మరో మెట్టులో నిశ్చితార్థపు ఫోటోగ్రఫీ

Posted By: Deepti
Subscribe to Boldsky

జూన్ బగ్ వెడ్డింగ్స్ వారు తమ వార్షిక "మేటికే మేటి" ప్రేమ వ్యక్తీకరణ ఫోటోల పోటీ విజేతలను ప్రకటించారు. ఒప్పుకోవాలి, ఆ చిత్రాలు ఒకటికి మించి మరొకటి ఉన్నాయి !

ఈ ప్రేమ చిత్రాలు ఎంత వైవిధ్యంగా, ప్రత్యేకంగా ప్రేమను పంచుకోవచ్చో తెలిపేవి. ఈ అత్యంత అందమైన నిశ్చితార్థపు ఫోటోలు వారి బంధాన్ని అందంగా తెలియచేయటమే కాక, మీ మనస్సును కూడా కరిగిస్తాయి !

"ఈ ఫోటోలు నచ్చినవారు అవి చెప్పే కథలతో కూడా ప్రేమలో పడతారు " అన్న నానుడి ప్రకారం, మాకు తెలుసు మీరు కూడా ఇవి చూసాక అదే ఒప్పుకుంటారని !

సరే, ఇక ఆలస్యం చేయకుండా , ఈ అద్భుత ఫోటోలను చూసేయండి !

నగ్నంగా దూకిన జంట

నగ్నంగా దూకిన జంట

ఒక జంట నగ్నంగా సరస్సులోకి దూకుతూ, వారి పెంపుడు కుక్క చూస్తున్న ఈ చిత్రానికి దాని కథ దానికి ఉంది. ఎంత అందంగా తీసారు ! ప్రేమ బాహ్యసౌందర్యం కన్నా మించినది అని చూపించారు.

Image Courtesy: Tricia Victoria Photography

వేరే ప్రపంచం

వేరే ప్రపంచం

ఈ జంటకి తాము ఇద్దరు పూర్తిగా వైవిధ్యం అనే భావం ఎక్కువనుకుంటా, కానీ ఇద్దరూ కలిసి జీవించాలనే నిర్ణయం తీసుకున్నారు. అదిగో అదే ఈ చిత్రాన్ని అందంగా మార్చేసింది. అదే బంధాన్ని పూర్తిచేసింది.

Image Courtesy: Story & Gold Weddings

తీవ్ర భావావేశం కల జంట

తీవ్ర భావావేశం కల జంట

వారికి క్రీడలంటే ఉన్న ఇష్టమే ఇద్దర్నీ దగ్గర చేసి ఉంటుంది. ఒకరితో ఒకరు పిచ్చిగా ప్రేమలో ఉన్నట్టు కన్పిస్తున్న ఈ అందమైన ఫోటో మనల్ని కూడా ప్రేమలో పడేస్తుంది.

Image Courtesy: Julia & Gil Photography

 సరైన క్షణం

సరైన క్షణం

ఆమె సరే! అని చెప్పిన అద్భుత క్షణం. ఇది చాలా అందంగా ఉందనే చెప్పాలి. మీరు మీ తర్వాత తరం వాళ్లకి మీ గురించి ఫోటోలు చూపించాలంటే ఇలాంటివే చూపించాలనుకోరా?

Image Courtesy: Candice Marie Photography

అబ్బురపరిచే చిత్రం

అబ్బురపరిచే చిత్రం

ఇది నిజంగానే ఊపిరి బిగపట్టి చూడాల్సి వచ్చింది. అది ఎలా తీసారో తెలుసా? ఈ ఆనందంగా ఉన్న జంటలోంచి ప్రేమ తన్నుకు వస్తుంటే, ఈ రకంగా కాక ఇంకెలా తీస్తారు? ఇది నిజంగానే మాయలా ఉంది !

Image Courtesy: Diktat Photography

రక్షించే పోలీస్ !

రక్షించే పోలీస్ !

జంట యొక్క ప్రాణస్నేహితుడు, కాసేపు వారికి రక్షకుడిగా కాపలా కాస్తూ వారి ఘాటైన ముద్దుకి అవకాశం కల్పించాడు. అయ్యో, వారు అతన్ని పూర్తిగా మర్చిపోయి తమలోకంలో తామున్నారు.

Image Courtesy: SweetPaperMedia

ఇకపై రంగురంగుల జీవితం

ఇకపై రంగురంగుల జీవితం

వెనకాల ఉన్న రంగురంగుల నేపథ్యం జీవితం కాంతివంతంగా ఉన్నదని తెలియచేయట్లేదూ? ఈ జంటకి అభినందనలు ! వెనకాల వాడిన ఇంద్రధనస్సు రంగులు, కాంతిగా మెరుస్తూ ఈ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేట్లా చేస్తున్నాయి !

Image Courtesy: Daisy & The Duke

నీటిపై నడక

నీటిపై నడక

మీ భాగస్వామితో కలిసి సాయంత్రపు నడక, మీ ఫోటోగ్రాఫర్ హంసలు మీ చుట్టూ చేరినట్టుగా సరైన స్థానం వెతుక్కుంటూ తీసిన ఫోటో.. ఏమవుతుంది, మరింత ప్రత్యేకం అయింది. ఇది నిజంగా మేటి ప్రతిభతో, టైమింగ్ తో తీసిన చిత్రం. ఆ ఫోటోగ్రాఫర్ కి అనేక అభినందనలు.

Image Courtesy: Cheese N Click Photography

అందంగా అద్దిన రంగులు !

అందంగా అద్దిన రంగులు !

అమ్మాయి డ్రెస్ రంగు, వెనకాల రంగురంగుల ప్రకృతి సరిగ్గా అమరిపోయాయి. ఈ అందమైన ప్రేమ వ్యక్తీకరణ ఫోటోలో రంగుల వాడకంలో ప్రతిభ మళ్ళీ అద్భుతంగా కన్పిస్తోంది.

Image Courtesy: Jordan Voth Photography

అన్నింట్లో సాదాతనం

అన్నింట్లో సాదాతనం

ఇది అన్నిటికన్నా సాదాగా ఉన్నా సరిగ్గా ఉంది ! ఎంతైనా, జీవితం చాలా సాదా విషయం కదా. ఈ ప్రేమ కథా చిత్రం మన బంధాలకు ఆశయంగా తప్పక మారుతుంది.

Image Courtesy: Abigail Lauren Photography

మంచువానలో ముద్దు !

మంచువానలో ముద్దు !

మంచువాన పడుతుండగా, ఒక జంట ముద్దాడాలనుకున్నప్పుడు తీసిన అందమైన క్షణాలు ! దీనికన్నా ప్రేమ వ్యక్తీకరణని కెమెరాలో ఎలా బంధించగలరు? పెట్టిన ప్రతిరూపాయికి ఫలితం దక్కింది.

Image Courtesy: The DV Image

అంతా సంతోషమే

అంతా సంతోషమే

ప్రేమంటే ఆనందాన్ని పంచుకోటమేగా? జీవితాన్ని కేవలం సంతోషమే సరిగ్గా మార్చగలదు, ఇదిగో ఈ జంట అదే నిరూపిస్తున్నారు ! మాకు తెలుసు ఈ నిశ్చితార్థపు ఫోటో మిమ్మల్ని తప్పకుండా చిరునవ్వు వైపు వెళ్ళేలా చేసిందని!

Image Courtesy: Life Is Beautiful

అందమైన నేపథ్యం,కాంతి !

అందమైన నేపథ్యం,కాంతి !

వెనుక కాంతి ఈ చిత్రాన్నే మరింత ప్రత్యేకంగా మార్చేసి మమ్మల్ని ప్రేమలో పడేసింది ! రాత్రివేళ కాంతి ఎప్పుడూ రొమాంటిక్ గానే ఉంటుంది. ఇదిగో ఇదే ఫోటోగ్రాఫర్ ఒడిసిపట్టుకున్నాడు.

Image Courtesy: Luke Liable

అదే క్షణం తలుచుకుంటూ !

అదే క్షణం తలుచుకుంటూ !

వీరి ప్రేమ తప్పకుండా జిమ్నాస్టిక్స్ పై ఇష్టంతో మొదలై వుంటుంది ! ఈ చిత్రం వారు ఎలా కలిసారో, వారి ప్రయాణం ఎలా సాగిందో నిర్వచించేట్టుగా ఉంది. దీనివెనక చాలా లోతైన ఆలోచన ఉంది సుమా !

Image Courtesy: Ron Dillon Photography

ఒక పిచ్చి ప్రేమ జంట

ఒక పిచ్చి ప్రేమ జంట

పిచ్చి అల్లరి పనులు చేయటం కన్నా పెద్ద పనులు ఏం ఉంటాయి, కదా? ఈ చిత్రం ఈ జంట పిచ్చితనాన్ని అందంగా చూపిస్తోంది. ఈ నీటి స్నేహితులు వారెంత ప్రేమికులో, ఎలా కలసి ఉంటారో చేసి చూపించారు. చాలా బావుందిగా అది.

Image Courtesy: Sun + Life Photography

అతను ఆమెను ముద్దాడాలనుకున్నప్పుడు !

అతను ఆమెను ముద్దాడాలనుకున్నప్పుడు !

మళ్ళీ రాత్రి, దాని కాంతి ఒకే మూడ్ లోకి వచ్చేసి, ఫోటో తీసి తీరేట్టుగా మారిపోయాయి. అవన్నీ వ్యక్తీకరించేది ఒక్కటే, ప్రేమ ! చర్చ్ గేట్ వద్ద సాయంత్రపు ముద్దు ఆరోజునే అందంగా మార్చివేసింది !

Image Courtesy: Renata Xavier Photography

ఒకరి వద్ద ఒకరు స్వాంతన పొందటం

ఒకరి వద్ద ఒకరు స్వాంతన పొందటం

ఈ అద్భుత ప్రేమ ఫోటో మనస్సుకు శాంతినిస్తుంది, ఎందుకంటే ఫోటోగ్రాఫర్ ఆ జంట భావాలను అందంగా బంధించాడు. పైగా వారు ఒకరి బాహువుల్లో ఒకరు ఎంతో సౌకర్యంగా, శాంతిగా ఉన్నారు. ఇది కూడా మనం సాధించాల్సిన విషయాల్లో ఒకటేమో !

Image Courtesy: Sara K Byrne Photography

బీచ్ లో నడక

బీచ్ లో నడక

జంటలు చేసే సాధారణ పని ఇదైనా, ఈ చిత్రం ప్రత్యేకమైనదే. ఎందుకంటే ఇది పై కోణంలోంచి తీసినది. దానివల్ల చాలా ప్రత్యేకంగా, అందంగా కన్పిస్తోంది.

Image Courtesy: Kama Catch Me Photography

విశ్రాంతినిచ్చే ఫోటో

విశ్రాంతినిచ్చే ఫోటో

అరె వాహ్ ! కళ్ళు తిప్పుకోలేని ఈ ప్రేమ ప్రపోజల్ చిత్రం ఎంత సాదాగా అందంగా తీసారో చూడండి. మీ భాగస్వామిని ముద్దాడుతున్నప్పుడు మొహంలో ఉన్న ప్రశాంతత చాలా శాంతినిస్తుంది !

Image Courtesy: FEDERICA CAVICCHI PHOTOGRAPHY

ప్రపంచంలో ఏ మూలైనా ప్రేమ దొరుకుతుంది

ప్రపంచంలో ఏ మూలైనా ప్రేమ దొరుకుతుంది

ప్రేమ ప్రపంచంలో ఎక్కడైనా దాని దారి వెతుక్కుంటుంది !ఇదిగో ఇలాంటి చోట్ల కూడా ! ఈ అందమైన, ముద్దుగా ఉన్న ప్రేమ ఫోటోగ్రాఫర్ సృజనాత్మక ఆలోచనకి తార్కాణం !

Image Courtesy: Sara Rogers Photography

అందమైన జంట

అందమైన జంట

ఈ చిత్రం మామూలుగా కన్పించినా, ఇది ఆ జంట ఆనందకర క్షణాలను ఫొటోలో పట్టితెచ్చింది ! వారిద్దరి ముఖాలపై ఉన్న చిరునవ్వులు నిజమైన ప్రేమ నిజంగానే ఉన్నదనే నమ్మకాన్ని కలిగిస్తుంది.

Image Courtesy: Lukas Piatek

తల్లకిందులైన చిత్రం

తల్లకిందులైన చిత్రం

ఇది తప్పకుండా వసంతకాలపు ప్రేమ ప్రపోజల్ అయ్యి ఉంటుంది ! ఫోటోగ్రాఫర్ కి తప్పకుండా దాన్ని ఎలా ఒడిసిపట్టుకోవాలో తెలుసు. ఈ సంతోషకరమైన జంట, వారి చుట్టూ పరుచుకున్న రంగులే ఇక్కడ కథను తెలుపుతున్నాయి.

Image Courtesy: Shari + Mike Photographers

ఆమెను జీవితం మొత్తానికి పొందినప్పుడు

ఆమెను జీవితం మొత్తానికి పొందినప్పుడు

ఈ అమ్మాయికి అతని చేతుల్లో వాలి ఉండటం నిజంగా ఇష్టమేనేమో ! ఫొటోగ్రాఫర్ కి ఇంకేం కావాలి? అతనికి వారి ప్రేమను బయటకి తేవడం పెద్దకష్టం కాలేదని అర్థమవుతోంది.

Image Courtesy: Sebastien Bicard Photography

కొత్తజీవితం మొదలుపెడుతూ

కొత్తజీవితం మొదలుపెడుతూ

ఈ జంట వారి ప్రయాణం కలిసి చేయటానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు కదా. వారు కలిసి సైకిల్ నడపాలనుకున్నారు. పర్యావరణానికి కూడా మంచిదేలేండి.

Image Courtesy: Eric Floberg Film and Photography

వర్షపు ముద్దు !

వర్షపు ముద్దు !

వర్షంలో ముద్దాడాలని నిర్ణయించుకున్న జంటను, ఆ క్షణాలను వారికి జ్ఞాపకాలుగా మార్చాలిగా. ఫోటోగ్రాఫర్ దాన్ని చక్కగా వినియోగించుకున్నాడు. ఈ ప్రేమ ఫలించిన రోజు చిత్రం మీ మనస్సును కదిలించి, మీకు ప్రేమలోనే జీవితాంతం ఉండాలనిపించేట్లా ఖచ్చితంగా చేసే ఉంటుంది.

Image Courtesy: Melissa Cervantes Photography

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Engagement Photography Taken To Another Level

    These engagement pictures are not average engagement pictures, as they have been clicked in the perfect locations, making them look unique and perfect.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more