ఈ ఫొటోల వెనుకున్న గాథలు తెలిస్తే కన్నీరు ఆగదు

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

కొన్ని ఫొటోలను చూస్తే మనస్సు చలించిపోతుంది. గతంలో జరిగిన ఎన్నో సంఘటలనకు ప్రతీకలు ఈ చిత్రాలు. గతించిన క్షణాల్ని మళ్లీ గుర్తు చేస్తాయి ఈ ఫోటోలు. వాటిని చూస్తే గత చరిత్రలోని వాస్తవాలు మళ్లీ గుర్తొస్తాయి. విషాదం, సంచలనం, ప్రళయం, ప్రాణబీతి ఇలా సమస్తం శాశ్వతంగా మనకు గుర్తుండేలా చేస్తాయి ఈ చిత్రాలు. ఈ చేదు జ్ఞాపకాలన్నీ ఇంకా సజీవం గానే మనతో ఉండేటట్లు చేస్తాయి ఈ ఫొటోలు. ఇలా గుండెల్ని పిండేసే ఎన్నో ఫొటోలు ఉన్నాయి. విగ‌త జీవులైన చిన్నారులు.. చివరి శ్వాసలోనూ ఉండే అనురాగం, మరో క్షణంలో ప్రాణం పోతున్నా ముఖంలో చెదరని చిరునవ్వు ఇలాంటి ఫొటోలు అదరినీ క‌లిచివేస్తాయి. త‌మ వృత్తిధ‌ర్మంలో భాగంగా ఈ హృద‌య విదార‌క ఘ‌ట‌న‌ల‌ను ఫొటోలుగా తీశారు ఫొటోగ్రాఫర్స్.

హృదయవిదారకమైన ఈ ఫొటోలను మీరూ చూడండి.

వాటి వెనుకున్న గాథలు ఏమిటో తెలుసుకోండి.

1. భోపాల్ దుర్ఘటన - 1984

1. భోపాల్ దుర్ఘటన - 1984

ప్రపంచంలోనే అత్యంత ఘోర దుర్ఘటనల్లో ఒకటి భోపాల్ ఘటన. 1984 లో ఓ ఫ్యాక్టరీలో విడుదలైన విష వాయువు కొన్ని వేల మంది ప్రాణాలను తీసుకుంది. అలా చనిపోయిన వారిలో ఈ చిన్నారి కూడా ఒకడు. విషవాయువు వల్ల ప్రాణాలు వదిలాడు. ఆ బాలుడి అంత్యక్రియల సమయంలో ప్రముఖ ఫొటోగ్రాఫర్ రఘురాయ్ ఈ ఫొటో తీశారు. అయితే ఈ చిన్నారి ఎవరనే విషయం ఎవరికీ తెలియదు. కానీ భోపాల్ దుర్ఘటనకు ఈ ఫొటో నిలువెత్తు నిదర్శనం. ఇప్పటికీ ఎప్పటికీ భోపాలు ఇన్సిడెంట్ అనగానే ఈ ఫొటోనే అందరి కళ్లలో మెదులుతుంది.

2. ఢాకా వస్త్ర కర్మాగారం కూలిపోవడం - 2013

2. ఢాకా వస్త్ర కర్మాగారం కూలిపోవడం - 2013

2013 ఏప్రిల్ 25 న ఢాకాలోని ఒక వస్త్ర కర్మాగారం కూలిపోయింది. ఎనిమిదంతస్తుల ఈ గార్మెంట్ ఫ్యాక్టరీ కుప్పకూలడంతో శిథిలాల కింద ఎంతోమంది సమాధి అయిపోయారు. వాళ్లని వెలికితీసేటప్పడు ఈ ఫొటోలోని ఇద్దరూ ఇలా కనపడ్డారు. వారి మధ్య అనురాగానికి ప్రతీకగా నిలిచింది ఈ ఫొటో ఫొటోగ్రాఫర్ తస్లిమా అక్తర్ తీసిన ఈ ఫొటో అందరి హృదయాలను కదిలించి వేస్తుంది.

3. ఆప్ఘనిస్తాన్ బాలిక - 1985

3. ఆప్ఘనిస్తాన్ బాలిక - 1985

1984 లో తీసిన ఈ ఫొటో ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలచింది. ఆకుపచ్చ కళ్లతో ఉండే ఈ ఆఫ్ఘన్ అమ్మాయి ఫొటో నేషనల్ జియోగ్రాఫిక్ మ్యాగజైన్ ఫ్రంట్ పేజీపై ప్రచురితమైంది. ఈ ఫొటోను పాత్రికేయుడు స్టీవ్ మెక్కర్రీ క్లిక్ మన్పించారు. అంతేకాదండోయ్ ఈమెను మోనాలిసా అంటూ అందరూ ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఈమె ఫొటో పాపులర్ అయిపోయింది.

4. సిరియా బాలుడు ఒమ్రాన్ డాక్వినీష్

4. సిరియా బాలుడు ఒమ్రాన్ డాక్వినీష్

సిరియాలో యుద్ధం వైరల్ వెళ్ళిన 5 ఏళ్ల సిరియన్ కిడ్ యొక్క ఫోటో బాగా స్వాధీనం. యుద్ధం యొక్క భయానక చిత్రం ఓంరాన్తో దుమ్ము, రక్తంతో కప్పబడి, అంబులెన్స్ కోసం ఓపికగా ఎదురుచూడడం ద్వారా బాగా కనిపిస్తుంది. ఈ చిత్రంలో అమెరికాలో 6 ఏళ్ల కిడ్తో చాలా సానుభూతి కలిగిన ప్రతిస్పందన వచ్చింది సైనిక దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు ముక్కు పచ్చలారని ఈ సిరియా బాలుడు ఒమ్రాన్ డాక్వినీష్. ఈ చిత్రాన్ని చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. అలెప్పొలో జరిగిన దాడి తీవ్రతకు దుమ్ము, ధూళి పేరుకుపోయి.. ముఖంపై ఓ వైపు రక్తం ధారగా కారుతున్న ఈ బాలుడి ఫొటో అందరి కంట కన్నీరు పెట్టించింది. గాయపడి రక్తపు బట్టల్లో ఉన్న ఒమ్రాన్ వీడియోను సోషల్ మీడియాలో బోల్డన్ పోస్ట్ చేయగా కొన్ని లక్షల మందిపైగా వీక్షించారు. సిరియాలో జరుగుతున్న మారణహోమానికి గాయపడిన ఈ చిన్నారి ఒమ్రాన్ చిత్రమే ప్రత్యక్ష సాక్ష్యంంగా నిలిచింది. సిరియాలో నెలకొన్న కల్లోల పరిస్థితులకు సామాన్యులుఎలా సమిధలౌతున్నారో చాటిచెప్పే ఓ బాలుడి చిత్రం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఒమ్రాన్ అంబులెన్స్ లో కూర్చున్న సమయంలో ఓ పాత్రికేయుడు తీసిన ఫోటో ఇది. ఒమ్రాన్ ఫోటోతో అంతర్జాతీయ సమాజం కదిలిపోయింది.

5. సిరియన్ బాలుడు అయ్‌లాన్-2015

5. సిరియన్ బాలుడు అయ్‌లాన్-2015

2015, సెప్టెంబర్ లో టర్కీలోని బాడ్రమ్ దగ్గర, సముద్ర తీరంలో ఓ రెండేళ్ల పిల్లాడి మృతదేహం ఇసుకలో కూరుకుపోయి కనిపించింది. సిరియన్ బాలుడైన అయ్‌లాన్ మృతదేహం అది. వలసవాది అయిన తండ్రి సిరియన్లపై జరుగుతోన్న దాడులకు భయపడి తన భార్యాపిల్లలతో పడవలో గ్రీసుకు బయల్దేరాడు. అయితే మార్గమధ్యలో పడవ తిరగబడింది. అయ్‌లాన్ తో పాటు అతని తల్లి, అన్నయ్య మరణించారు. కెరటాల తాకిడికి అయ్‌లాన్ ఒడ్డుకు కొట్టుకొచ్చాడు. దీంతో టర్కీతో పాటు ప్రపంచమంతా ఒక్కసారిగా నివ్వెరపోయింది. ఈ ఫొటో చూసిన అందరూ కంటతడి పెట్టారు.

6. చేతులు పైకెత్తిన సిరియా చిన్నారి ఫొటో - 2015

6. చేతులు పైకెత్తిన సిరియా చిన్నారి ఫొటో - 2015

సిరియా శరణార్థుల చిత్రాలను తీసే క్రమంలో టర్కీ ఫోటో జర్నలిస్ట్ ఉస్మాన్ సాగ్రిలి తీసిన ఫొటో ఒది. ఒక చిన్నపాప తన రెండు చేతులను ఇలా రైజ్ చేసిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఇంటర్నెట్ లో ఈ ఫొటో హల్ చల్ చేసింది. సిరియాలో సామాన్యులపై జరిగిన దాడుల నేపథ్యంలో ఈ ఫొటో ప్రత్యేకతను సంతరించుకుంది.

7. ఒమైరా సాంచెజ్, కొలంబియా 1985

7. ఒమైరా సాంచెజ్, కొలంబియా 1985

కొలంబియాలోని నెవడో డెల్ రూయిజ్ అగ్నిపర్వతం నవంబర్ 13, 1985లో బద్దలై నిప్పులు కక్కింది. లావా అంతటా వ్యాపించింది. చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ అతలాకుతలం అయ్యాయి. అందులో అర్మెరో గ్రామం కూడా ఈ విధ్వంసానికి బలైంది. ఒమైరా సాంచెజ్ అనే 13 ఏళ్ల బాలిక కూడా ఈ ప్రమాదంలో చిక్కుకుపోయింది. ఒమైరా బురద, కాంక్రీటు, నీరు కలిసిన మడుగులో చిక్కుకుపోయింది. రెస్క్యూ టీములు వచ్చినా ఒమైరా కాళ్లు ఇటుకల మధ్య ఇరుక్కుపోవడంతో వారు మొదట కాపాడలేకపోయారు. ఓ దుంగను ఆసరాగా పట్టుకుని మూడు రోజలు అలాగే గడిపింది. ఆ సమయంలో ఆమె చూసిన దీనపు చూపులు ఇప్పటికీ అందరికీ గుర్తుంటాయి. అరవై గంటల పాటు నరకయాతన అనుభవించింది ఆమె. తర్వాత ఆమె ఒంట్లో సత్తువ మొత్తం పోయింది. తర్వాత పట్టుకున్న దుంగను వదిలేసింది. ప్రాణాలు వదిలింది. ఆ సమయంలో ఫ్రెంచ్ ఫొటోగ్రాఫర్ ఫ్రాంక్ ఫార్నియర్ ఈ ఫొటో తీశారు. ఇప్పటికీ ఎప్పటికీ ఈ చిత్రం వెనుకున్న కథ తెలుసుకుంటే కన్నీళ్లు ఆగవు.

8. కుతుబుద్దీన్ అన్సారీ, గుజరాత్ అల్లర్లు - 2002

8. కుతుబుద్దీన్ అన్సారీ, గుజరాత్ అల్లర్లు - 2002

ఇతన్నీ ఎప్పటికీ మర్చిపోలేం. 2002లో గుజరాత్ లోని గోద్రా లో అల్లర్లు జరిగాయి. హిందువులకు, ముస్లింలకు మధ్య ఘర్షణల వల్ల వెయ్యిమందికి పైగా చనిపోయారు. గోద్రా అల్లర్లు జరుగుతున్న సమయంలో ఓ హిందువుల గుంపు కుతుబుద్దీన్ అన్సారీ ఇంటిపై దాడి చేసింది. ఆ సమయంలో కుతుబుద్దీన్ ఏడుస్తూ రెండు చేతులు జోడించి తనను, తన కుటుంబాన్ని రక్షించండి అంటూ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కు విన్నవించాడు. ఆ సందర్భంలో అతడి ఫొటోను ఒక పాత్రికేయుడు తీశాడు. నాటి దాడి ఘటనకు ఈ ఫొటో అద్దం పడుతోంది. గుజరాత్ అల్లర్లకు ఈ ఫొటోనే నిదర్శనం.

9. థిచ్ క్వాంగ్ డుక్ - 1963

9. థిచ్ క్వాంగ్ డుక్ - 1963

వియత్నానికి చెందిన బౌద్ద సన్యాసి థిచ్ క్వాంగ్ డ్యూక్ తో పాటు చాలామంది బౌద్దులు ఆ దేశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ క్రమంలో సైగోన్ రహదారి మధ్యలో థిచ్ క్వాంగ్ డ్యూక్ నిప్పటించుకున్నాడు. దీనిపై జాన్ ఎఫ్ కెన్నెడీ ఈ విధంగా వ్యాఖ్యానించారు, " ప్రపంచంలో ఇంత వరకు ఇలాంటి దుస్థితి చూడలేదు. ఈ దుర్ఘటన చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. " అని అన్నారు.

10. రాబందు.. చిన్నారి - 1993

10. రాబందు.. చిన్నారి - 1993

ఆకలి విలయతాండవాన్ని చూపే చిత్రమిది. సూడాన్‌లో ఆకలితో అలమటించి చావు బతుకుల్లో ఉన్న చిన్నారి, పక్కనే ఉన్న రాబందు అక్కడున్న ఆకలికి నిదర్శనాలు. ఎప్పుడు ఆ చిన్నారి ఊపిరి ఆగిపోతుందా.. ఎప్పుడెప్పుడు తీసుకెళ్లి తిందామా అంటూ ఎదురు చూస్తోంది రాబందు. దీన్ని చూడగానే మనసు కదిలి చిన్నారిని కాపాడేందుకు సిద్ధమవ్వాలి. కానీ కెవిన్ కార్టర్ అది చేయకుండా ఫొటో తీశాడు. న్యూయార్క్ టైమ్స్ లో ఇది ప్రచురితమైంది. తర్వాత తాను చేసిన తప్పు కెవిన్‌కి అర్థమయ్యింది. దాంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సుడాన్ ఆకలికేకలకు ఎప్పటికీ ఈ చిత్రం నిలువెత్తు సాక్ష్యం.

Read more about: pulse, insync, world, ఫోటోలు
English summary

10 Viral Images That Changed the Way We Look At The World

Here are 10 images that went viral on the internet and changed the way we saw the world.
Story first published: Tuesday, November 14, 2017, 14:24 [IST]
Subscribe Newsletter