మీ అరచేయి రంగు మీ గురించి రహస్యాల్ని చెప్పేస్తుంది

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ఒక వ్యక్తి యొక్క అరచేయిని క్షుణ్ణంగా చూడటం ద్వారా ఆ వ్యక్తికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి మనం తెలుసుకోవచ్చు. ఈ విషయాలన్నింటిని ఆ అరచేయి బహిర్గతపరుస్తుంది. ఎటువంటి వృత్తిని ఎంచుకుంటారు, అదృష్టం ఏమేర కలిసొస్తుంది మరియు జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు అరచేయి రంగు ఆధారంగా ఊహించవచ్చు అని చెబుతున్నారు.

ఇప్పుడు మనం రకరకాల రంగులున్న అరచేతులు ఏ ఏ విషయాలు బయటపెడతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలాంటిది అనే విషయం కూడా బహిర్గతమయ్యే అవకాశం ఉంది.

ఇక మరి దేని కోసం వేచి చూస్తున్నారు, ఇప్పుడు వివిధ రకాల అరచేతులు వ్యక్తుల యొక్క గుణగణాలను ఎలా తెలియజేస్తాయి అనే అద్భుతమైన విషయం గురించిన రహస్యాలను తెలుసుకుందాం.

మీ అరచేయి రంగు మీ గురించి రహస్యాల్ని చెప్పేస్తుంది

లేత గులాబీ రంగు అరచేతులు :

మాములుగా చాలా మంది వ్యక్తుల అరచేతులు ఈ రంగులోనే ఉంటాయి. ఈ వ్యక్తులు తమ జీవితంలో ఎంతో క్రమశిక్షణతో జీవించాలని అనుకుంటారు. వీళ్ళు జీవితంలో అన్ని విషయాల్లో ఎంతో సమతుల్యతను పాటిస్తారు. తీసుకొనే ఆహరం, చదివే చదువు, జీవన విధానం, సంబంధ బాంధవ్యాలు మరియు ఆద్యాత్మికం ఇలా ఒక్కటేమిటి అన్ని విషయాలలో జాగ్రత్తలు వహిస్తూ , సరైన దిశలో పయనిస్తూ అన్ని పనులను చక్కగా నిర్వర్తిస్తుంటారు. వీళ్ళు చాలా ఆరోగ్యవంతమైన వ్యక్తులు. ఏ వ్యక్తుల యొక్క అర చేతులు లేత గులాబీ రంగు నుండి మరీ ఎక్కువ గులాబీ రంగు లో ఉంటాయో అటువంటి వ్యక్తులు చాలా గొప్పగా ఆలోచిస్తారు.

మీ అరచేయి రంగు మీ గురించి రహస్యాల్ని చెప్పేస్తుంది

ఎరుపురంగు అరచేతులు :

ఎరుపురంగు అరచేతులు ఉన్నవారు, ఎదుటి వ్యక్తుల దృష్టిని సులభంగా ఆకర్షించగలరు. ఇలా చేయడం అంత సాధారణమైన విషయమేమి కాదు. ఈ వ్యక్తులు చాలా కష్టపడి పనిచేస్తారు. సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాలుపంచుకుంటుంటుంటారు. వాళ్ళు జీవితంలో ఎక్కువగా పఠించే మంత్రం ఏమిటంటే " కష్టపడి పనిచేయు మరియు గట్టిగా వేడుక చేసుకో ". వీళ్ళు కష్టపడి చేసే పనిలో ఎక్కువగా కాయాకష్టం చేయవలసి ఉంటుంది. ఎరుపురంగు అరచేతులున్న వ్యక్తులు చాలా ఎక్కువ భావోద్వేకానికి లోనవుతారు. వీళ్ళు మెదడు ఉపయోగించి చేసే పనుల కంటే కూడా కండలు ఉపయోగించి చేసే పనులపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు మరియు వాటినే ఎంచుకుంటారు.

మీ అరచేయి రంగు మీ గురించి రహస్యాల్ని చెప్పేస్తుంది

పసుపుపచ్చ రంగు అరచేతులు :

ఎవరికైతే పసుపుపచ్చ రంగు అరచేతులు ఉంటాయో వారు చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్లో అనారోగ్య సమస్యలు ముఖ్యంగా పచ్చ కామెర్ల వ్యాధి ఉందేమో అని పరీక్షించుకోవడం మంచిది. వీళ్ళు ఎక్కువగా ఒత్తిడికి లోనవుతుంటారు, ఆతురత పడుతుంటారు, ఆందోళన చెందుతుంటారు మరియు మరీ ఎక్కువగా ఆలోచిస్తుంటారు. వాళ్ళ పై వాళ్ళకే దయా, కరుణా ఉండవు. మిగతా వారి కంటే కూడా వీళ్ళు కాలానుగుణంగా వచ్చే మార్పులకు త్వరగా మారిపోయి వాటిని అనుభవిస్తుంటారు. వీళ్ళు వీరి యొక్క అంతరాత్మ చెప్పే విషయాలని చాలా దగ్గరగా వింటుంటారు. వీళ్ళు చేస్తున్న పనులు గనుక వీరికి ప్రతికూలంగా మారుతుంటే, అటువంటి సమయంలో విపరివెతమైన కోపం ప్రదర్శిస్తారు. ఎవ్వరితో సంబంధం లేనట్లు భావిస్తుంటారు మరియు చాలా త్వరగా విచారిస్తుంటారు.

మీ అరచేయి రంగు మీ గురించి రహస్యాల్ని చెప్పేస్తుంది

తెలుపు మరియు పాలిపోయిన రంగు అరచేతులు :

వీళ్ళు ఎంతో శాంతమైన స్వభావాన్ని కలిగి ఉంటారు, అనుకువైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇది చూసి చుట్టుప్రక్కల అందరూ ఆశ్చర్యపోతారు. వీళ్ళు చాలా మృదువుగా మాట్లాడతారు, మంచి సంస్కారవంతులై ఉంటారు మరియు ప్రకృతి ప్రసాదించిన ప్రతి దాని పట్ల ఎంతో గౌరవాన్ని కలిగి ఉంటారు. అంతే కాకుండా వీళ్ళు వీరి యొక్క జీవితాన్ని ఎంతో బాగా ఆనందిస్తారు మరియు వీరి యొక్క దృష్టి కోణం కూడా చాలా వేరుగా, వేరే ఎవ్వరు చూడనంత విభిన్నంగా ఉంటుంది. వీళ్ళు ఇతరుల పై ఎటువంటి అంచనాలను ఎప్పుడూ పెట్టుకోరు మరియు వీరు భావోద్వేగపరంగా అందరికీ దూరంగా ఉంటారు లేదా వీళ్ళ వ్యక్తిత్వం గురించి ఎవ్వరికీ తెలియనీయకుండా జాగ్రత్త పడుతుంటారు.

English summary

Colour Of Your Palm Reveals This Secret About You

Colour Of Your Palm Reveals This Secret About You,
Subscribe Newsletter