2048వ సంవత్సరం నుంచి 2017లోకి వచ్చిన ఏలియన్?

Posted By: Bharath
Subscribe to Boldsky

గ్రహాంతర వాసులు ఉన్నారా? ఉంటే వారు ఎక్కడ ఉన్నారు? ఇతర గ్రహాలపై వీరు నిజంగా జీవిస్తున్నారా? గ్రహాంతరవాసులు ఏలియన్స్ వీటిపై కొన్ని ఏళ్ల తరబడి చర్చ సాగుతూనే ఉంది. అసలు గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అనే చాలా మంది శాస్త్రవేత్తలు సైతం సతమతం అవుతున్నారు. ఇలాంటి తరుణంలో ఒక వ్యక్తి తాను టైమ్ మిషన్ ద్వారా భూమిపైకి వచ్చానంటూ అందరినీ ఆశ్యర్యపరిచాడు. తాను ఏకంగా 2048 నుంచి వచ్చానంటూ హల్ చల్ చేశాడు.

అతి త్వరలోనే ఈ భూమి పైకి ఏలియన్స్ వస్తున్నారంటూ గట్టిగా అరుచుకుంటూ తిరిగాడు. గ్రహాంతర వాసుల్ని అడ్డుకోకపోతే ఈ భూమి సర్వ నాశనం అవుతుందని పేర్కొన్నాడు. అందర్ని అప్రమత్తం చేసేందుకు తాను భూమిపైకి వచ్చానంటూ చెప్పాడు.

1. క్యాస్పర్ నగరంలో ఘటన

1. క్యాస్పర్ నగరంలో ఘటన

ఇదంతా ఎక్కడ జరిగిందనే కదా మీ డౌట్. అమెరికాలోని క్యాస్పర్ నగరంలో తాజాగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇక అక్కడున్న పబ్లిక్ మొత్తం అతడు చెప్పే మాటలు వింటూ నిలిచిపోయింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పోలీసులు అందర్ని అక్కడి నుంచి పంపించి వేశారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేసి జైలులో పెట్టారు.

2. టైమ్ ట్రావెలింగ్ ద్వారా వచ్చాను

2. టైమ్ ట్రావెలింగ్ ద్వారా వచ్చాను

వ్యోమింగ్ రాష్ట్రానికి చెందిన జాన్సన్ క్యాస్పర్ నగరంలో ఇలా హల్ చల్ చేశారు. ఎలియన్స్ రాబోతున్నారని అరుచుకుంటూ అక్కడి రోడ్లపై తిరిగాడు. తాను 2048 సంవత్సరం నుంచి టైమ్ ట్రావెలింగ్ ద్వారా వచ్చానని పేర్కొన్నాడు. చాలామంది అతని మాటలు ఆసక్తిగా విన్నారు. కొందరికేమో అసలు ఇతను చెబుతున్నది నిజమేనా అని సందేహం వచ్చింది.

3. అరెస్ట్ చేసిన పోలీసులు

3. అరెస్ట్ చేసిన పోలీసులు

పోలీసులు ఇతడు చేస్తున్న హంగామాను చూసి వెంటనే అక్కడికి చేరుకుని జరిగిన విషయం తెలుసుకున్నారు. తర్వాత అరెస్ట్ చేశారు. వెహికిల్ లో జైలుకు తీసుకెళ్లారు. అక్కడ విచారించారు. అసలు విషయం ఏమిటని తెలుసుకున్నారు.

4. మద్యం సేవించి హంగామా

4. మద్యం సేవించి హంగామా

అయితే అతడు తాగినట్లు పోలీసులు నిర్ధారించారు. అతనిని ఆల్కాహాల్ టెస్ట్ లు చేయగా ఆ విషయం బయటపడింది. కాగా వారిని కూడా అతను చాలా ఇబ్బందులుపెట్టాడు.

5. క్యాస్పర్ ప్రెసిడెంట్ తో మాట్లాడుతాను

5. క్యాస్పర్ ప్రెసిడెంట్ తో మాట్లాడుతాను

తాను క్యాస్పర్ టౌన్ ప్రెసిడెంట్ తో మాట్లాడాలని పోలీసులతో డిమాండ్ కూడా చేశాడు. తాను 2018 లోకి వెళ్లాలని అనుకున్నానని కానీ కొన్ని కారణాల వలన 2017 లోకి వచ్చానని చెప్పాడు. తనను ఇక్కడకు పంపే ముందు ఏలియన్స్ తన ఒంటిలోకి మందు ఎక్కించారని.. తాను ఒక పెద్ద షిప్ లో ఇక్కడకు వచ్చానని చెప్పాడు.

Read more about: pulse, లైఫ్
English summary

bryant johnson who claims time travel warns people about alien invasion in 2018

Bryant Johnson, Who Claims Time Travel and Warns People About Aliens Invasion in 2018!
Story first published: Wednesday, November 22, 2017, 15:45 [IST]
Subscribe Newsletter