వైట్ హౌస్ గురించి కొన్ని విశేషాలు

Written By: Bharath
Subscribe to Boldsky

ధవళకాంతులతో మెరిసిపోయే వైట్ హౌస్ అమెరికా అధ్యక్షుడు నివసించడానికని నిర్మించారు. అధ్యక్షుడి హోదాలో ఇక్కడ యేళ్ల పాటు నివసించారు ఎంతో మంది ప్రముఖులు. ఇది వాషింగ్టన్ డీసీలో ఉంది. ఇది ఒక శత్రు సైనికుల దాడికి ధ్వంసమైంది. అగ్నిప్రమాదం, వరదలు ఎదుర్కొంది. అమెరికా అధ్యక్షుడు ఉండే ఈ శ్వేత సౌధం పూర్వాపరాలు నిర్మాణ చరిత్ర మొదలైన విషయాలు తెలుసుకుందాం.

1600 పెన్సిల్వేనియా ఎవెన్యూ నార్త్ వెస్ట్ వాషింగ్టన్ డీసీలో 18 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో వైట్ హౌస్ ఉంది. ప్రస్తుతం దీన్ని వైట్‌హౌస్‌ అంటున్నా దాన్ని కట్టాక వందేళ్లకి కానీ ఆ పేరు ఏర్పడలేదు. అంతకు ముందు ప్రెసిడెంట్స్‌ ప్యాలస్‌ అని, ఎగ్జిక్యూటివ్‌ మాన్షన్‌ అనిరకరకాలుగా వ్యవహరించేవారు. ఓసారి ఇది కాలిపోయినప్పుడు మరమ్మతుల కోసం తెల్లరంగు వేశారు. అప్పట్నుంచి వైట్‌హౌస్‌ అనేవారు. అధికారికంగా మాత్రం 1901లో అప్పటి అధ్యక్షుడు థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ ఆ పేరును వాడడం మొదలుపెట్టారు.

అధ్యక్షులంతా ఈ భవనంలోనే

అధ్యక్షులంతా ఈ భవనంలోనే

దీన్ని 1800 సంవత్సరంలో అప్పటి అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ నుంచి ఆ తర్వాతి కాలంలో ఎన్నికైన అగ్రరాజ్య అధ్యక్షులంతా ఈ భవనంలో ఉంటూ వచ్చారు. కాగా 1792 నుంచి ఈ భవన నిర్మాణం ప్రారంభమైంది. అయితే నిర్మాణ అనంతరం 1800 సంవత్సరం నుంచి ఈ వైట్ హౌస్ లో ఎన్నో మార్పులు చేశారు.

1812 సమయంలో జరిగిన యుద్ధంలో బ్రిటిష్ ఆర్మీ ఈ భవనాన్ని తగులబెట్టింది. దీంతో ఈ భవనం దాదాపు నాశనమైపోయింది. అప్పట్లో ఆ ఘటనను "బర్నింగ్ ఆఫ్ వాషింగ్టన్" గా అభివర్ణించారు. అయితే 1812 అనంతరం అధ్యక్షుడిగా వచ్చిన జెమ్స్ మన్రో ఈ భవనానికి పాక్షిక పునర్నిర్మాణం చేసి ప్రవేశించాడు.

వైట్ పెయింట్

వైట్ పెయింట్

1948లో హేరీ ఎస్.ట్రూమన్ దీని ఇంటీరియర్ గదులను పూర్తిగా కూలగొట్టించి వైట్ పెయింట్ వేయించాడు. ఇదే క్రమంలో ఇక మోడరన్ హౌస్ కాంప్లెక్స్లో ఎగ్జిక్యూటివ్ రెసిడెన్స్ - ఈస్ట్ వింగ్ - వెస్ట్ వింగ్ - ఐసెన్ హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్ వంటివి ఉన్నాయి. అధ్యక్ష - ఉపాధ్యక్ష కార్యాలయ సిబ్బంది - విదేశాంగ శాఖ అధికారులు వీటిలో ఉంటారు.

ఎన్నో సౌకర్యాలు

ఎన్నో సౌకర్యాలు

ఈ భారీ నిర్మాణంలో 412 తలుపులు - 147 కిటికీలు - 8 స్టైర్ కేస్ లు - 132 గదులు - 35 బాత్ రూం లు ఉన్నాయి. ఈ సౌధానికి బయటవైపు రంగు వేయాలంటే 570 గెలాన్స్ (సుమారు 2157 లీటర్ల) పెయింట్ అవసరమవుతుంది. ఒకేసారి140 మంది కూర్చుని తినగలిగే డైనింగ్‌ టేబుల్‌, 13,000 చాకులు, చెంచాలు ఉన్నాయి. దీని నిర్వహణకు 5,700 మంది ఉద్యోగులున్నారు.

ఉచితం ఏమి ఉండదు

ఉచితం ఏమి ఉండదు

అమెరికా అధ్యక్షుడు అతని కుటుంబ సభ్యులు ఇక్కడి వెచ్చించిన వాటికి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వారి తినడానికి అయ్యే ఖర్చు, డ్రై క్లీనింగ్, టూత్ పేస్ట్, ఇలా ప్రతి దానికి సంబంధించిన ప్రతి నెల చివరలో బిల్లు వస్తుంది. అది తన వార్షిక జీతం $ 400,000 నుంచి మైనస్ చేస్తారు.

భారీగా సందర్శన

భారీగా సందర్శన

ప్రతి వారం వైట్ హౌస్ ను 30,000 మంది సందర్శకులను సందర్శిస్తుంటారు. 65,000 పైగా ఉత్తరాలు వస్తుంటాయి. దాదాపు 3,500 ఫోన్ కాల్స్ వస్తాయి. 100,000 ఈ మెయిల్స్ వస్తాయి. 1,000 ఫ్యాక్స్ వస్తాయి.

ఐరోపా కళాకారులు నిర్మించారు

ఐరోపా కళాకారులు నిర్మించారు

వైట్ హౌస్ ను అనేకమంది ఐరోపా కళాకారులు నిర్మించారు. అలాగే పలువురు వలస కార్మికులైన స్కాటిష్ కార్మికులు, ఐరిష్, ఇటాలియన్ ఇటుక, ప్లాస్టర్ కార్మికుల సహాయంతో వైట్ హౌస్ ను నిర్మించారు. జేమ్స్ హోబాన్ ఈ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాడు.

దెయ్యాలున్నాయంట

దెయ్యాలున్నాయంట

వైట్ హౌస్ లో దెయ్యాలున్నాయని అంటుంటారు. ఇక అబ్రహాం లింకన్‌ ఆత్మ ఇప్పటికీ సంచరిస్తున్నట్లు కొందరు చెబుతుంటారు. వైట్ హౌస్ కు గెస్ట్ గా వచ్చిన బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ అబ్రహాం లింకన్‌ ఆత్మ కనపడిందంటారు. దాంతో ఆయన హడలెత్తిపోయాడు.

టైఫాయిడ్‌తో చనిపోయిన లింకన్ కొడుకు విల్లీ, అమెరికా రెండో అధ్యక్షుడైన జాన్ ఆడమ్స్ భార్య అబిగలీ, అమెరికాను పాలించిన జేమ్స్ మ్యాడిసన్ భార్య డాలీ అలాగే అమెరికా మాజీ అధ్యక్షుడు ఆండ్రూ జాక్సన్, లింకన్ భార్య మేరీ టాడ్, మరో అధ్యక్షుడికి అత్తగారైన మేరీ తదితరుల ఆత్మలు ఇక్కడ కనిపిస్తాయని వినికిడి.

తగులబెట్టారు

తగులబెట్టారు

యుద్ధ సమయంలో 1814లో బ్రిటిష్‌ సైనికులు దీన్ని తగుల బెట్టారు. వైట్‌హౌస్‌లో కూడా ఎలుకల బెడద కూడా ఉండేది. జంతు ప్రేమికుడైన అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్‌ వాటిని పెంచేవాడు. వాటి సంఖ్య పెరిగిపోవడంతోఫెర్రెట్స్‌ అనే ముంగిసలాంటి జంతువుల్ని పెంచి అరికట్టాల్సి వచ్చింది.

బంకర్

బంకర్

వైట్‌హౌస్‌ భూగర్భంలో ఓ బంకర్‌ ఉంది. అత్యవరసర పరిస్థితుల్లోఅధ్యక్షుడు ఇక్కడి నుంచే విధులు నిర్వర్తించడానికి అత్యాధునిక సౌకర్యాలుఉన్నాయి. కొన్ని సొరంగమార్గాలు కూడా ఉన్నాయి.

English summary

interesting facts know about white house

Interesting Facts To Know About White House!
Subscribe Newsletter