క్రికెటర్ల సెంటిమెంట్ల గురించి తెలుసా?, క్రికెటర్లు ఆడేటప్పుడు నమ్మే విషయాలు ఇవే,

Written By: Bharath
Subscribe to Boldsky

మనుషులకు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఇందుకు క్రికెటర్స్ మినహాయింపు కాదు. వీరికి కూడా నమ్మకాలు, విశ్వాసాలుంటాయి. ఈ విషయాన్ని కొందరు అంగీకరించారు కూడా. ఇండియా టీమ్ లోనే కాదు ప్రతి టీమ్ లో కొందరు సెంటిమెంట్స పాటిస్తూ ఉంటారు. క్రికెట్ ఆడేటప్పడు వారిని కాస్త పరిశీలిస్తే మనకు కూడా ఆ విషయాలు తెలిసిపోతాయి. తమకు ఈ సెంటిమెంట్లు ఉన్నాయి అని కొందరు క్రికెటర్లు బహిరంగంగానే చెప్పకనే చెబుతుంటారు. మరి ఏ క్రికెటర్ కు ఏ నమ్మకం ఉందో ఒకసారి చూద్దామా.

1. సచిన్ సెంటిమెంట్ ఇదే

1. సచిన్ సెంటిమెంట్ ఇదే

మన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ ఆడేటప్పుడు చాలా నమ్మకాలను పాటిస్తాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ బ్యాటింగ్ కు దిగేముందు తన కుడికాలుకు కాకుండా ఎడమకాలుకు ప్యాడ్ కట్టుకుంటాడు. ఇది ఆయనకు సెంటిమెంట్. ఇలా చేయడం వల్ల మంచి స్కోర్ చేస్తానని ఆయన నమ్మకం. దాదాపు ప్రతిసారి ఆయన మైదానంలోకి దిగేముందు ఎడమకాలుకే ప్యాడ్ కట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల చాలా మంచి స్కోర్ చేయగలిగాను అనేది ఆయన నమ్మకం.

2. విరాట్ కోహ్లీ

2. విరాట్ కోహ్లీ

భారత కెప్టెన్, విరాట్ కోహ్లీ కూడా క్రికెట్ ఆడేటప్పుడు కొన్ని సెంటిమెంట్స్ పాటిస్తాడు. ఈయన మొదట్లో ఉపయోగించిన గ్లవ్స్ కు చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రతిసారి వాటినే ఉపయోగించేవాడు. వాటిని ధరిస్తే కచ్చితంగా సెంచరీల మోత మోగిస్తానని ఆయన నమ్మకం. అయితే రానురాను వాటిని పక్కన పెట్టాడు. ప్రస్తుతం ఆయన సెంటిమెంట్ గా భావించే గ్లవ్స్ ఎక్కడున్నాయో తెలియదు.

3. అశ్విన్

3. అశ్విన్

మన టీమ్ లో ఉండే అత్యుత్తమ బౌలర్లలో ఆర్. అశ్విన్ ఒకరు. ఈయనకు కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉన్నాయి. అశ్విన్ మైదానంలో తన బ్యాగ్ ను సెంటిమెంట్ గా భావిస్తాడు. ఆ బ్యాగ్ తీసుకెళ్తే ఇండియా టీమ్ కచ్చితంగా విన్ అవుతుందని ఇతని నమ్మకం. తాను ఆ బ్యాగ్ ను తీసుకెళ్లినప్పుడల్లా మ్యాచ్ గెలిచామని అశ్విన్ విశ్వాసం.

4. యువరాజ్ సింగ్

4. యువరాజ్ సింగ్

మైదానంలోకి దిగితే తన సత్తా ఏమిటో చూపే యువరాజ్ సింగ్ కు కూడా కొన్నినమ్మకాలున్నాయి. యువరాజ్ లక్కీ నంబర్ 12. అందువల్లే ఆయన ఎప్పుడూ 12 నెంబర్ ఉండే జెర్సీను ధరిస్తాడు. ఆయన 12 వ నెల 12 వ తేదీన జన్మించారు. అందువల్లే 12 సంఖ్యను ఎక్కువగా నమ్ముతారు.

5. ఎంస్ ధోని

5. ఎంస్ ధోని

మహేంద్ర సింగ్ ధోనికి ఏడు అదృష్ట సంఖ్య. జెర్సీ నంబర్ మొదలు బ్యాటింగ్ కిట్‌నుంచి పెర్‌ఫ్యూమ్ బాటిల్స్ వరకు అంతటా ఏడు సంఖ్యనే కనిపిస్తుంది. మైదానంలో తాను రాణించేందుకు ఏడు సంఖ్య తనకు ఎంతో సహాయం చేస్తుందనేది అతని నమ్మకం. ఈయనకు ఈ సంఖ్య అచ్చి రావడం వల్ల ఇప్పటికీ ఎప్పటికీ దాన్నే నమ్ముతుంటాడు.

6. జయసూర్య

6. జయసూర్య

ది లెజెండ్ ఆఫ్ క్రికెట్ గా పేరుగాంచిన జయసూర్య గురించి అందరికీ తెలుసు. అయితే ఈయన మైదానంలోకి దిగేముందు కచ్చితంగా గ్లోవ్స్, ప్యాడ్స్, హెల్మెట్, పాకెట్స్ ఒకసారి చెక్ చేసుకుంటాడు. ఇలా చెక్ చేసుకుంటే కచ్చితంగా రికార్డులు మోగిస్తాననేది ఆయన నమ్మకం.

7. మైఖేల్ క్లార్క్

7. మైఖేల్ క్లార్క్

ఆస్ట్రేలియన్ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ కు ఒక నమ్మకం ఉంది. ఆయన బ్యాటింగ్ కు దిగే ముందు కచ్చితంగా మ్యూజిక్ వింటారు. ఆ మ్యూజిక్ కూడా చాలా గట్టిగా సౌండ్ పెట్టుకుని వింటాడు. దీనివల్ల అతనిలో ఉన్న డల్ నెస్ మొత్తం పోయి కొత్త ఉత్తేజం వస్తుందని క్లార్క్ నమ్మకం. ఈయన బ్యాటింగ్ కు ముందు ప్రతిసారి ఇలా మ్యూజిక్ వింటూ ఉంటాడు.

8. జయవర్ధనే

8. జయవర్ధనే

శ్రీలంకకు అనేక విజయాలు ఇచ్చిన వ్యక్తి మహేలా జయవర్దనే గురించి అందరికీ తెలిసి ఉంటుంది. ఈయనకు కూడా ఒక నమ్మకం ఉంది. బ్యాగింట్ కు దిగేముందు కచ్చితంగా ఈయన తన బ్యాట్ ను ముద్దుపెట్టుకుంటాడు. ఇలా చేస్తే కచ్చితంగా విజయం తమ టీమ్ దేదనని ఆయన విశ్వాసం. అలాగే తాను ఎక్కువగా స్కోర్ చేయడానికి కూడా తన సెంటిమెంట్ బాగా ఉపయోగపడుతుందని నమ్ముతాడు.

9. స్టీవ్ వా

9. స్టీవ్ వా

సెంటిమెంట్స్ ను బాగా నమ్మే వ్యక్తి స్టీవ్ వా. ఈయన మైదానంలోకి దిగే ప్రతిసారి కచ్చితంగా చేతిలో ఎరుపు రంగులో ఉండే కర్చీప్ పెట్టుకుని ఉంటాడు. దాన్ని అతని నాయనమ్మ స్టీవ్ వాకు ఇచ్చింది. ఆ కర్చీప్ ను ఎక్కవ సెంటిమెంట్ గా నమ్ముతాడు స్టీవ్ వా. అది ఉంటే కచ్చితంగా ఆటలో తన సత్తాచాటుతాననేది ఆయన నమ్మకం. ఇప్పటికీ తన నాయనమ్మ విషయంలో అతను చూపే గౌరవానికి, సెంటిమెంట్ కు ఇదే ప్రతీక.

10. సౌరవ్ గంగూలీ

10. సౌరవ్ గంగూలీ

క్రికెట్ అభిమానులకు ఎప్పటికీ రారాజు గంగూలీ. సౌరవ్ గంగూలీ తన పాకెట్లో ఎల్లప్పుడూ తన గురువు ఫోటోను పెట్టుకుని ఉండేవాడు. అలాగే ఆయన ఉంగరాలు, మాలలు ధరించేవాడు. మైదానంలోకి దిగితే ప్రత్యర్థులపై తన ఆటతో పంజా విసిరేవాడు. అయితే ఆయన క్రికెట్ ఆడినంతకాలం తన సెంటిమెంట్స్ ను ఒక్కసారి కూడా విస్మరించలేదు.

English summary

cricketers their superstition beliefs

These cricketers have openly confessed about their superstitious beliefs on the field.
Please Wait while comments are loading...
Subscribe Newsletter