హోటళ్లలో సగం వాడిన సబ్బులను ఏమి చేస్తారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ?

Posted By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

మనం ఎప్పుడైనా సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లి అక్కడ నుండి తిరిగి వస్తున్నప్పుడు, మనకు తెలియకుండానే తప్పకుండా చేసే పని, మనం వెళ్లిన చోట మనం వాడగా మిగిలిన చిన్న చిన్న సబ్బులను మరియు వాడని అలంకరణా వస్తువులను ఇంటికి తెచ్చేస్తుంటారు.

కానీ మీరు గనుక సగం వాడిన వస్తువులను అలానే అక్కడే వదిలేసి వస్తే, వాటిని ఏమి చేస్తారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ?

హోటల్ రూమ్ లలో, మీరు వదిలి వెళ్లిన సగం వాడిన సబ్బులను ఏమి చేస్తారో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

మర్మావయవాలపై సబ్బును ఎందుకు ఉపయోగించకూడదు !!

ఇందుకు సంబంధించిన మొదటి అడుగు అమెరికా లో పడింది. అక్కడ మొదలైన ఈ ధోరణి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాలని కోరుకుందాం. ఎందుకంటే ఇది ఏంటో ఉపయోగకరమైనది.

అసలు ఏమిచేస్తారంటే :

ఒక్క అమెరికా లోనే 4.6 మిలియన్ గదులున్నాయి :

ఒక్క అమెరికా లోనే 4.6 మిలియన్ గదులున్నాయి :

ఒక్క అమెరికా లోనే 4.6 మిలియన్ గదులున్నాయి. ఆ గదులకు వచ్చి వెళ్లే వారు ఖచ్చితంగా అక్కడ పెట్టే సబ్బుని పూర్తిగా వాడరు. సబ్బు ఒకటే కాదు షాంపూ, కండీషనర్ ఇలా అన్ని సగం సగం వాడి వెళ్ళిపోతారు.

చొరవ తీసుకొని ఒక ముందడుగు ఎలా ప్రారంభం అయ్యిందంటే :

చొరవ తీసుకొని ఒక ముందడుగు ఎలా ప్రారంభం అయ్యిందంటే :

పరిశ్రుభ్రంగా ఉంచడానికి, ఎంతో శక్తివంతంగా పనిచేసే పైన చెప్పబడిన వస్తువులు చెత్తలోకి వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో " క్లీన్ ది వరల్డ్ " అనే సంస్థ " గ్లోబల్ సోప్ ప్రాజెక్ట్ " అనే సంస్థతో జత కట్టింది. అందులో భాగంగా, ఇలా సగం వాడిన సబ్బులను రీసైక్లింగ్ పద్దతిలో పునర్వినియోగించే విధంగా కొత్త సబ్బులను తయారు చేసి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాడుకోవడానికి వినియోగిస్తున్నారు. అలా అవి నిరుపయోగమైన వ్యర్ధాలుగా మిగిలిపోకుండా అరికడుతున్నారు .

ఎంతో అవసరమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు :

ఎంతో అవసరమైన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు :

ఏ ప్రదేశాలలో అయితే మంచి నీళ్లు, పారిశుధ్యం మరియు పరిశుభ్రత తక్కువగా ఉందో , అలంటి ప్రదేశాలలో శుభ్రతను పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. శుభ్రతలేని ప్రదేశాల్లో నిమోనియా మరియు డయేరియా వంటి వ్యాధులు విపరీతంగా వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో సబ్బులు వంటి శుభ్రత ను పెపొందించే వస్తువుల వాడకం వలన వ్యాధులు గణనీయంగా తగ్గుముఖంపట్టే అవకాశం ఉంది.

చర్మ సౌందర్యానికి రంగు రంగుల సోపుల కంటే సహజమైన శెనగపిండే మేలు...

రీసైక్లింగ్ కి అయ్యే ఖర్చు :

రీసైక్లింగ్ కి అయ్యే ఖర్చు :

సగం వాడిన అలంకరణ ( సబ్బులు, షాంపూలు మొదలైనవి ) వస్తువులను రీసైక్లింగ్ చేయడానికి ప్రతి నెల ఒక్కొక్క రూము కి అయ్యే ఖర్చు కేవలం 75 సెంట్లు మాత్రమే. వదిలి వేసిన సబ్బు, బాడీ వాష్, షాంపూ మరియు కండీషనర్లను శుభ్రం చేసి, క్రిమిరహితంగా మార్చి వాటి యొక్క స్వచ్ఛతను పరీక్షించిన తరువాత మాత్రమే, ఆయా వస్తువులను అవసరమైన ప్రదేశాలకు పంపడం అనేది జరుగుతుంది.

మార్పు మొదలైంది :

మార్పు మొదలైంది :

కొన్ని హోటళ్లు సగం వాడిన అలంకరణ వస్తువులను ఇల్లు లేని స్థానికులకు, స్త్రీల వసతి గృహాలకు మరియు స్వచ్చంద సంస్థలకు దానం చేస్తున్నారు. మరికొన్ని హోటళ్లు, స్థానికంగా రక్షణ కలిగించే సైన్యానికి, స్థానికంగా ఉన్న చిన్న చిన్న ఆసుపత్రులకు మరియు అనాధ శరణాలయాలకు దానం చేస్తున్నారు.

ఇలాంటి హోటళ్లు కూడా ఉన్నాయ్ :

ఇలాంటి హోటళ్లు కూడా ఉన్నాయ్ :

మరికొన్ని హోటళ్లు, ఇలా వృధా అయ్యే సమస్యను మొదలవ్వక ముందే అరికట్టడానికి సరికొత్త పద్దతులను అవలంభిస్తున్నారు. అందులో భాగంగా పెద్ద సీసాల లో షాంపూలను, కండీషనర్లను మరియు బాడీ వాష్ లను గదులలో పెడుతున్నారు. ఇవి అయిపోయిన తరువాత వీటిని మరలా నింపుతున్నారు. ఇలా వృధాను అరికట్టడానికి తమ వంతు కృషి చేస్తున్నారు.

పైన హోటళ్లు వృధాను అరికట్టడానికి పాటిస్తున్న ఆలోచనల పై మీ అభిప్రాయం ఏంటి ? మీ అభిప్రాయాలను క్రింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.

English summary

Ever Wondered What Happens To The Half-used Hotel Soaps?

Ever wondered what happens to those half-used soaps that we leave behind in hotel rooms? Well, read here to know more.