రాశి చక్రం బట్టి ఇచ్చిపుచ్చుకోవాల్సిన బహుమతులు..!

By: Mallikarjuna
Subscribe to Boldsky

పెండ్లి చేసుకునే ముందు జాతకం చూస్తారు. కానీ ప్రేమించే ముందు అలాంటివేం పట్టించుకోరు. మీరు ప్రేమించిన అమ్మాయికి ఓ రాశి ఉంటుంది. మీకూ ఓ రాశి ఉంటుంది. మీరిద్దరూ ప్రేమించుకోవాలని ఎక్కడో రాసే ఉండి ఉండొచ్చు.

అందుకేగా మీరిద్దరు ప్రేమించుకున్నారు. మీ రాశిని బట్టి లవర్‌కి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో తెలుసుకోండి.

మీ రాశిని బట్టి మీరు ఏ విషయంలో ధైర్యంగా ఉండాలి ?

మేషరాశి

మేషరాశి

ఈ రాశి వాళ్లు ధైర్యవంతులు. అమ్మాయిలకైతే హ్యండ్‌బ్యాగులు, అలంకరణ వస్తువులు, కళ్లద్దాలు వంటివి ఇవ్వొచ్చు. అబ్బాయిలకైతే వీడియో గేమ్స్, మెలోడీ పాటల సీడీలు, సినిమా టికెట్స్ ఇష్టపడుతారు.

వృషభరాశి

వృషభరాశి

ఈ రాశి వాళ్లు నెమ్మదస్తులు. ఖరీదైన వస్తువులను ఎక్కువగా ఇష్టపడుతారు. అమ్మాయిలు మెరిసిపోయే బంగారు ఆభరణాలకు ఓటేస్తే.. అబ్బాయిలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పట్ల ఇష్టం చూపుతారు.

మీ రాశిని బట్టి మీరు ఎంత రొమాంటిక్ గా ఉంటారో తెలుసా ??

మిథునరాశి

మిథునరాశి

ఆసక్తి కలిగించే వస్తువుల పట్ల ఈ రాశి వారు ఎక్కువ ఇష్టం చూపుతారు. ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునేలా వీరికిచ్చే బహుమతి ఉండేలా చూసుకోండి. అబ్బాయిలకైతే గ్యాడ్జెట్స్‌ను, సీడీలను గిఫ్ట్‌గా ఇవ్వండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి

ప్రతీది సంప్రదాయబద్ధంగా ఉండాలనుకుంటారు. అమ్మాయిలు అందానికి మెరుగులద్దే సాధనాలు, ఫొటో ఫ్రేములు ఇష్టపడతారు. అబ్బాయిలైతే వస్తువులు కాకుండా.. క్యాండిల్ లైట్ డిన్నర్, రోడ్‌ట్రిప్ వంటివాటిని ఇష్టపడుతారు.

సింహరాశి

సింహరాశి

తెలివికి, చురుకుదనానికి ఈ రాశి వారు కేరాఫ్ అడ్రస్. వీరికి ఆభరణాలు, ఖరీదైన వస్తువులంటే ఆస్తి. తియ్యటి చాక్లెట్ తినిపించినా హ్యపీ. అబ్బాయిలైతే కెమెరా, మొబైల్, హాట్‌డ్రింక్స్ అంటే ఇష్టపడతారు.

కన్యారాశి

కన్యారాశి

వీరిది కళాత్మక హృదయం. భారీ బహుమతులు వీరేం కోరుకోరు. తెల్లటి కాగితం మీద ఐ లవ్ యు అని రాసిచ్చినా దాన్ని జీవితాంతం దాచుకుంటారు. ఈ రాశి అబ్బాయిలు, అమ్మాయిలు ఒకేలా ఆలోచిస్తారు.

తులరాశి

తులరాశి

ప్రేమలో వీరు తెలివైన వారు. ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోయి రోజంతా హ్యాపీగా గడిపేయడమంటే వీరికి చాలా ఇష్టం. చిన్న పువ్విచ్చి, పావలా చాక్లెట్ ఇచ్చినా దాన్నే అపురూపంగా భావిస్తారు.

రాశిని బట్టి అమ్మాయిలను ఎట్రాక్ చేసే అబ్బాయిల లక్షణాలు..!

వృశ్చికరాశి

వృశ్చికరాశి

aదేవుడు రాసిన తలరాతను తిరగరాసుకుంటామనే నమ్మకం కలిగి ఉంటారు. వీరికి నచ్చినట్టే వీరుంటారు. నచ్చిందే చేస్తారు. వీరి ఇష్టాలను గమనించి వీరికిచ్చే గిఫ్ట్ ఎంచుకోండి. ఇష్టం లేనిది ఏదైనా, ఎంత విలువైనదైనా వీరు స్వీకరించరు.

ధనస్సు రాశి

ధనస్సు రాశి

కామెడీ, హీరోయిజం, ధైర్యం అన్నీ కలగలిపిన వారే ఈ రాశి వారు. అమ్మాయిలు ఏ చిన్న బహుమతి ఇచ్చినా పొంగిపోతారు. తీపి పదార్థాలు ఎక్కువగా ఇష్టపడుతారు. అబ్బాయిలకైతే స్పోర్ట్స్‌కి సంబంధించిన వస్తువులు ఇష్టం.

మకర రాశి

మకర రాశి

ఈ రాశి వాళ్లు చాలా నెమ్మదస్తులు. అమ్మాయిలు ఇచ్చిన బహుమతి గురించి వందసార్లు ఆలోచిస్తారు. వీరికి గిఫ్ట్ ఇవ్వాలన్నా.. తీసుకోవాల్న ఆలోచించాలి. అబ్బాయిలైతే వాచీలు, కీ చెయిన్స్ లాంటివి ఇష్టపడుతారు.

కుంభరాశి

కుంభరాశి

స్నేహస్వభావులు. అమ్మాయిలకు బహుమతులు తీసుకోవడం కంటే ఇతరులకు సాయం చేయడమంటేనే ఇష్టం. అబ్బాయిల విషయానికొస్తే.. మీ సాన్నిహిత్యం, మీతో గడిపే క్షణాలే వీరికి బహుమతి.

మీనరాశి

మీనరాశి

ఎప్పుడూ కలల లోకంలో విహరిస్తూ ఉంటారు. ఈ రాశి అమ్మాయిలకు గిఫ్ట్ ఇవ్వదలిస్తే పూలు, సువాసనలు వెదజల్లే పర్‌ఫ్యూమ్స్ ఇవ్వండి. అబ్బాయిలకైతే మంచి మ్యూజిక్ కలెక్షన్స్ ఇవ్వండి. ఆ సంగీతం వింటూ మీ ప్రేమ ప్రపంచంలో విహరిస్తారు.

English summary

A Perfect Gift Guide For Each Zodiac Sign!

Do you know that gift choices can be based on our zodiac signs? Here's an extensive gift guide that could help you learn more about the best gift that would be suitable for a person based on Zodiac.
Story first published: Thursday, August 31, 2017, 8:00 [IST]
Subscribe Newsletter