వాక్యూమ్ ప్యాక్ లలో జంటలను పెట్టే ఈ కళాకారుడు గురించి సంచలన విషయాలు

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉన్నప్పుడు మరియు సంబంధ బాంధవ్యాలు వికసిస్తున్న సమయంలో ఆ జంట చేసే అతి ముఖ్యమైన పనుల్లో ఒకటి తమను తాము ఫోటోషూట్ చేసుకోవడం. కానీ, మీరెప్పుడైనా ఊహించారా మీ భాగస్వామితో ఒక అసహజ ధోరణిలో ఫోటో షూట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని. మీరు ఆ సమయంలో ఒక వింత స్థితిలో మీ భాగస్వామితో ఉండవలసి వస్తుంది, తప్పదు మరి ఆ ఫోటో షూట్ అటువంటిది.

ఇది వినడానికి అసహజంగా వింతగా ఉంది కదా? కానీ జపాన్ దేశానికి చెందిన ఫోటోగ్రాఫర్ ఇలాంటి వింత ఆలోచనలకూ కార్యరూపం దాల్చాడు. ఇతడు ఎక్కువగా పెళ్లిళ్ల సమయంలో జంటలకు ఫోటోషూట్ చేస్తుంటాడు. అతడి పేరు హరిహికో క్వాగుచి. ఇతడు శాశ్వతమైన ప్రేమను కొత్తగా మరియు విభిన్నమైన పద్ధతుల్లో నిర్వచించాలని ఎక్కువగా ప్రయత్నిస్తుంటాడు.

ఇతడు ఒక నిర్దిష్టమైన ప్రదేశాల్లో తీసిన భయం గొలిపే విధంగా ఉండే చిత్రాలు, ప్రేమ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏదైతే భావిస్తామో వాటిని అక్షరాలా కార్యరూపం దాల్చి అవి వ్యక్తం చేసేవిధంగా ఆ చిత్రాలు ఉంటాయి. వాటి గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ అసహజ ధోరణే అతడి జీవనోపాధి :

ఈ అసహజ ధోరణే అతడి జీవనోపాధి :

ఇతడు ఈ వింత ఆలోచనలనే తన జీవనోపాధిగా మార్చుకున్నాడు. తనకు జంటల ఇంటికి రావడం తెలియదని చెప్పి, వాళ్ళను బ్యాగ్ లో దూరిపోమనేవాడు. ఇలాంటి జంటల కోసం బార్ లు మరియు పబ్ లలో వెతికేవాడు. అక్కడ ఆ జంటలు ఆ బ్యాగ్ లో దూరే సమయంలో జంటలు తమ బట్టలను పూర్తిగా తీసివేసి అందులోకి వెళ్ళవలసి ఉంటుంది.

దీని వెనుక గల అసలు ఉద్దేశం ఏమిటంటే :

దీని వెనుక గల అసలు ఉద్దేశం ఏమిటంటే :

అతను ఏమని చెప్పుకొస్తున్నాడంటే " మీరు ఎప్పుడైతే మీ భాగస్వామిని కౌగలించుకుంటారో ఆ సమయంలో వారు మీ శరీరంతో కలగలిసిపోవాలని భావిస్తారు. ఈ యొక్క ఆకాంక్షను గుర్తించేందుకు నేను జంటలను చిన్న మరియు అతి తక్కువ స్థలమున్న ప్రదేశాల్లో మాత్రమే ఫోటోలు తీస్తుంటాను. అలా తీస్తూ తీస్తూ చివరికి జంటలను వాక్యూమ్ సీల్డ్ ప్యాక్ లలో ఫోటోలు తీసే స్థితికి చేరుకున్నాను. ఇప్పుడు నా పని ఎంతో ఎంతో తీవ్రమైనదిగా మారిపోయింది. కానీ ఈ ప్రయాణంలో ఒకటి గుర్తించాను. అదేమిటంటే, ఒకరితో ఒకరు మాట్లాడు కోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది."

400 జంటలను పైగా ఇలా ఫోటోలు తీసాను :

400 జంటలను పైగా ఇలా ఫోటోలు తీసాను :

అతను ఇప్పటికి 400 జంటలను ఇలా వింతగా ఫోటోలు తీసాడు. ఆ జంటలు చేయాల్సిందంతా ఏమిటంటే ఆ బ్యాగ్ లో దూరిపోవడమే. ఆ తర్వాత అంతా ఈ కళాకారుడి చూసుకొంటాడు. ఈ చిత్రాలు చూడటానికి భయం గొలిపే విధంగా ఉన్నా, వాటిని తీసే క్రమంలో ఎవ్వరిని బాధపెట్టలేదని మరియు హాని చేయలేదని చెప్పాడు.

ఈ వింత ఆలోచనల గురించి మీరేమనుకుంటున్నారు

ఈ వింత ఆలోచనల గురించి మీరేమనుకుంటున్నారు

ఈ వింత ఆలోచనల గురించి మీరేమనుకుంటున్నారు ? మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ చేయడం మర్చిపోకండి.

Images Source

English summary

Can You Imagine An Artist Puts Couples In Vacuum Packs?

Can You Imagine An Artist Puts Couples In Vacuum Packs?,Artist who aims to express what he feels when he talks about love!
Subscribe Newsletter