వీళ్లు గడ్డం మీసాలు పెంచినా తీసేసినా.. ఆ లుక్కే వేరబ్బా!

By: Y. Bharath Kumar Reddy
Subscribe to Boldsky

ఇప్పుడు ప్రతి సెలబ్రిటీ గడ్డాలు, మీసాలు పెంచడమో లేదంటే తీయడమో చేస్తుంటారు. అయితే గడ్డం పెంచినా లేదా తీసినా వీరి లుక్ మాత్రం సూపర్బ్ గా ఉంటుంది. క్రికెట్ స్టార్స్ , రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్ దీనికి మినహాయింపు కాదు. అందరూ ఒకసారి గడ్డం, మీసాలు పెంచుతారు. ఒక్కోసారి క్లీన్ షేవ్ తో దర్శనమిస్తుంటారు. సెలబ్రెటీలు గడ్డాల, మీసాలు పెంచుకోవడం, తీసివేయడం ఒక ఫ్యాషన్ గా మారింది. ఇక టాలీవుడ్ గడ్డం అంటే హీరో ప్రభాస్ , రానాలు గుర్తొస్తారు. వీరేకాదండోయ్ చాలామంది ఇలా పెంచినోళ్లున్నారు.

ఒక‌ప్పుడైతే ఏ హీరో అయినా వరసగా కొన్ని సినిమాల వరకూ ఒకే స్టైల్ మెయిన్ టెయిన్ చేసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోలు ఒక్కో మూవీకి ఒక్కో స్టైల్ తో కనబడుతున్నారు. పైగా ఏదైనా సినిమాలో ఒక స్పెషల్ కేరక్టర్ చేసేటప్పుడు ... ఆ పాత్రకోసం గడ్డాలు, మీసాలు పెంచుకోవడం లేదంటే తీసివేయడం చేస్తున్నారు.

ఇక వర్తమానానికి వస్తే మగవాళ్లలో ఆరోగ్య స్పృహ పెంచేందుకు నో షేవ్‌ నవంబరు పేరుతో ఈ నెలంతా గడ్డాలూ మీసాలు పెంచడం అనేది ఆ మధ్య ఆస్ట్రేలియాలో ఓ ఉద్యమంలా మొదలైంది. దాన్ని ప్రస్తుతం ప్రపంచదేశాలన్నీ అనుసరిస్తున్నాయి. అలాగే గడ్డం అనగానే ఎక్కువగా సాధువులూ గురువులూ పెంచుకునే పొడవాటి గుబురుగడ్డాలూ లేదా దేవదాసులూ రోమియోలూ పెంచుకునే ఓ మాదిరి గుబురుగడ్డాలే గుర్తుకొస్తాయి. కానీ గడ్డాన్ని రకరకాలుగా పెంచుతుంటారు సెలబ్రిటీలు.

1. పవన్ లుక్ లోనే కిక్ ఉంటుందబ్బా

1. పవన్ లుక్ లోనే కిక్ ఉంటుందబ్బా

టాలీవుడ్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే తెలుగు ప్రేక్షకులకు ఎనలేని అభిమానం . అప్పట్లో పంజా సినిమాకి గెటప్ మార్చి గడ్డంతో చాలా రఫ్ గా కనిపించారు ఈయన. ఆ తర్వాత గడ్డం లేకుండా కనిపించాడు. తర్వాత నుంచి సినిమాల్లో పవన్ గుబురు గడ్డంతో, కమర్షియల్ మాస్ లుక్ తో కాకుండా క్లీన్ షేవ్ తో లవర్ బాయ్ గా కనిపిస్తున్నారు. అలాగే ఆ మధ్య ఆయన వ్యక్తిగతంగా కూడా గడ్డం పెంచాడు. కానీ అది ఒక దీక్ష కోసమని తెలిసింది. అలాగే జానీ మూవీలో క్లీన్ షేవ్ తో అదరిపోయే లుక్ లో కనపడ్డారు పవన్. గడ్డం, మీసాలున్నా లేకపోయినా పవన్ లుక్ అంటే పడిచచ్చిపోతారు ఫ్యాన్స్.

2. అజిత్ కు గడ్డం అదిరిపోతుంది

2. అజిత్ కు గడ్డం అదిరిపోతుంది

సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో ఎక్కువగా కనిపించే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ అప్పుడప్పుడు గడ్డంతో కూడా దర్శనమిస్తుంటాడు. కొన్ని సినిమాల్లో తెల్లజుట్టు, తెల్లగడ్డంతో నేచరల్ స్టైల్ లో అదరగొట్టాడు అజిత్. తన ఏజ్ కి తగ్గ కేరక్టర్స్ మాత్రమే చేసే ఈ హీరో తన స్టైల్ కూడా ఎప్పటికప్పడు మార్చేస్తూ ఉంటాడు. గతంలో నటించిన పలు సినిమాల్లో అజిత్ గడ్డంతో మాస్ గా కనిపించేవాడు. అయితే గడ్డం మీసాలున్నా లేకున్నా ఈ హీరో లుక్ మాత్రం ఎప్పుడూ అదుర్సే.

3. అక్షయ్ కుమార్

3. అక్షయ్ కుమార్

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఎప్పటికప్పుడు సరికొత్త లుక్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాడు. చాలా వరకు క్లీన్ షేవ్ తో కనిపించే ఈ హీరో కొన్ని మూవీల్లో గడ్డం మీసాలతో కూడా కనిపిస్తుంటారు.

4. ధనుష్

4. ధనుష్

ధనుష్ చాలామూవీల్లో గడ్డంతోనే నటించారు. అలాగే కొన్ని మూవీల్లో క్లీన్ షేవ్ తో కనిపించారు. గతంలో వచ్చిన ధర్మయోగి మూవీలో ధనుష్ గుబురు గడ్డంతో ధనుష్ చాలా మాస్ గా కనిపించాడు. ఇక ఒకే మూవీలో ఒకసారి గడ్డం, మీసాలతో మరోసారి గడ్డంతో రఫ్ లుక్ ల్లోనూ కనిపించాడు ధనుష్.

5. కమల్‌హాసన్

5. కమల్‌హాసన్

కమల్‌హాసన్ చాలా వరకు గడ్డం, మీసాలు లేకుండానే ఉంటారు. అయితే అప్పడప్పుడు మాత్రం బాగా గడ్డం పెంచి మీసాలు కూడా పెంచుతారు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఆయన ఎలా నటించడానికి సిద్ధంగా ఉంటారు.

6. నరేంద్ర మోదీ

6. నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్రమోదీ అంటే మనకు ముందు గుర్తుకొచ్చేది ఆయన తెల్లని గడ్డం. ఇప్పుడు ఇలాంటి లుక్ లో దర్శనమిస్తున్న మోదీ తన యంగ్ ఏజ్ లో మాత్రం క్లీన్ షేవ్ తో ఉండేవారు. మరి అప్పటికి ఇప్పటికీ ఆయన లుక్ ఎలా ఉందో ఒకసారి చూడండి.

7. రజనీకాంత్

7. రజనీకాంత్

సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక్కోసారి ఒక్కో స్టైల్ లో కనిపిస్తారు. గతంలో ఒకసారి పూర్తిగా తెల్ల గడ్డంతో కనిపించారు. అలాగే పాత సినిమాల్లో క్లీన్ షేవ్ తో కనిపిస్తారు. మొత్తానికి ఆయన ఎలా కనిపించినా ఆ లుక్ మాత్రం అదుర్స్.

8. సల్మాన్ ఖాన్

8. సల్మాన్ ఖాన్

సల్మాన్‌ ఖాన్‌ ఆ మధ్య సుల్తాన్‌ మూవీ కోసం మాసిన గడ్డం, కోరమీసం, ఫుల్‌సీరియస్‌ లుక్‌లో కనిపించాడు. అలాగే కొన్ని సినిమాల్లో గడ్డం లుక్ తో అదరగొట్టాడు. అదేవిధంగా సల్మాన్ అప్పట్లో క్లీన్ షేవ్ తో చాలా సినిమాల్లో కనిపించాడు. గడ్డం మీసాలు ఉన్నా లేకున్నా ఈ హీరో లుక్ మాత్రం సూపర్ గా ఉంటుంది.

9. అమీర్ ఖాన్ గడ్డం స్టైల్

9. అమీర్ ఖాన్ గడ్డం స్టైల్

పొడవైన మీసకట్టు కాస్త గడ్డంతో ఈ మధ్య కనువిందు చేశాడు బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్. ఇంతకు ముందు పీకే మూవీతో పాటు చాలా సినిమాల్లో క్లీన్ షేవ్ తో కనిపించిన ఈ హీరో ఇలా ఒక్కసారిగా లుక్ ఇవ్వడంతో అందరూ కాస్త అవాక్కయ్యారు. గడ్డంతో ఉన్న అమీర్ ఖాన్ లుక్ అదిరిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ మూవీలో నటించునున్న ఈ హీరో ఒక మూవీలో అతిథి పాత్ర కోసం ఇలాంటి లుక్ లోకి మారిపోయాడు.

10. రాంచరణ్ తేజ్

10. రాంచరణ్ తేజ్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ ప్రస్తుతం సుకుమార్ తో చేస్తున్న మూవీలో గడ్డంతో అదిరిపోయే లుక్ లో ఉన్నాడు. ఫస్ట్ లుక్ లో కావడి కుండలు పట్టుకున్న గెటప్ లోనూ చెర్రీ గడ్డంతోనే కనిపించాడు. ఇక గత సినిమాల్లో రాంచరణ్ క్లీన్ షేవ్ తో కనిపించారు. ఎప్పటికప్పుడు లుక్ మార్చడంలో రాంచరణ్ ముందుంటారు. ఆ ట్రెండ్ నే యూత్ ఫాలో అవుతుంటారు.

11. రామ్ కూడా గడ్డంతోనే

11. రామ్ కూడా గడ్డంతోనే

టాలీవుడ్ హీరో రామ్ తాజాగా నటించిన ఉన్నది ఒకటే జిందగీ మూవీలో జుట్టు, గడ్డం బాగా పెంచి కనపడ్డాడు. ఈ చిత్రంలో కాలేజ్‌లో రాక్ బ్యాండ్ నడుపుతుంటాడు. అందుకే ఈ లుక్ లో కనిపించారు రామ్. ఇప్పటివరకు వచ్చిన సినిమాలకు కాస్త డిఫరెంట్ గా పిచ్చ రఫ్ లుక్ లో కనిపించాడు రామ్. స్టైలిష్ గడ్డం సైడ్ కట్ ఈ మూవీలో కనిపించాడు. అలాగే గతంలో క్లీన్ షేవ్ తో కూడా రామ్ కనిపించాడు. నేను శైలజ మూవీలో ఒకపాటలో గడ్డం లుక్ లో దర్శనమిచ్చాడు రామ్.

12. నితిన్ స్టైల్ మార్చాడు

12. నితిన్ స్టైల్ మార్చాడు

లై మూవీలో గడ్డంతో అదరగొట్టాడు నితిన్. గతంలో అసలు గడ్డం లేకుండా నటించాడు ఈ హీరో. అయితే గడ్డం, మీసాలతో కూడా అదిరిపోయే లుక్ తో ఉంటాడు నితిన్.

13. జూనియర్ ఎన్టీఆర్

13. జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ ఆ మధ్య నాన్నకు ప్రేమతో మూవీలో సరికొత్త గడ్డంతో కనిపించాడు. ఈ ట్రెండ్ కొత్త పుంతలు తొక్కింది. అప్పుడిది ఫ్యాషన్ గా మారిపోయింది. తర్వాత జనతాగ్యారేజ్ లోనూ కాస్త గడ్డంతో కనిపించాడు ఈ హీరో. ఇక జై లవకుశలో జై పాత్ర కోసం మీసాలు, గడ్డంతో కనిపించాడు. ఇక అంతకు ముందు కొన్ని సినిమాల్లో క్లీన్ షేవ్ తో దర్శనమిచ్చాడు. ఈయన ఎలాంటి లుక్ లో కనిపించినా అదుర్స్.

Read more about: men, india, pulse, గడ్డం
English summary

indian celebrities with without mustache and beard

No Shave November Special: Indian Celebrities With And Without Mustache, Beard!
Subscribe Newsletter