Latest Updates
-
వేసవిలో కడుపుకు హాయినిచ్చే బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..5 నిమిషాల్లో దహీ పోహా ఎలా చేయాలంటే.. -
ఆంధ్రప్రదేశ్‌లో తప్పకుండా సందర్శించాల్సిన 10 అతి పురాతన శివాలయాలు -
12 ఏళ్ల తర్వాత కర్కాటకంలో గురు ఉచ్ఛ స్థితి: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీదే! -
ధనస్సు, మీన రాశుల వారికి గురు గ్రహ అనుగ్రహం.. ఎవరికి ధన లాభం? - గురువారం, 04 జూన్ 2026 -
బరువు త్వరగా తగ్గాలంటే ఎక్సర్ సైజ్ ఏ టైమ్ లో చేయాలి? -
భర్త/భార్య పక్కనే ఉన్నా 'నాకు అర్థమయ్యే వాళ్లెవరూ లేరు' అనిపిస్తోందా? కారణం ఇదే -
నెలాఖరులో డబ్బు తక్కువైనప్పుడు భార్యాభర్తలు ఒకరితో ఒకరు ఎలా మాట్లాడతారో తెలుసా? -
సమ్మర్లో చల్లచల్లగా మిల్క్‌షేక్, మాక్‌టెయిల్.. ఈ ఫ్రూట్స్‌తో స్పెషల్ డ్రింక్స్ -
కొవిడ్ తెచ్చిన కష్టాలు.. యువతలో పెరుగుతున్న తుంటి మార్పిడి సర్జరీలు.! -
కళ్లలో నీళ్లు తిరుగుతున్నా ఆపకుండా తినేంత టేస్టీ..మహారాష్ట్ర స్పెషల్ తేచ్చా చికెన్..ఈజీగా ఎలా చేయాలంటే..
మాటిమాటికి హత్య చేస్తున్నట్టు కలలు వస్తున్నాయా?దానికి 15 కారణలున్నాయి!
మీరు ఎవరినైనా చంపుతున్నట్టు కల గన్నారా? అలాంటివేవైనా ఉంటే ఎంత ఒత్తిడిగా ఉంటుందో చెప్పలేం. అదే మనకు తెలిసినవాళ్లను చంపుతుంటే ఇక మనం పడే వేదన అంతా ఇంతా కాదు. కలలకు హద్దులంటూ ఉండవని మనకు తెలుసు. కలలో మనమేమైనా చేయవచ్చు. అయితే మన మనసు పొరల్లో ఎక్కడో ఏదో ఉంటేనే అలాంటి కలలు వస్తాయన్నది తెలుసుకోవాలి. వేరేవాళ్లను చంపినట్టుగా కల వస్తే ఏం తేల్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
హత్యలకు సంబంధించి కలలు కంటే దానికి మానసిక స్థితితో సంబంధముంటుంది. ఈ కలలు ఏం సూచిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. విపరీతమైన కోపం
మీకు విపరీతమైన కోపం వస్తుంటుంది. కానీ దాన్ని ఎవరి పైనా తీర్చుకోలేకపోతున్నారు. అవి తప్పనిసరిగా వ్యక్తి పైనే ఉండక్కర్లేదు. ఏదో ఒక సందర్భంపైనో లేదా వస్తువు పైనో ఉండొచ్చు. ఇలాంటివి మనసులో ఉంటే కలగా ఎవరినో చంపుతున్నట్టుగా వస్తాయి.

2. టెంపర్ కోల్పోవడం
ఎవరి విషయంలోనైనా మెల్లగా మన టెంపర్ ను కోల్పోతున్నట్టయితే మనకు హత్యకు సంబంధించిన కలలు వస్తాయంటారు. మన కలలో కనిపించిన వ్యక్తి గురించి ఆలోచించండి. అతడిపై మీకు పగ, ఈర్ష్య లాంటివేమైనా ఉన్నాయోమో ఆలోచించండి.

3. మిమ్మల్ని ఇబ్బందిపెట్టేది
ఏదో విషయం మిమ్మల్ని బాగా ఇబ్బందికి గురిచేస్తుంటుంది. దాన్ని చేయకుండా ఉండేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తుంటారు కానీ ప్రతిసారీ ఓడిపోతుంటారు. అది ఒక వ్యసనం కావొచ్చు, అలవాటు, ఇతరులతో బంధం కావొచ్చు. దాన్ని అంతమొందించలేనప్పుడే ఇలాంటి కలలు వస్తాయి.

4. వేధింపులు
మీరు వేధింపులకు గురైనప్పుడు తిరిగి ఎదుర్కోలేకపోతారు. అలాంటి సందర్భాల్లో ఎవరైతే మిమ్మల్ని వేధించారో కలలో వారిని చంపినట్టుగా మీకు కనిపించవచ్చు. అలా మీ బాధకు ప్రతీకారం తీర్చుకుంటున్నట్టు అర్థం.

5. ప్రతికూల ఆలోచనలు
మీకు ఎవరైనా వ్యక్తిలో నచ్చని లక్షణాలు కనిపిస్తే.. వాటిని చంపేయాలని చూస్తారు. ఆ వ్యక్తిని చంపినట్టుగా కల వస్తే నిజానికి మీరేమో ఆ వ్యక్తిలో ఉన్న చెడు లక్షణాలను చంపుదామని బలంగా అనుకుంటున్నట్టు అర్థం.

6. ప్రతిగా ప్రియమైనవారిని
మీకు ఎంతో ఇష్టమైనవారిని మీరే చంపుతున్నట్టుగా కల వచ్చిందా? భయపడకండి.. మీరేం వాళ్లకు హాని చేయదల్చుకోలేదు. కాకపోతే వాళ్లకే ఏదో కీడు జరగబోతున్నట్టు లెక్క. అది కాకుండా మీరు ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగానే ఇలాంటి కల.

7. కుంగుబాటు
మీరు కుంగుబాటులో ఉండి ఆత్మహత్య చేసుకోవాలనే తలంపుతో ఉన్నారా? అయితే ఇలాంటి కలలు రావడం సహజమే. కుంగుబాటులో ఉన్నవారికి చీకటి కోణపు కలలే ఎక్కువగా వస్తుంటాయి.

8. గతంలో చేదు సంఘటనలు
గతంలో ఎవరైనా వ్యక్తితో మీకు చేదు అనుభవం ఎదురై అతడితో మీరు మాట్లాడకపోయినా లేదా సదరు వ్యక్తి ఎప్పుడో చనిపోయినా.. అలాంటి వారికి సంబంధించిన ఏదో విషయం మిమ్మల్ని నిలకడగా ఉండనీకుండా చేస్తుంటుంది. ఫలితంగానే చంపే కలలు.

9. షాక్
గడచిన కొద్ది నెలల్లో, వారాల్లో ఏదైనా విషయం మిమ్మల్ని షాక్‌కు గురిచేస్తే అది మీ పై తీవ్ర ప్రభావం చూపించవచ్చు. భయభ్రంతాలుక లోనై అది అలాగే దాగి ఉండిపోతుంది.

10. ప్రతిఘటన
ఏదైనా విషయాన్ని వద్దని ప్రతిఘటిస్తుంటే .. ఆ వ్యక్తిని లేదా ఆ విషయానికి సంబంధించిన వారిని చంపుతున్నట్టు కల వస్తుంది అని అంటారు. అలా చేస్తేనే మీ సమస్య పరిష్కారమవుతున్నట్టు భావించడమే ఇందుకు కారణమని చెబుతారు.

11. గాఢమైన ఫీలింగ్స్
మర్డర్ అంటే గాఢమైన ఫీలింగ్స్‌తో ముడిపడి ఉంటుంది. సమాజంలో ఏదో ఒక విషయం అంగీకరించదు. దాన్నే మీరు వదిలించుకోవాలనుకుంటున్నారు.

12. వాదనలు
ఎవరితోనైనా గట్టిగా వాదించి ఉంటే గనుక ఆ వ్యక్తిని కలలో చంపుతున్నట్టుగా వస్తుంది. వాదించడం వల్ల కలిగే కోపమే ఇలా కల రూపంలో వెళ్లగక్కుతుంది.

13. ఘర్షణ
ఎవరితోనైనా ఘర్షణకు దిగారా? లేదా వారు మీతో ఘర్షణకు దిగాలనుకుంటున్నారా? ఇలాంటి పరిస్థితిలోనే కలలు విపరీత ధోరణిలో వెళ్లిపోతుంటాయి. కాస్త జాగ్రత్త

14. రిస్కీ సందర్భాలు
చాలా రిస్క్‌తో కూడిన సందర్భాలు మీకు ఎదురైతే .. లేదా కార్ యాక్సిడెంట్ లాంటివి జరిగి తీవ్రంగా గాయపడి ఉంటే మీ జీవితాన్ని మరింత కంట్రోల్లో తెచ్చుకోవాల్సిందిగా కలలు సూచిస్తాయి.

15. ఎక్కువైన సమస్యలు
మీ రోజువారీ జీవితంలో సమస్యలు ఎక్కువవుతున్నాయా? వాటిని ఎలా తగ్గించుకోవాలో పరిష్కారం కనబడకపోతేనే ఇలా ఇతరులను చంపుతున్నట్టు కల వస్తుంది. నిజానికి ఎవరినో కాదు .. మీ సమస్యలను చంపుతుంటారు అక్కడ. మనం ఈ కలలను ఈ విధంగా అర్థం చేసుకోవాలని సైకాలజిస్టులు చెబుతారు.



Click it and Unblock the Notifications