గడ్డం ఆకారం లేదా షేప్ ను బట్టి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు..! మీరూ ట్రై చేయండి

Posted By:
Subscribe to Boldsky

మన వ్యక్తిత్వం, ఎదుటివాళ్ల మనస్తత్వం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కొక్కరి ఆలోచనలు, అభిప్రాయాలు, అలవాట్లు ఒకోలా ఉంటాయి. నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒక్కో సందర్భంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే.. ఒక్కో సందర్భంలో అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అయితే ఇలా స్వభావం ఒక్కొక్కరిది ఒక్కోలా ఉండటం సహజం. ఎవరి స్వభావం ఎలాంటిదో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు.

జాతకాలు, చేతి రేఖలు, పుట్టిన రోజుని, రాశులను బట్టి మనస్తత్వాలు కొంతవరకు అంచనా వేస్తుంటారు. వీటన్నింటికీ జ్యోతిష్యం తెలిసి ఉండాలి. కానీ జ్యోతిష్యంతో పని లేకుండా.. కేవలం ఎదుటివాళ్ల రూపురేఖలు గమనించి కూడా వాళ్ల క్యారెక్టర్ ని అంచనా వేసే టాలెంట్ ఇప్పుడు బయటపడుతోంది. కొన్ని అధ్యయనాల ద్వారా గడ్డం రూపుని బట్టి నేచర్ ని తెలుసుకోవచ్చట. ఒక్కొక్కరి గడ్డం ఒక్కో రకంగా ఉంటుంది. కొందరిది చిన్నగా ఉంటే.. కొందరిది పెద్దగా ఉంటుంది. దీన్ని గడ్డం రూపంలో ఉండే వ్యత్యాసాన్ని బట్టి వాళ్ల స్వభావం ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం..

 1. గుండ్రటి గడ్డం

1. గుండ్రటి గడ్డం

వింతగా.! మొదట మీరు ఏబాడీపార్ట్ వాష్ చేస్తారో..దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం తెలుసుకోవచ్చుట..

గుండ్రటి గడ్డం ఉన్నవాళ్లు సంతోషంగా, పాజిటివ్ గా ఉంటారు. వీళ్లు సహజమైన, కళాత్మకులై ఉంటారు. వీళ్లు మనసుతో ఆలోచిస్తారు. రోజూ చాలా హ్యాపీగా గడుపుతారు. ఎందుకంటే.. వీళ్లు తమ మనసు చెప్పినట్టు నడుచుకుంటారు. వీళ్లు జీవితంలో ఆనందాన్ని మాత్రమే చూస్తారు. కొన్ని సందర్భాల్లో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

2. పొడుచుకు వచ్చినట్టు ఉండే గడ్డం

2. పొడుచుకు వచ్చినట్టు ఉండే గడ్డం

పొడుచుకు వచ్చినట్టుగా గడ్డం ఉన్నవాళ్లు చాలా స్ర్టాంగ్ గా ఉంటారు. లక్ష్యసాధన కోసం కష్టపడతారు. చాలా మంది సక్సెస్ అయిన బిజినెస్ మ్యాన్స్ కి ఇలాంటి గడ్డమే ఉంటుంది. వీళ్లు ప్రజాకర్షణతోపాటు లీడర్ షిప్ క్వాలిటీస్ కూడా ఎక్కువ. కష్టపడి పనిచేయడానికి ఏమాత్రం సంకోచించరు. లక్ష్యాలను చేరుకోవడానికి ఏవైనా వదులుకోవడానికైనా వెనకాడరు. ప్రేమ, కుటుంబం, ఫ్యామిలీ, రిలేషన్స్ వంటి వాటికి రెండో ప్రాధాన్యత ఇస్తారు.

3. చతురస్రాకారంలో గడ్డం

3. చతురస్రాకారంలో గడ్డం

స్క్వేర్ షేప్ లో ఎవరికైతే గడ్డం ఉంటుందో వాళ్లు క్రూరంగా ఉంటారు. నిజాయితీని వీళ్లు అంగీకరించరు. వీళ్ల ఫీలింగ్స్, ఎమోషన్స్ వ్యక్తపరచడంలో ఫెయిల్ అవుతారు. వీళ్లు చాలా అహంకారంతో ఉంటారు. ఒంటరి రాత్రులు గడపడానికి ఇష్టపడతారు.

ముక్కు షేప్‌ని బ‌ట్టి మీ ప‌ర్స‌నాలిటీ ఎలాంటిదో తెలుసుకోవ‌చ్చు..!

4. వెనక్కిపోయినట్టు ఉండే గడ్డం

4. వెనక్కిపోయినట్టు ఉండే గడ్డం

గడ్డం వెనక్కిపోయినట్టు ఉండేవాళ్లు చాలా పాపులర్ అవుతారు. అలాగే మంచి గుర్తింపు సంపాదిస్తారు. జీవితంలో కలిసే ప్రతి ఒక్కరినీ ఇష్టపడతారు.. అలాగే ప్రతి ఒక్కరితో కలిసిపోతారు. వీళ్లు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే ఆర్థికంగా సౌకర్యవంతంగా ఉంటారు.

5. చిన్న గడ్డం

5. చిన్న గడ్డం

చిన్న గడ్డంతో పుట్టిన వాళ్లు ఫిలాసఫర్స్ గా మారడానికి ఛాన్స్ ఉంది. వీళ్లు చాలా లోతుగా ఆలోచిస్తారు. అలాగే చాలా తెలివైనవాళ్లు.

6. పొడవాటి గడ్డం

6. పొడవాటి గడ్డం

వీళ్లు హ్యాపీ, లక్కీ స్వభావం కలిగినవాళ్లు. చాలా సులభంగా కలిసిపోయే తత్వం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తారు. వీళ్లకు ఆయుష్షు ఎక్కువ. వీళ్ల స్వభావం కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి లోనవడానికి కారణమవుతుంది. వీళ్లకు వంట చేయడం అంటే చాలా ఇష్టం.

7. డబుల్ చిన్:

7. డబుల్ చిన్:

సాధారణంగా డబుల్ చిన్ ఉన్నవారు చాలా అరుదుగా కనబడుతుంటారు. ఎక్కువ మందికి ఉండదు. అయితే డబుల్ చిన్ ఉన్నవారి గురించి ఒక వాస్తవమేంటంటే, వీరు బెటర్ లైఫ్ ను పొందుతారు. వీరు అఫిషియల్ గా ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉంటారు. మంచి కుంటుంబంతో జీవిస్తారు.

మీ భర్త చేతులు అతని పర్సనాలిటి గురించి ఏం తెలుపుతాయి..

8. క్లెఫ్ట్ చిన్(గడ్డం క్రింది చిన్న చీలిక) :

8. క్లెఫ్ట్ చిన్(గడ్డం క్రింది చిన్న చీలిక) :

వీరు చాలా ఇంట్రెస్టింగ్ పర్సనాలిటి కలిగి ఉంటారు. ఇలా గడం షేప్ ఉన్నవారు, సెక్స్ మీద ఎక్కువ కోరికలను కలిగి ఉంటారు. అందరిలో ఆకర్షనీయంగా కనబడటానికి ఇష్టపడుతారు. వారి వయస్సు కూడా బాటిల్ ఆఫ్ వైన్ లా ఉంటుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    How Can Chin Shape Reveal About Your Personality

    This may sound bizarre, but these theories hold some merit to them and have proven to be quite legit. Hence, this is one of the reasons that we are enlightening you as to how your chin shape can reveal about your personality.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more