For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక అబ్బాయి కడుపులో 1 కేజీ చెక్క మరియు ప్లాస్టిక్ బయటపడ్డాయి

|

కొన్నిసార్లు మనుషులు తినే వస్తువులు షాక్ కలిగిస్తాయి,ఎందుకంటే ఆ వస్తువులు అంత విచిత్రంగా ఉంటాయి. మేమంటోంది బల్బులు అలాంటి తేడా వస్తువుల గురించి.

ఇలాంటి విచిత్ర,భయం వేసే తినే వస్తువుల మధ్య, భారత్ లో ఈ మధ్య ఒక వార్త ప్రకారం ఒక అబ్బాయికి ఎంత విచిత్రమైన తినే రోగం వచ్చిందంటే అతను చెక్కను తినటం మొదలుపెట్టాడు.

మనుషుల నుంచి వైద్యులు వెలికితీసిన విచిత్ర వస్తువులు; #3 అయితే భయంకరం!

వైద్యులు అతను బ్రతకడం చాలా కష్టమని చెప్పారు, ఎందుకంటే అతని కడుపులో ఒక ముడి పడిపోయి ఒక్క చుక్క నీరు కూడా లోపలికి వెళ్ళలేదు!

ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి…

ఈ అబ్బాయికి 16 ఏళ్ళు

ఈ అబ్బాయికి 16 ఏళ్ళు

అర్జున్ షా అనే ఈ అబ్బాయికి 16 ఏళ్ళు. భారత్ కి చెందిన ఇతనికి రహస్యంగా ప్లాస్టిక్ ముక్కలను చప్పరించటం, చెక్కను మింగేయటం వంటి అనేక అలవాట్లు,పన్లు అతన్ని బిజీగా ఉంచుతాయి.

పికాతో బాధపడ్డాడు

పికాతో బాధపడ్డాడు

వైద్యుల ప్రకారం అతను పికా అనే ఈటింగ్ డిజార్డర్ తో బాధపడుతున్నాడు. ఈ అనారోగ్య స్థితిలో ఉన్నవారు సున్నా పోషక విలువలున్న అన్ని వస్తువులను ఆనందిస్తూ తింటుంటారు. ఈ లిస్టులో తినడానికి భయంకర వస్తువులైన చెక్క, రబ్బరు ఇంకా ప్లాస్టిక్ కూడా ఉంటాయి!

అతనికి కడుపు నొప్పి వచ్చింది

అతనికి కడుపు నొప్పి వచ్చింది

అర్జున్ కి కడుపు చాలా భారంగా ఉండి ఒక వారం రోజుల్లోనే 15 కిలోల బరువు తగ్గిపోయాడు. వైద్యులు అది అల్సర్ పుండు కారణంగా అనుకొన్నారు కానీ షాకింగ్ విషయం అతని కడుపులో కెమెరా పెట్టి చూసాక తెలిసింది, అతని నొప్పికి అసలు కారణం బయటపడింది.

అతనికి వెంటనే ఆపరేషన్ చేసారు

అతనికి వెంటనే ఆపరేషన్ చేసారు

వైద్యులకి అతని నొప్పికి అసలు కారణం తెలిసాక, మరింత టైమ్ వేస్టు చేయకుండా రెండు సార్లు ఆపరేషన్ చేసి, 300గ్రాముల వస్తువులను బయటకి తీసారు.

అతనికి ఇంకా సర్జరీలు అవసరం

అతనికి ఇంకా సర్జరీలు అవసరం

డాక్టర్లు 300 గ్రాముల చెక్కను ఆ అబ్బాయి కడుపులోంచి తీసాక కూడా ఇంకా 700 గ్రాములు కడుపులోనే ఉందని, దాన్ని తీయడానికి 2 ఆపరేషన్లు ఇంకా అవసరమని చెప్పారు. ఆ అబ్బాయి ఇంకా బ్రతికే ఉన్నాడంటే అదృష్టమే.

అతను త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో మాకు కూడా తెలపండి.

Image courtesy

Image courtesy:

English summary

Surgeons Remove 1 Kg Of Wood From The Boy's Stomach

He hid from his parents and chewed on bits of wood as he enjoyed it…
Story first published:Friday, November 24, 2017, 20:52 [IST]
Desktop Bottom Promotion