ఇండియన్ కరెన్సీ నోట్స్ మీద గల చిత్రాలు, వాటి అర్థాలు!

By: Ashwini Pappireddy
Subscribe to Boldsky

ఆనందం మరియు భావోద్వేగాలతో పాటు, డబ్బు కొనలేనిది అంటూ ఏదీ లేదు! మనం రోజూ చాలా డబ్బు ని ఖర్చు చేస్తుంటాము మరియు ప్రతి రోజు కరెన్సీ నోట్స్ ని ఉపయోగిస్తుంటాము. కానీ మీరు ఎప్పుడైనా భారత కరెన్సీ నోట్ల వెనుకున్న డిజైన్స్ ఏంటని వాటికోసం కొంచం సమయం కేటాయించారా?

భారతీయ కరెన్సీ నోట్ల వెనుకన వున్న ప్రతి ఒక్క చిత్రానికి దాని కంటూ ఒక స్వంత అర్ధాన్ని మరియు అది అక్కడ ఉండటానికి ఒక ప్రత్యేకమైన కారణముంటుంది.

ఇండియన్ కరెన్సీ గురించి మీకు తెలియని కొన్ని సర్ ప్రైజింగ్ విషయాలు..!!

అయితే, దాని వెనుక దాగున్న అర్థం ఏమిటో మరియు భారత కరెన్సీ నోట్ల వెనుక వేర్వేరు చిత్రాలను ఎందుకు ముద్రించి ఉన్నాయో మీకు తెలుసా?దీనికి గల కారణం ... దీని అర్థం ఏమిటో ఇక్కడ చదివి తెలుసుకోండి ...

ఒక రూపాయి నోటు

ఒక రూపాయి నోటు

ఇందులో వున్న ఆయిల్ రిగ్ మన దేశపు పారిశ్రామిక అభివృద్ధిని ని సూచిస్తుంది.

రూ. 500, 1000 నోట్ల బ్యాన్ తర్వాత షాకిస్తున్న రియాక్షన్స్..!

రెండు రూపాయిల నోటు

రెండు రూపాయిల నోటు

రెండు రూపాయిల నోట్లో ప్రముఖ ఆర్యభట్ట శాటిలైట్ ఉంటుంది. ఇది సైన్స్ & టెక్నాలజీ రంగంలోని పురోగతిని సూచిస్తుంది.

ఐదు రూపాయల నోటు

ఐదు రూపాయల నోటు

ఈ నోట్ లో సాగుచేసిన పొలం యొక్క చిత్రం ఉంది. ఇది వ్యవసాయ రంగంలో పురోగతిని సూచిస్తుంది.

పది రూపాయల నోటు

పది రూపాయల నోటు

ఈ నోట్ భారతదేశంలోని జంతు సముదాయం యొక్క చిత్రాన్ని కలిగి ఉంటుంది, అంటే ఇది దేశంలోని జీవవైవిధ్యాన్ని సూచిస్తుంది.

ఇరవై రూపాయిల నోటు

ఇరవై రూపాయిల నోటు

ఈ నోట్లో పామ్ ట్రీస్ ముద్రించబడి ఉంటుంది, పోర్ట్ బ్లెయిర్లోని మౌంట్ హ్యారియెట్ లైట్ హౌస్ నుండి ఈ చిత్రాన్ని తీసుకోవడం జరిగింది.

యాభై రూపాయిల నోటు

యాభై రూపాయిల నోటు

ఈ నోటు మీద భారత పార్లమెంట్ చిత్రం ముద్రించబడి ఉంటుంది. ఇది భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా సూచిస్తుంది.

మనీ గురించి మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్..

వంద(నూరు) రూపాయల నోటు

వంద(నూరు) రూపాయల నోటు

ఈ నోటు మీద కంచన్జంగ చిత్రం ముద్రించబడి ఉంటుంది. ఇది భారతదేశం యొక్క ఎత్తైన శిఖరాన్ని సూచిస్తుంది.

పాత అయిదు వందల రూపాయల నోటు

పాత అయిదు వందల రూపాయల నోటు

ప్రస్తుతానికి ఈ 500 రూపాయల నోటుకి విలువ లేదు. దీని మీద దండి మార్చ్ యొక్క చిత్రం ముద్రించబడి ఉంటుంది. ఇది ఉప్పు సత్యాగ్రహాన్ని సూచిస్తుంది.

ప్రస్తుత ఐదు వందల రూపాయిల నోటు

ప్రస్తుత ఐదు వందల రూపాయిల నోటు

ప్రస్తుత 500 రూపాయల నోటు ఫై ఎర్రకోట యొక్క చిత్రం ముద్రించబడి ఉంటుంది, ఇది భారతదేశపు గొప్ప చరిత్రను సూచిస్తుంది.

పాత1000 రూపాయిల నోటు

పాత1000 రూపాయిల నోటు

పాత1000 రూపాయిల నోటు భారతీయ ఆర్థిక వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

రెండు వేల రూపాయిల నోటు

రెండు వేల రూపాయిల నోటు

ఈ కొత్త నోటు చంద్రయాన్ చిత్రం దానిపై ముద్రించబడి ఉంటుంది. ఇది భారతదేశం యొక్క ఏస్ స్పేస్ మిషన్కు ప్రాతినిధ్యం వహిస్తుంది.

English summary

Images On Indian Currency Mean This!

Do you know what these images on the backside of Indian currency notes signify? Check this out to know more.
Story first published: Wednesday, June 28, 2017, 9:00 [IST]
Subscribe Newsletter