మనుషుల్ని అక్రమ రవాణా చేసి ఆ పనులన్నీ చేయించుకుంటారు

Written By: Bharath
Subscribe to Boldsky

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని చట్టాలొచ్చినా ఇప్పటికీ చాలా దేశాల్లో మనుషుల అక్రమ రవాణా సాగుతూనే ఉంది. వివిధ దేశాల్లో మనుషుల అక్రమ రవాణా బాధితుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఇందులో మహిళలు, చిన్నారులు ఎక్కువగా బాధితులుగా ఉన్నారు. వెట్టిచాకిరీ, లైంగిక అవసరాల కోసం పురుషులు, మహిళలు, చిన్నారులను అక్రమ రవాణా చేస్తూనే ఉన్నారు. వారితో చేయించుకునే పనులు చాలా దారుణంగా ఉంటాయి.

1. చైనా

1. చైనా

మానవుల అక్రమ రవాణాలో చైనా ముందుంది. చైనా నుంచి అక్ర‌మంగా ర‌వాణా అవుతున్న వారిలో మహిళలు, పిల్లలు అధికంగానే ఉన్నారు. వారితో కొంద‌రు కూలీ ప‌నులు చేయించుకుంటుండ‌గా, మ‌హిళ‌ల‌ను వ్యభిచారిణులుగా మార్చుతున్నారు. మ‌రికొంద‌రిని భిక్షగాళ్లుగా చేస్తున్నారు. మానవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు చైనాలో కఠిన చట్టాలు లేవు. చైనా టెక్నాలజీపరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నా మానవ అక్రమ రవాణా నివారించడంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది.

2. ఉగాండా

2. ఉగాండా

ఇక్కడి ప్రజలు నిత్యం ఇబ్బందుల మధ్యే జీవనం సాగిస్తుంటారు. ఇక్కడి వారు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంటారు. చాలా దుర్భర పరిస్థితుల మధ్య ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తుంటారు. ఈ దేశంలో మానవ అక్రమ రవాణా దారుణంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇందుకు బాధితులవుతుంటారు. ఇక్కడ చిన్నపిల్లల్ని సైనిక దళాల్లో చేర్సాల్సి ఉంటుంది. చిన్నప్పుడే తుపాకీలపై శిక్షణ ఇస్తారు. వారికి ఇష్టం ఉన్నా లేకున్నా సైనిక శిబిరాలకు పిల్లల్ని ఎత్తుకొచ్చేస్తుంటారు. ఇక్కడి మహిళలు కూడా సరైన జీవనాధారం లేక అన్నిరకాల పనులకు సిద్ధమై ఉంటారు.

3. ఘానా

3. ఘానా

ఈ దేశంలో కూడా అక్రమ రవాణా దారుణంగా ఉంటుది. అన్ని దేశాలకు మనుషులకు స్మగ్లింగ్ చేసేందుకు ఇది కేరాఫ్ అడ్రస్ గా మారింది. అలాగే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లల్ని కిడ్నప్ చేసి ఇక్కడి బంగారు గనులకు తీసుకొస్తుంటారు. కిడ్నాప్ అయిన వారి ద్వారా అక్కడ పని చేయిస్తుంటారు. అలాగే యువతుల్ని కిడ్నాప్ చేసి వ్యభిచారంలోకి బలవంతంగా దింపుతుంటారు. అలాగే ఫిషింగ్, యాచించడంవంటి పనులకు కూడా కిడ్నాప్ అయిన వారిని ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు.

4. భారతదేశం

4. భారతదేశం

మనదేశంలో మనుషుల అక్రమరవాణాకు ఎన్నో చట్టాలున్నా మానవ అక్రమ రవాణా సాగుతూనే ఉంది. చాలామంది మహిళలు, పిల్లల్నిఎక్కువగా ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.మహిళల్ని వ్యభిచారానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలాగే అవయవాల మార్పిడికి కూడా కొందర్ని అక్రమంగా తరలిస్తుంటారు.

5. పాకిస్తాన్

5. పాకిస్తాన్

పాకిస్తాన్ లో ఎక్కువగా ఆ దేశ ప్రజల్ని ఆ దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. అక్కడ ఉండే క్లబ్బులు, పరిశ్రమల్లో పని చేయడానికి అక్రమంగా తరలించిన మనుషుల్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

6. నేపాల్

6. నేపాల్

ఇక్కడ మహిళలను ఎక్కువగా అక్రమ రవాణా చేస్తుంటారు. అక్కడి నుంచి కిడ్నాప్ చేసి ఎక్కువగా భారతదేశానికి తరలిస్తుంటారు. సుమారు 5000 నుంచి 10,000 మంది నేపాల్ కు చెందిన స్త్రీలు, బాలికలను ఏటా భారత్ కు అక్రమ రవాణ చేస్తుంటారు. మొత్తంపైనే నేపాలీలు ఎక్కువగా భారత్ కే రవాణా అవుతున్నారని కొన్ని నివేదికల ద్వారా తెలసింది.

7. శ్రీలంక

7. శ్రీలంక

శ్రీలంక నుంచి మనుషుల్ని ప్రపంచవ్యాప్తంగా రవాణా చేస్తుంటారు. అలాగే వారి దేశంలోని సైనిక దళాల్లో కూడా వీరిని ఉపయోగిస్తుంటారు. ఆడవారిని వ్యభిచారం కోసం ఎక్కువగా ఇతర దేశాలకు తరలిస్తుంటారు.

8. మహిళలే ఎక్కువ

8. మహిళలే ఎక్కువ

ఇందులో ఎక్కువగా మహిళల అక్రమ రవాణా ఉంటుంది. అభాగ్యులైన యువతులను కొం దరు బ్రోకర్లు విదేశాలకు అక్రమ రవాణా చేస్తుంటారు. నెలకు ఇంత చెల్లించాలనే ఒప్పందంపై వ్యభిచార గృహాలకు వారిని విక్రయిస్తుంటారు. ఆర్థిక అవసరాల కోసం మాయగాళ్ల చేతుల్లో పడిన అభాగ్యురాండ్లు తప్పనిసరి పరిస్థితులలో పడుపు వృ త్తిలో కొనసాగుతుంటారు.

9. పూర్వం నుంచి ఉన్న సంప్రదాయం

9. పూర్వం నుంచి ఉన్న సంప్రదాయం

పూర్వకాలంలో గ్రీకు సామ్రాజ్యంలో యుద్ధాలు గెలిచినవారికి, ఓడిపోయినవారు బానిసలుగా పని చేయాలి. వారు ఏ ప్రదేశంలో యుద్ధానికి వెళ్లినా అక్కడికు ఆ బానిసలను వారి పిల్లలను కూడా తీసుకువెళ్లేవారు. మగవారిని యుద్ధ సహాయకులుగా, పిల్లలను ఇంట్లో పనివారిగా పెట్టుకునే వారు. బాబిలోనియా, రోమ్‌ వంటి సామ్రాజ్యాల్లో బానిసలను ధనికులు వేలంపాటలో కొనుక్కునేవారు. బైంజాటిన్, అట్టామన్, యూరోపి దేశాల్లో యుద్ధాలు జరిగినప్పుడు ఓడినవారు కచ్చితంగా బానిసత్వం చేయాల్సిందే.

10 వీరితో ఏం చేయిస్తుంటారు

10 వీరితో ఏం చేయిస్తుంటారు

ఇలా వీరిని స్మగ్లింగ్ చేసి ఎక్కువగా లైంగిక వ్యాపారం చేయిస్తుంటారు.

వేతనం లేకుండా వారితో పని చేయించుకుంటారు. వారితో బలవంతంగా పని చేయించుకుంటారు. వారిని అవయవాల మార్పిడికి కూడా ఉపయోగిస్తారు. మాదక ద్రవ్యాల సరఫరాకు, యాచించడం ( మాఫియా) కోసం వీరిని ఎక్కువగా ఉపయోగిస్తారు. వీరు నుంచే వచ్చే ఆదాయాన్ని మొత్తం యజమానులే అనుభవిస్తారు.

11. వీటిని నిర్వహించేవారు ఎవరు

11. వీటిని నిర్వహించేవారు ఎవరు

క్రిమినల్‌ గ్యాంగ్స్‌, ట్రాఫికింగ్‌ నెట్‌వర్క్‌ ఏజెంట్స్‌, మాదక ద్రవ్యాల ఉత్పత్తిదారులు, స్థానికంగా సేకరించి డబ్బు కోసం పని చేసేవారు

జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులుగా వచ్చే వారిలో కొందరు, కొందరు ట్రావెల్‌ ఏజెంట్లు, వ్యభిచార గృహాలు నిర్వహించేవారు,

డబ్బుకోసం దీన్నే వృత్తిగా భావించిన వారంతా కూడా ఇలాంటి మనుషుల అక్రమ రవణా పనులు చేస్తుంటారు.

12. ఎవరిని ఎక్కువగా టార్గెట్ చేస్తారు?

12. ఎవరిని ఎక్కువగా టార్గెట్ చేస్తారు?

అత్యాచారానికి గురైనవారిని, వితంతువులు, విడాకులు పొందినవారిని, మానసిక వైకల్యం ఉన్నవారిని ఎక్కువగా టార్గెట్ చేస్తారు. మాదక ద్రవ్యాల బారిన పడినవారిని, ప్రేమలో విఫలమైనవారిని, వెలికి గురైనవారిని, ఇంటి నుంచి వచ్చిన వారిని, కుటుంబం విచ్ఛిన్నం అయి దిక్కులేకుండా ఉన్నవారిని ఎక్కువగా రవాణా చేస్తుంటారు.

English summary

countries known human trafficking

Human trafficking is the trade of humans, where people are taken to different countries and are made to do mere labour jobs in which they are paid in peanuts.
Story first published: Wednesday, December 6, 2017, 11:30 [IST]