వీళ్ళు పెళ్ళి చేసుకునేటప్పుడు దేవుళ్ళు, దేవతల్లాగా ఎందుకు అలంకరించుకున్నారో తెలుసా ?

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

పెళ్ళిళ్లు స్వర్గంలో జరుగుతాయి అని చాలా మంది భావిస్తారు. ఇది మత సంప్రదాయానికి అనుగుణంగా జరిగే తంతు. ఈ పెళ్ళి సమయంలో దేవుడు ఆశీస్సులు ఖచ్చితంగా వివాహం చేసుకునే జంటలకు ఉండాలని, ఆలా గనుక ఉంటే వారి జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది అని వారి నమ్మకం.

ఒకానొక ప్రాంతంలో అక్కడ దేవుడి మనిషిగా పిలవబడే శ్రీధర స్వామి కూతురి యొక్క వివాహం గురించి అందరూ మాట్లాడుకోవడమే కాదు, దేశ వ్యాప్తంగా ఇలా ఎలా జరిగింది అని ఆలోచించడం మొదలుపెట్టారు.

వెడ్డింగ్ రింగ్ ధరించటం యొక్క ప్రాముఖ్యత

సాధారణంగా భారతీయ వివాహాలు జరిగేటప్పుడు ఎన్నో మూఢ నమ్మకాలను పాటిస్తుంటారు.

ఇప్పుడు మనం తెలుసుకోబోయే వివాహంలో జరిగిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇక్కడ ప్రజలందరూ దేవుళ్ళు మరియు దేవతల్లాగా అలంకరించుకున్నారు. వివాహం కోసం ఎంతో ఓపికతో అంత విభినంగా అలంకరించుకొని ఆ పెళ్ళికి హాజరైన వారందరిని మనం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి.

భారతీయ జంటలు నిజానికి వారి పెళ్లి రోజు రాత్రి చేసే 10 పనులు

ఇంకా మరిన్ని విషయాలు ఈ పెళ్ళిలో ఏమి చోటు చేసుకున్నాయంటే...

పెళ్ళి కొడుకు మరియు పెళ్ళికూతురు ఎలా ఉన్నారంటే :

పెళ్ళి కొడుకు మరియు పెళ్ళికూతురు ఎలా ఉన్నారంటే :

పెళ్ళి కూతురు బంగారు ఆభరణాలతో అలంకరించబడింది. ఆమెను ఒక తామర పువ్వు ఆకారంలో ఉండే ఒక వస్తువుని ఉపయోగించి పెళ్ళి పీఠాలపై కి తీసుకువచ్చారు. దీనర్ధం ఆమె హిందూ దేవతల ప్రకారం ధనం మరియు అదృష్టానికి చిరునామా అయిన లక్ష్మి దేవిని తలపించేలా ఆ పెళ్ళికూతుర్ని తయారు చేసారు. ఇంతలోనే ఆ పెళ్ళికొడుకు పెళ్ళి మండపంలో మహా విష్ణువు లాగా అలంకరించబడ్డాడు. పెళ్ళి కూతురి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.

పెళ్ళి కూతురు దేవుడు మనిషి అని పిలవబడే వ్యక్తి యొక్క కూతురు :

పెళ్ళి కూతురు దేవుడు మనిషి అని పిలవబడే వ్యక్తి యొక్క కూతురు :

దేవుడు మనిషి అని పేరు సంపాదించుకున్న శ్రీధర స్వామి కూతురు పేరు హర్షిత. ఆమెనే పెళ్ళికూతురు. ఒక దేవతను అలంకరించినట్టు ఆమెను అలంకరించడం జరిగింది. దేవుడి మనిషిగా పిలవబడే ఈ వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ప్రజాదరణ కలిగిన వ్యక్తి..

ఆ కుటుంబం ఒక్కటే అలా అలంకరించుకొని రాలేదు !

ఆ కుటుంబం ఒక్కటే అలా అలంకరించుకొని రాలేదు !

పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మరియు వారి యొక్క దగ్గరి కుటుంబాలు మాత్రమే ఇలా అలంకరించుకొని రాలేదు. ఆ పెళ్ళికి హాజరు అయిన అతిధుల పిల్లలు కూడా ఇలా సంప్రదాయమైన దుస్తులను ధరించి మంచి బంగారు ఆభరణాలను వేసుకొని, తలకు కిరీటాలు పెట్టుకొని వచ్చారు.

ఇలా చేసుకోవడం వెనుక అసలు ఉద్దేశ్యం గురించి దేవుడు మనిషిగా పిలవబడే ఆ వ్యక్తి ఏమి చెబుతున్నాడంటే...

ఇలా చేసుకోవడం వెనుక అసలు ఉద్దేశ్యం గురించి దేవుడు మనిషిగా పిలవబడే ఆ వ్యక్తి ఏమి చెబుతున్నాడంటే...

" పూర్వపు రోజ్జుల్లో వివాహ వేడుకలన్నీ ఇలానే జరిగేవి. మనం మన ప్రాచీన సంప్రదాయాలను పాటించేవాళ్ళం. వివాహం అనేది ఎంతో పవిత్రతతో జరగాల్సిన వ్యవహారం. వాటన్నింటిని మరొక్కసారి పరిచయం చేసి మరియు ఇక నుండి ఇలా చేసుకోవాలి అనే భావన అందరిలోనూ కలిగించాలనే ఉద్దేశ్యంతోనే నా కూతురి పెళ్ళి ఇలా చేయడం జరిగింది " అని చెప్పుకొచ్చాడు ఈ దేవుడు మనిషిగా పిలవబడే వ్యక్తి.

ఆ పెళ్ళి చిత్రాలు సంచలనంగా మారాయి :

ఆ పెళ్ళి చిత్రాలు సంచలనంగా మారాయి :

పెళ్ళి అలా జరిగిన తర్వాత అందుకు సంబంధించిన చిత్రాలు అంతర్జాలంలో సంచలనంగా మారాయి. సామజిక మాధ్యమాల్లో వీటికి మిశ్రమ స్పందన లభించింది. ముఖ్యంగా ట్విట్టర్ వంటి సామజిక మాధ్యమాల్లో వీటిని చుసిన ప్రజలు కొద్దిగా ఆశ్చర్యానికి లోనయ్యారు మరియు ఈ విషయమై దేశ వ్యాప్తంగా కూడా చర్చించుకున్నారు.

మీరు కూడా ఇదంతా విన్న తర్వాత ఆశ్చర్యానికి లోనయ్యారా ? లేదా మీరు కూడా ఇటువంటి విభిన్న రీతిలో పెళ్ళి చేసుకోవాలని భావిస్తున్నారా? మీ ఆలోచనలను మాతో పంచుకోండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మరిచిపోకండి.

English summary

People Came Dressed As Gods And Goddesses At This Wedding

When you decide to be hatke on your wedding day!
Subscribe Newsletter