For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  క్రికెటర్ల భార్యల గురించి తెలుసా?

  By Bharath
  |

  చాలామంది క్రికెటర్స్ తమకు నచ్చిన వాళ్లను, వారు ప్రేమించిన వాళ్లనే పెళ్లి చేసుకున్నారు. అయితే కొందరు తమకంటే ఎక్కువగా ఏజ్ ఉన్న వారిని పెళ్లాడారు. కొందరు తమకంటే చాలా చిన్న వయస్స ఉన్న అమ్మాయిలను వివాహం చేసుకున్నారు. మరి ఎవరెవరు ఎక్కువ ఏజ్ ఉన్న వారిని వివాహం చేసుకున్నారు.. ఎవరు తక్కువ వయస్సు ఉన్న వారిని చేసుకున్నారు.. వారి భార్యల పేర్లు, వయస్సు వంటి వివరాలు ఒక్కసారి చూద్దామా.

  సచిన్ చిన్నవాడు

  సచిన్ చిన్నవాడు

  క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అతని భార్య అంజలి కంటే చిన్నవాడు. ఆమెతో కొన్ని రోజులు ప్రేమయాణం నడిపి తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు సచిన్. తన భార్య అంజలీకి ప్రేమలేఖ రాయడానికి ఆయన చాలా ఇబ్బందిపడేవాడంట. అంజలి ముంబైలోని జేజే హాస్సిటల్స్‌లో చదువుకోవడంతో పాటు అక్కడే నివసించేది. ఆ సమయంలో ఆమెను కలిసేందుకు వెళ్లేముందు బాంద్రా నుంచి ల్యాండ్ లైన్ ద్వారా ఫోన్ చేసి గంటలోగా తనని కలుస్తానని చెప్పి సచిన్ అక్కడికి వెళ్లేవాడు.

  పరిచయం ఉన్న అమ్మాయి ఆమె ఒక్కరే

  పరిచయం ఉన్న అమ్మాయి ఆమె ఒక్కరే

  అయితే అప్పట్లో బాంద్రా నుంచి వర్లీకి వెళ్లేందుకు సముద్రమార్గం లేదు.. అంజలితో మాట్లాడాలంటే కేవలం ల్యాండ్ లైన్లు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇంతా కష్టపడి హాస్పిటల్‌కు చేరేసరికి, ఎమర్జెన్సీ కేసులు లేదా పేషెంట్లకు సూచనలిచ్చే పనిలో అంజలి చాలా బిజీగా ఉండేదట. ఇక తనకు పరిచయం ఉన్న తనకు తెలిసిన ఏకైక అమ్మాయి అంజలియేనని సచిన్ ఎన్నోసార్లు చెప్పాడు. అందుకే వయస్సులో ఆమె పెద్దదైనా తాను చేసుకున్నానని చెప్పాడు.

  ధోని కన్నా ఏడేళ్లు పెద్ద

  ధోని కన్నా ఏడేళ్లు పెద్ద

  మహేంద్రసింగ్ ధోని ఈ పేరు గురించి మనదేశంలో అందరికీ తెలుసు. భారతజట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా, వికెట్ కీపర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోని, 2007 లో రాహుల్ ద్రావిడ్ నుండి కెప్టెన్సీ బాధ్యతల్ని తీసుకొని అత్యధిక విజయాలను అందించాడు. కెప్టెన్సీ రికార్డులను తిరగరాశాడు. ధోని కన్నా ఆయన భార్య సాక్షి ఏడేళ్లు పెద్దది. 2010వీరి వివాహం అయింది. వీరిద్దరి గురించి చాలా మందికి తెలుసు. డెహ్రాడూన్ డెహ్రాడూన్ లో సాక్షి తో ధోని వివాహం జరిగింది. ఆమె డెహ్రాడూన్ వాసి కావడంతో అక్కడే వివాహం చేసుకున్నారు.

  ఇర్ఫాన్ పఠాన్

  ఇర్ఫాన్ పఠాన్

  ఇర్ఫాన్ పఠాన్ మక్కాలో సౌదీ అరేబియా మోడల్ సాఫా బేగ్ ని ఇర్ఫాన్ వివాహం చేసుకున్నాడు. ఇక ఈయన తన పెళ్లికి కూడా చాలా తక్కువ మందినే ఆహ్వానించారు. అయితే ఈయన భార్యకు ఈయనకు పదేళ్లు తేడా ఉంది. అతని కంటే ఆమె పదేళ్లు చిన్నది.

  శిఖర్ ధావన్ కంటే చాలా పెద్దది

  శిఖర్ ధావన్ కంటే చాలా పెద్దది

  భారత క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ది ప్రేమ వివాహం. , అతని భార్య పేరు ఆయేషా ముఖర్జీ. సోషల్‌ వెబ్‌సైట్‌ ద్వారా వీరు ఒకరికొకరు పరిచయమయ్యారు. తర్వాత పెళ్లి చేసుకున్నారు. అతని కంటే 12 ఏళ్ల పెద్దయిన ఆయేషాను శిఖర్‌ ధావన్‌ పెళ్లి చేసుకున్నాడు. శిఖర్‌ ధావన్‌ భార్య ఆయేషా ముఖర్జీ బాక్సింగ్‌ క్రీడాకారిణి. శిఖర్‌ధావన్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా ఆయేషా ముఖర్జీ పరిచయమైంది. వీరిద్దరినీ ఫేస్‌బుక్‌లో కలిపింది హర్భజన్‌సింగ్‌.

  అప్పటికే పెళ్లయింది

  అప్పటికే పెళ్లయింది

  మెల్‌బోర్న్‌కు చెందిన ఆయేషా తల్లి బ్రిటిష్‌ దేశస్థురాలు. తండ్రి బెంగాళియన్. ఆయేషా ఆస్ట్రేలియాలో పెరిగింది. వీళ్ల నిశ్చిర్థార్థం 2009లో జరిగినా, క్రికెట్‌లో నిలదొక్కకునేవరకూ పెళ్లికి దూరంగా ఉండాలనుకున్నాడు ధావన్‌. చివరకు 2012లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ధావన్‌ కన్నా ముందేఆయేషాకు పెళ్లయింది. ఆమెకు ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. పదేళ్లపాటు మొదటి భర్త దగ్గర ఉండి తర్వాత విడిపోయింది. అయితే ధావన్, ఆయేషా అభిరుచులు కలవడం వల్ల వీరిద్దరూ ఏకమయ్యారు.

  షోయబ్ అక్తర్ కంటే చాలా చిన్నది

  షోయబ్ అక్తర్ కంటే చాలా చిన్నది

  పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఒక టీనేజ్ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అతని వయస్సు 42 ఉంటే ఆమె వయస్సు 23. ఆ అమ్మాయి అతనికన్నా వయసులో చాలా చిన్నది. పాకిస్థాన్ లోని హరిపూర్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ముస్తక్ ఖాన్ కుమార్తె రుబాబ్ తో ఆయన పెళ్లి జరిగింది.

  దినేశ్ కార్తీక్

  దినేశ్ కార్తీక్

  దినేశ్ కార్తీక్, స్వాష్ స్టార్ దీపికా పళ్లికల్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వేర్వేరు మతాలకు చెందిన ఈ ఇద్దరు పెళ్లికి ముందు రెండేళ్ల క్రితం నిశ్చితార్థం చేసుకుని తర్వాత పెళ్లి చేసుకున్నారు. కాగా దినేశ్‌కు ఇది రెండో వివాహం. భార్య, చిన్ననాటి స్నేహితురాలు కూడా అయిన నిఖితకు ఆయన విడాకులిచ్చి దీపికను పెళ్లి చేసుకున్నారు.

  వసీం అక్రమ్‌ భార్య కూడా చాలా చాలా చిన్నది

  వసీం అక్రమ్‌ భార్య కూడా చాలా చాలా చిన్నది

  వసీం అక్రమ్‌ మొదటి భార్య హ్యూమా క్యాన్సర్ వ్యాధితో అక్టోబ‌ర్ 2013 జూలై 7న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో మ‌ర‌ణించింది. అప్పటి నుంచి అక్రమ్ ఒంట‌రి గానే కాలం గడిపాడు వసీం అక్రమ్.

  అయితే ఈ 51 ఏళ్ల ఈ మాజీ స్టార్ బౌలర్ మెల్‌బోర్న్‌ యువతి షానియేరా థాంప్సన్‌ (17)ను వివాహం చేసుకున్నాడు. 2011లో షానియేరాను తొలిసారి కలిశాడు. ఆమెకు మొదట అక్రమే ప్రపోజ్‌ చేయడమే కాకుండా షానియేరా తల్లిదండ్రులను కూడా ఒప్పించాడు.

  సురేష్ రైనా

  సురేష్ రైనా

  సురేష్ రైనా చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంకను 2015 ఏప్రిల్ 3న వివాహం చేసుకున్నాడు. రైనా చిన్ననాటి స్నేహితురాలు అయిన ప్రియాంక బ్యాంకింగ్ రంగంలో నెదర్లాండ్స్ లో పని చేసేది. ఉత్తరప్రదేశ్ లోని బారట్ కు చెందిన ప్రియాంక కుటుంబ సభ్యులు మీరట్ లో ఉంటున్నారు. ప్రియాంక, రైనా ల తండ్రులు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో సహోద్యుగులు కావటం తో వారిద్దరూ చిన్నపటి నుంచి స్నేహితులు.

  గంభీర్

  గంభీర్

  ఢిల్లీకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె నటషా జైన్‌ను గౌతం గంభీర్ 2011లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరూ కూతుర్లు. మొదటి కుమార్తె ఆజీన్. ఆ తర్వా కూడా వీరికి మళ్లీ కూతురు జన్మించింది.

  మనోజ్ తివారీ

  మనోజ్ తివారీ

  బెంగాల్ క్రికెటర్ మనోజ్ తివారీ తన స్నేహితురాలు సుష్మితా రాయ్ ను వివాహం చేసుకున్నాడు. హౌరాలో వీరి వివాహం జరిగింది. పెళ్లికి ఆరేళ్ళ కిందట ఓ స్నేహితుడి ద్వారా న్యూ ఇయర్ పార్టీలో తివారీ, సుష్మిత ఒకరికొకరు పరిచయమయ్యారు. తొలిచూపులోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. చివరికీ ఒక్కటయ్యారు.

  పుజారా

  పుజారా

  ఛటేశ్వర్ పుజారా పూజ బాబ్రిని వివాహం చేసుకున్నాడు. పెళ్లికి ముందు ఏడాది క్రితం పుజారా - పూజాల ఎంగేజ్‌మెంట్ జరిగింది. పుజారాను ప్రేమించిన పూజా జంజోధ్‌పూర్‌కు చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్.

  ఉమేశ్ యాదవ్

  ఉమేశ్ యాదవ్

  ఉమేశ్ యాదవ్ ఢిల్లీకి చెందిన తానియా వాధ్వా అనే ఫ్యాషన్ డిజైనర్‌ను పెళ్లి చేసుకోన్నాడు. వీరిద్దరికి నాగ్‌పూర్‌లో నిశ్చితార్థం జరిగింది. తొలిసారి వీరిద్దరూ ఢిల్లీలో కలుసుకున్నారు. అప్పటి నుంచి పెరిగిన స్నేహం ప్రేమగా మారింది. తొలుత ఉమేశ్ ఆమెకు ప్రపోజ్ చేశారు. ఏడాది ప్రేమ తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని పెద్దలను సంప్రదించి పెళ్లి చేసుకున్నారు.

  భువనేశ్వర్

  భువనేశ్వర్

  భువనేశ్వర్ తాజాగా పెళ్లి పీటలు ఎక్కాడు. గ్రేటర్ నొయిడాకు చెందిన ఆయన లవర్ నుపూర్ నగర్‌తో భువీ వివాహం జరిగింది. ఈ వేడుకకి భారత జట్టు క్రికెటర్స్ హాజరయ్యారు.

  English summary

  cricket players who married huge age difference

  Cricket Players Who Married in Huge Age Difference!
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more