పుడు హెయిర్ ఫోలికల్ ఏర్పడతాయి. అవి మీ జీవితాంతం ఉంటాయి.

నానో చిప్
మీ జుట్టు నానో చిప్ లాంటిది. ఇది మినరల్స్, విటమిన్స్, డ్రగ్స్ ని రికార్డ్ చేసుకోగలుగుతుంది.

12 టన్నులు
మీ మొత్తం జుట్టు తంతువులన్నీ.. కలిసి రెండు ఏనుగుల బరువుకి సపోర్ట్ చేయగలవు. అంటే.. 12 టన్నుల బరువునన్నమాట.

నిద్రపోవడాన్ని
మీ జుట్టు తంతువులు క్లాక్ జెనెస్ ని కలిగి ఉంటాయి. ఇవి శరీర కదలికలను గ్రహించగలుగుతాయి. అంటే.. మీ జుట్టు మీరు ఎప్పుడు నిద్రపోతారు, ఎప్పుడు లేస్తారు అనేది గ్రహించగలుగుతుంది.

సగం ఇంచు
నెలకు సగం ఇంచు జుట్టు పెరుగుతుంది. రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలుతాయి.

తినకూడదు
జుట్టుని శరీరం జీర్ణం చేసుకోలేదు. కాబట్టి పొరపాటున తిన్నా కూడా.. ప్రాణానికే ముప్పు.

ఈజిఫ్టియన్లు
శరీరంపై అవాంఛిత రోమాలు తొలగించుకునే అలవాటుని.. మొదట ఈజిప్టియన్లు స్టార్ట్ చేశారు.



Click it and Unblock the Notifications