ఇండియాలో పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు!

Posted By:
Subscribe to Boldsky

చాలా మందికి తెలియని విషయం మగవాళ్లని అనుమతించని ఆలయాలు కూడా మన దేశంలో ఉన్నాయని.. అక్కడ కేవలం ఆడవాళ్ళకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది.

అదేంటి... ఉంటేగింటే ఆడవారికి అనుమతి లేని దేవాలయాలు ఉన్నాయి కదా.. మగవారిని కూడా అనుమతించని ఆలయాలు ఉన్నాయా అని ఆశ్చర్య పోతున్నారా.. మీరు విన్నది నిజమే.. అది మన భారతదేశంలోనే ఉన్నాయని మీకు తెలుసా ?

అక్కడ కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. పురుషులకు ప్రవేశం నిషేదం.. ఎవరైనా వద్దామని అనుకున్నా అక్కడి గుడి వద్ద మగవాళ్ళు రాకుండా ఉండేదుకై అక్కడ సెక్యురీ గార్డ్స్ చాలా స్ట్రిట్ గా కాపలా కాస్తుంటారు. ఇంతకీ ఏమిటి ఆ ఆలయాలు విశేషాలు అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం!

హిందూ ఆలయాల వెనకున్న అద్భుతమైన శాస్త్రీయ రహస్యం

1. అట్టుకల్‌ దేవాలయం

1. అట్టుకల్‌ దేవాలయం

కేరళ రాష్ట్రంలోనే తిరువనంతపురం సమీపంలోనిమరో దేవాలయం అట్టుకల్‌ దేవాలయం ఈ గుడిలో పార్వతి దేవి కొలువై ఉంటుంది. ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవాలకు, ఊరేగింపులు కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు. ఇక్కడ ఏటా వారం రోజుల పాటు నారీ పూజ చేస్తారు. మహిళలు వారం రోజుల పాటు నిష్టతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు. ఆ సమయంలో కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి. మగవాళ్లు ఉండరాదు. ఇక్కడ ప్రధానంగా జరిగే ఉత్సవం పేరు పొంగా ఉత్సవం.మగవారు ఇటువైపు వస్తే పాపాలు తగులుతాయని వారి భావన.

2. చక్కులాతుకవు దేవాలయం

2. చక్కులాతుకవు దేవాలయం

కేరళ రాష్ట్రంలో చక్కులాతుకవు దేవాలయం కలదు. ఇందులో దుర్గా దేవి కొలువై ఉంటుంది. ఏటా వారం రోజులపాటు అమ్మవారికి నారీ పూజ చేస్తారు. అప్పుడు కేవలం మహిళలు మాత్రమే ఆలయం ఉండాలి. మగవాళ్ళు ఉండరాదు. మహిళలు వారం రోజులపాటు నిష్ఠతో ఉపవాసం ఉండి అమ్మవారిని పూజిస్తారు.

అఘోరాలు పూజలు, తంత్రాలు చేసే.. సీక్రెట్ టెంపుల్స్..!!

3. సంతోషి మాత ఆలయం:

3. సంతోషి మాత ఆలయం:

సంతోషి మాత ఆలయం మహిళలకు లేదా పెళ్లికాని అమ్మాయిలకు ప్రసిద్ద ఆలయం, సంతోషి మాత వ్రతం ఆచరించే వరు పుల్లని పండ్లు లేదా ఊరగాయాలు తినడకూడదు. సంతోషి మాత ఆలయంలోనికి పురుషులకు అనుమతి ఉన్నా, వారు చాలా నియమనిష్టలతో నియమాలను ఆచరించాల్సి ఉంటుంది.

4. బ్రహ్మ దేవుని ఆలయం :

4. బ్రహ్మ దేవుని ఆలయం :

బ్రహ్మ పురుషుడే కదా మరి పురుషులకు ప్రవేశం లేదనుకుంటున్నారా? దీనికి కూడా కారణం ఉంది.బ్రహ్మ దేవునికి ఆలయాలు చాలా అరుదు. అలాంటి ఆలయాలలో ఒకటి రాజస్థాన్ లోని పుష్కర్ లో ఉంది. ఈ ఆలయంలో మగవాళ్లకు ప్రవేశం లేదు. కారణం, బ్రహ్మ యజ్ఞం చేయాలనుకుని బ్రహ్మ దేవుడు నిశ్చయించుకున్నప్పుడు సరస్వతి దేవి అతని పక్క ఉండదు. బ్రహ్మ, గాయత్రి అనే మహిళను పెళ్లి చేసుకొని యజ్ఞాన్ని పూర్తిచేస్తాడు. తీరా తిరిగొచ్చాక సరస్వతి విషయం తెలుసుకొని శపిస్తుంది. ఈ ఆలయంలోకి పురుషులు ప్రవేశించకూడదని, ఒకవేళ వస్తే వారికి దాంపత్య సమస్యలు వస్తాయని చెబుతుంది. అందుకే మగవాళ్ళు అటు వెళ్ళడానికి సాహసించరు..

5. భాగతీ మాత ఆలయం :

5. భాగతీ మాత ఆలయం :

దేశంలోని 51 శక్తీ పీఠాలలో ఇది ఒకటి.. దేవీ ఆలయం కన్యాకుమారిలో కలదు. ఇందులో ప్రధాన దేవత దుర్గా మాత. అమ్మవారిని భాగతీ మాత గా పిలుస్తారు. ఈ ఆలయంలో కూడా పురుషులు వెళ్లరు. గుడి చుట్టూ మూడు సముద్రాలు (బంగాళాఖాతం, అరేబియా, హిందూ) ఉన్నాయి.

గుడికి వెళుతున్నారా...? అయితే ఈ రూల్స్ తప్పక పాంటించండి..

6. మాతా ఆలయం :

6. మాతా ఆలయం :

మాతా ఆలయం బీహార్‌ రాష్ట్రంలోని ముజఫర్‌ పూర్‌ పట్టణంలో ఉంది. అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో కేవలం ఆడవారిని మాత్రమే గుడి లోనికి అనుమతిస్తారు. మగవారికి ప్రవేశం లేదు..

All Images Source

English summary

Indian Temples Where Men Are NOT Allowed

Indian Temples Where Men Are NOT Allowed, These are the Indian temples where men are not allowed. Check out the list, as you would be shocked.
Subscribe Newsletter