Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
పని చేసే చోట 10 భిన్న వ్యక్తిత్వాలున్న సహోద్యోగులు
ఎవరో మహానుభావుడు ఊరకే అనలేదు! స్నేహితులను ఎంచుకునే స్వేచ్ఛ మనకుంది, కుటుంబాన్ని మాత్రం ఎంచుకోలేం. అదే విధంగా మనకు కావల్సిన సంస్థలో పనిచేసే అవకాశం మనకుంటుంది, ఐతే సహోద్యోగులను మాత్రం ఎ
ఎవరో మహానుభావుడు ఊరకే అనలేదు! స్నేహితులను ఎంచుకునే స్వేచ్ఛ మనకుంది, కుటుంబాన్ని మాత్రం ఎంచుకోలేం. అదే విధంగా మనకు కావల్సిన సంస్థలో పనిచేసే అవకాశం మనకుంటుంది, ఐతే సహోద్యోగులను మాత్రం ఎంచుకోలేం.
చాలా మంది ఇష్టంలేని ఎవరో ఒకరి కిందో, కలిసో పనిచేయాల్సి వస్తుంది. అందుకే ఉద్యోగంలో ఎప్పుడూ అసంతృప్తే.

కొలీగ్స్ మనకు పడనివాళ్లయితే వారి విషయంలో మనమేం చేయలేం. వారు ఉద్యోగంలోంచి వెళ్లిపోయేంత వరకు మనం వారిని భరించాల్సిందే. రోజు వారిని టాలరేట్ చేయక తప్పదు. ఇక ఆఫీసులో రకరకాల కొలీగ్స్ గురించి తెలుసుకుందాం.

1. వాగుడుకాయలు
అతి వాగే వ్యక్తులు ప్రతి ఆఫీసులోనూ తారసపడుతుంటారు. వీరికి సమయం విలువ బొత్తిగా తెలియదు. కనీసం మీ మూడ్‌ను, సీరియస్‌గా ఉన్న విషయాన్ని పట్టించుకోకుండా వాగుతూనే ఉంటారు. నెగిటివ్ ధోరణిలో ఆలోచించే వాళ్లుంటే వీళ్లతో మరింత డేంజర్!

2. అడ్డుపడేవారు
ఇలాంటి వ్యక్తులు తాము పర్‌ఫెక్ట్ అని నమ్ముతుంటారు లేదా బాస్ తర్వాత బాస్ అంతటి వాళ్లమని ఫీలవుతుంటారు. ఇలాంటి వారు ప్రతి విషయంలోనూ తల దూరుస్తారు. వాళ్లు ప్రతిదానికీ మోకాలడ్డం పడటం వల్ల మీ టెంపర్ తెగొచ్చు. ఇలాంటి వాళ్లు ఎప్పుడూ ఇతరుల ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టేందుకు చూస్తుంటారు. వాస్తవానికి వీరిలో అభద్రతా భావం ఎక్కువ. ఇలాంటి వాళ్లకు వారు కోరుకున్న దానికంటే ఎక్కువ సమాచారం ఇవ్వడం ఒకందుకు మీకు మంచిదే.

3. ఓవర్ కమిట్ అయిన కొలీగ్
ఇలాంటి కొలీగ్స్ మీరు చేసిన ప్రతి పని అప్ టు ద మార్క్ లేదని ఫీల్ అయ్యేలా చేస్తారు. వాళ్లు చేయాల్సిన దానికంటే ఎక్కువగా చేసేసి పై అధికారుల మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి వారి వల్ల మీకూ పని భారం, ఒత్తిడి పెరుగుతాయి. ఇలాంటివాళ్లు ఆఫీసు నుంచి ఆలస్యంగా వెళతారు, ఇది మీకూ అలవాటుగా మారొచ్చు!

4. మాజీ ఉద్యగులు
మీరేదైనా సంస్థలో పనిచేస్తుంటే కొత్తవాళ్లు వస్తుంటారు, పాత వాళ్లు వెళ్లిపోతుంటారు. ఎవరైనా మీకు సన్నిహితంగా ఉన్నవాళ్లు తొందర్లోనే సంస్థను వీడి వెళుతుంటే.. మీ బాస్‌కు మీ పైన కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఆఫీసులో ఇలాంటి వారితో కాస్త దూరంగా ఉండటమే మంచిది. కావాలంటే బయట సన్నిహితంగా మెలగొచ్చు.

5. కూల్ గా ఉండేవారు
ఆఫీసులో అన్నింటికంటే కూల్‌గా ఉండే వ్యక్తులు ఒకరో, ఇద్దరో ఉండనే ఉంటారు. వీళ్లతో గడిపే ప్రతి క్షణం ఉత్సాహభరితంగా ఉంటుంది. వీళ్లు సంస్థకు చెందిన ప్రతి నియమాన్ని తెంచేందుకు చూస్తుంటారు. ఐతే వీరిని ఆదర్శంగా తీసుకోవడం ఏమంత మంచిది కాదు. వీళ్లు ఆఫీసుకు లేట్‌గా రావడం గమనించే ఉంటారు. అంతే కాక బాస్ తో ఎప్పుడూ గొడవలే. ప్రతి కొలీగ్‌ను ఫ్లర్ట్ చేస్తూ కనిపిస్తారు. వీళ్లను చూసి నేర్చుకోవద్దు, అది మీ కెరీర్‌కు ముప్పుగా మారొచ్చు.

6. అదృష్టవంతులు
కొందరు ఉద్యోగులకు అంతగా నైపుణ్యాలు ఉండవు. అయినా కూడా టాలెంట్ ఉన్నవారితో పోలిస్తే త్వరత్వరగా పదోన్నతి పొందుతారు. వాళ్లతో అస్సలు పోల్చుకోవద్దు. మీ కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీయగలదు. కొందరికి అదృష్టం చాలా రకాలుగా కలిసి వస్తుంది. ఇదీ అలాంటిదే అనుకోండి. మీ పని మీరు సిన్సియర్‌గా చేసుకుంటూ వెళ్లండి, ఫలితాలు అవే వస్తాయి.

7. గాసిపర్స్
ప్రతి ఆఫీసులో ఒకరో ఇద్దరో గాసిప్‌లు చెప్పేవారు ఉంటారు. వీళ్లకు ప్రతి ఉద్యోగి గురించిన రహస్యాలు తెలుస్తాయి. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. వాళ్లతో ఏ కొంచెం తేడాగా మాట్లాడినా పెద్ద ఇరకాటంలో పడతారు. ఇతరుల గురించి గాసిప్స్ చెబుతున్నారంటే మీ గురించీ మరొకరికి చెబుతున్నారనే అర్థం.

8. ఆశయం ఉన్నవారు
ఇలాంటి విభాగంలో చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్లకి నైపుణ్యాలు, ఆశయాలు, అదృష్టం అన్నీ కలగలిసి వస్తాయి. ఇతరులతో పోలిస్తే త్వరత్వరగా ప్రమోషన్ వచ్చేస్తుంది. వీళ్లకు మంచి ఫోకస్ ఉంటుంది. ఫ్యూచర్‌లో బాస్ అయ్యే లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలున్న కొలీగ్స్‌ను సులభంగా గుర్తుపట్టవచ్చు ఎందుకంటే ఎప్పుడూ ఇతరులతో కఠినంగా వ్యవహరిస్తారు.

9. గూఢచారులు
ప్రతి ఆఫీసులో కనీసం ఒక గూఢచారి ఉంటాడు. వీళ్లు బాస్‌కు ప్రీతిపాత్రులు. ప్రతి ఒక్కరి పనిలో కలగజేసుకోవడం వీరి నైజం. బాస్ సపోర్ట్ కూడా వీరికి మెండుగా ఉంటుంది. ఇలాంటి గూఢచర్యత్వం చేయడం బాస్‌కు సైతం నచ్చుతుంది. మీతో వారికి ఎలాంటి పని ఉండకపోవచ్చు ఐనా మీరు ఏం చేస్తున్నారనే దాన్ని తెలుసుకోవాలనే ఉబలాటం ఉంటుంది.

10. పని చేస్తున్నట్టు నటించేవాళ్లు
ఇలాంటి వారు మిమ్మల్ని బాగా ఇరిటేట్ చేయవచ్చు. ఇలాంటి వారి వల్ల మీకు ఫ్రస్టేషన్ రావొచ్చు. ఎలాంటి పని వీరికుండదు, ఐనా తామంతా ఒక్కరమే పని భారమంతా మోస్తున్నట్టు నటిస్తారు. ఇలాంటి వారు తమ విధులకు తగ్గట్టుగా అంతగా పనిచేయరు సరికదా రోజంతా ఇంటర్నెట్‌తో గడిపేస్తారు. నెల చివరకొచ్చేసరికి మీకెంత జీతం వస్తుందో వారికీ అంతే వస్తుంది. ఈ విషయంలో చూసీ చూడనట్టు ఉండడం తప్ప ఏమీ చేయలేరు.



Click it and Unblock the Notifications