For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిజంగా ఆ పాఠశాలకు దెయ్యం వెళ్లింది

మామూలుగా పాఠశాలకు విద్యార్థులు వెళ్తుంటారు. కానీ ఆ పాఠశాలకు మాత్రం దెయ్యం వెళ్లింది. తెల్లవారుజామున స్కూల్ లోకి ప్రవేశించి స్టూడెంట్స్ లాకర్లలో ఉంచిన పుస్తకాలన్నింటినీ కిందకు విసిరివేసింది. లాకర్లను ఊ

|

మామూలుగా పాఠశాలకు విద్యార్థులు వెళ్తుంటారు. కానీ ఆ పాఠశాలకు మాత్రం దెయ్యం వెళ్లింది. తెల్లవారుజామున స్కూల్ లోకి ప్రవేశించి స్టూడెంట్స్ లాకర్లలో ఉంచిన పుస్తకాలన్నింటినీ కిందకు విసిరివేసింది. లాకర్లను ఊపేసింది. తలుపులు మూసి ఉంచిన లాకర్లను తెరిచి అందులో వాటన్నింటినీ కిందపడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగా కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి. కొన్ని రోజులుగా ఈ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది.

1. తెల్లవారుజామున ప్రవేశించింది

1. తెల్లవారుజామున ప్రవేశించింది

ఐర్లాండ్‌లోని కార్క్ నగరంలో డీర్ పార్క్ అనే సీబీఎస్ పాఠశాల ఉంది. తెల్లవారుజామున 3 గంటలకు అక్కడ దెయ్యం ప్రవేశించినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాలన్నీ కూడా సీసీ కెమెరాలో నమోదయ్యాయి.

2. ఫుటేజ్ లో క్లియర్ గా కనిపిస్తుంది

2. ఫుటేజ్ లో క్లియర్ గా కనిపిస్తుంది

దెయ్యం ఏమిటో అలా చేయడం ఏమిటని మీరనుకుంటే.. ఈ వీడియో చూస్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది. అందులో లాకర్స్ షేక్ అవుతాయి. అందులోని పేపర్ లో గాల్లో తేలియాడుతూ కిందపడతాయి. వీటన్నింటిని బట్టీ మనకు కచ్చితంగా అందులోకి దెయ్యం ప్రవేశించిదనే విషయం స్పష్టమవుతుంది.

3. పాఠశాల చరిత్ర

3. పాఠశాల చరిత్ర

19 వశతాబ్దంలో ఈ పాఠశాలను నిర్మించారు. ఈ పాఠశాలలో అనేక మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి పూట పాఠశాలలోని విద్యార్థులు పుస్తకాలను వుంచే కబోర్డు నుంచి పుస్తకాలు బయటికి విసిరేయబడుతున్నాయి. ఆపై ఓ నలుపు ఆకారంలోని ఓ రూపం నడిచి వెళ్తున్నట్లు గల దృశ్యాలు సీసీటీవీ వీడియోలో రికార్డైనాయి.

4. దెయ్యం రెండో సారి వచ్చింది

4. దెయ్యం రెండో సారి వచ్చింది

గతంలో కూడా ఈ స్కూల్లో దెయ్యాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత మాత్రం ఇక్కడ దెయ్యం నిజంగానే సంచరిస్తున్నట్లు నమ్మాల్సి వస్తోంది.

5. కుర్చీలనూ కదిల్చింది

5. కుర్చీలనూ కదిల్చింది

దెయ్యం లాకర్ లోని పుస్తకాలను కిందికి విసిరివేసి వెళ్లలేదు. మళ్లీ ఉదయం 5:30 గంటలకు మళ్లీ ఒక్కసారి చూసొద్దామనుకున్నట్లుంది. ఈ సారి పుస్తకాల జోలికి వెళ్లలేదు. కుర్చీలను అటూ ఇటూ తిప్పుతూ ఆడుకుంది. మూడు కుర్చీలుంటే అందులో ఒకదాన్ని ఈడ్చుకెళ్లింది.

6. భయపడుతున్న స్కూల్ యాజమాన్యం

6. భయపడుతున్న స్కూల్ యాజమాన్యం

ఈ వీడియో చూసిన తరువాత స్కూల్ యాజమాన్యం భయాందోళనకు గురువుతోంది. అసలు స్కూల్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. పైగా దెయ్యం కదలికలు కనిపించడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

7. నిజంగా ఆశ్చర్యం

7. నిజంగా ఆశ్చర్యం

వీడియో చూస్తే ఎవరికైనా కాస్త ఆశ్చర్యం వేస్తుంది. స్కూల్ లోపల ఉన్న కుర్చీలు వాటంతట అవే పైకి లేస్తాయి. ముందుకు వెళ్లిపోతాయి. గతంలో కూడా ఆ స్కూల్ సీసీ కెమెరాల్లో ఇలాంటి వీడియో ఒకటి రికార్డ్ అయింది. అవి నిజంగానే దెయ్యం కదలికలా లేక విద్యార్థులు డిజైన్ చేసిన ఫ్రాంక్ వీడియోలా అనే విషయంలో స్కూల్ యాజమాన్యానికే క్లారిటీ లేదు.

8. ప్రిన్సిపాల్ చెప్పిన మాటలివే

8. ప్రిన్సిపాల్ చెప్పిన మాటలివే

ఇక ఈ వీడియోలు చూసిన తర్వాత పాఠశాల ప్రిన్సిపాల్ ఆరోన్ వోల్ఫ్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసారు. సుమారు 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పాఠశాలలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నాడు. వాస్తవానికి ఇక్కడ దెయ్యాలు లేవని తాను నమ్ముతున్నానని అయితే వీడియో చూసిన తర్వాత కాస్త అనుమానపడాల్సి వస్తోందన్నాడు.

9. రెండోసారి ప్రవేశించిన దెయ్యం వీడియో

ఇక పాఠశాలలో రెండోసారి దెయ్యం వచ్చి కుర్చీ అటు ఇటులాగుతు ఉన్న వీడియో చూస్తే నిజంగా స్కూల్ లోకి దెయ్యం ప్రవేశించిందో లేదో మనకే అర్థం అయిపోతుంది. మరి ఆ వీడియోను మీరూ చూడండి.

English summary

ghost activity caught on camera in a high school

Check out this bizarre ghost activity caught in the school's cctv on two different occasions.
Story first published:Wednesday, November 22, 2017, 12:41 [IST]
Desktop Bottom Promotion