ప్రపంచంలోని వింతలు కాదు..శరీరంలోని ఈ వింతలు గురించి తెలుసుకోండి!

Posted By:
Subscribe to Boldsky

వింతలు అనగానే ప్రపంచంలో ఉన్న ఏడు వింతలు గుర్తొస్తాయి. ప్రపంచ వింతలన్నీ ఏదో ఒక గొప్ప చరిత్ర గురించి తెలియజేస్తాయి. ప్రపంచ ఏడు వింతలు కూడా నిర్జీవాలే కాకుండా అన్నీ మానవ నిర్మితాలు. కాని మానవులే తమకున్న సహజత్వానికి తోడుగా ప్రత్యేకంగా అద్భుతాలను సృష్టిస్తే మనం వారిని వింతగా చూస్తుంటాం. అయితే అంతకంటే విడ్డూరమైన, విచిత్రమైన నిర్మాణాలు మన ఒంట్లోనే ఉన్నాయని మీకు తెలుసా?

ఒక్క మనిషిలో ఇన్ని వింతలా?

మానవ శరీరం దైవస్రుష్టి..అది ఎవరికీ అర్థం కాదు..అని కొందరు. కాదు అది సైన్స్..కొన్ని పరమాణువుల కలయిక వల్ల ఉద్భవించిన అరుదైన జీవి అని మరికొందరు. ఎంతగా చర్చించుకున్నా ఎడతెగని అద్భుతాలు ఎన్నో కనిపిస్తాయి మానవ శరీంలో. అవి కొన్ని సార్లు ఎలా ఉంటాయంటే అద్భుతాల నిలయమైన వ్యక్తికి కూడా తెలియనంతగా. మరి అలాంటి అద్భుతాలేంటో ఒకసారి తెలుసుకుందాం...

ఆశ్చర్యం కలిగించే పనితీరు గుండెది

ఆశ్చర్యం కలిగించే పనితీరు గుండెది

దేహం మొత్తం మీద కష్టపడి పనిచేసే కార్మికురాలు గుండె ఒక్కటే. ప్రతిరోజూ ఈ కండరం... ఒక చిన్నపాటి ట్రక్కును 18 మైళ్లు నడపగలిగేంత శక్తిని (ఎనర్జీని) ఉత్పత్తి చేస్తుంది. ఒక జీవితకాలంలో మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో చంద్రుడి పైకి వెళ్లి రావచ్చు! గుండెను దేహం నుండి వేరు చేసిన తర్వాత కూడా అందులో ఉండే స్వయంచోదక విద్యుత్‌ శక్తి కారణంగా గుండె ఇంకా కొంతసేపు కొట్టుకుంటూనే ఉంటుంది.

మెదడు!

మెదడు!

అది మీరీ వండర్‌. మెదడులో 60 శాతం కొవ్వే ఉంటుంది. ఏ సమయంలోనైనా మన మెదడు 25 వాట్‌ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలుగుతుంది. ఒక బల్బు వెలగడానికి ఇది చాలు. అంతేకాదు, 50 వేల రకాల వాసనలను మెదడు పసికట్టగలదు. ఏ వయసులోనూ ఉండనన్ని మెదడు కణాలు అత్యధికంగా రెండేళ్ల వయసులో ఉంటాయి. అయినా సరే మెదడు పూర్తిగా పరిణతి చెందడానికి 20 ఏళ్ల సమయం పడుతుంది. ఇవి కాక… మన బాడీలో ఇంకా ఏయే వండర్స్‌ ఉన్నాయో చూడండి.

కాలేయం:

కాలేయం:

అనారోగ్య కారణాల వల్ల కాలేయాన్ని కొంత తొలగించాల్సిన వచ్చిన ఏ బాధ లేదు. ఎందుకంటే అది మళ్లీ పెరుగుతుంది. ఎంతగా అంటే మనిషి శరీరానికి అవసరమయినంతమేరకు దానికదే పెరిగి ఆగిపోతుంది. ఇలా ఎన్ని సార్లు తొలగించినా పెరుగుతూనే ఉండటం వింతే కదా మరి.

కిడ్నీలు :

కిడ్నీలు :

మానవుని మూత్రపిండాలు నిముషానికి 1.3 లీటర్ల రక్తంను శుద్ది చేయును. రోజుకు 1.4 లీటర్ల మూత్రంను విసర్జించును

చర్మం:

చర్మం:

మానవ దేహంలోని అతి విస్తారమైన భాగం ఇది. నిరంతరం తనని తను పునర్నవీకరించుకుంటూనే ఉంటుంది! ప్రతి నిముషం 50 వేల చర్మకణాలు రాలిపోతుంటాయి. ఇలా జీవితకాలం మొత్తం రాలిన కణాల బరువు 18 కిలోలు ఉంటుంది.

మెదడు:

మెదడు:

మనం మేల్కొని ఉన్నప్పటి కంటే, నిద్ర పోతున్నప్పుడే మెదడు చురుగ్గా పనిచేస్తుంటుంది. మన బ్రెయిన్‌ ఎంత గొప్పదంటే… అసలు ఏమీ ఆలోచించని మనిషి చేత కూడా రోజుకు 70 వేల ఆలోచనలు చేయిస్తుంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే… బ్రెయిన్‌ వల్ల మనం నొప్పిని గుర్తించగలం కానీ, బ్రెయిన్‌కి వచ్చే నొప్పిని గ్రహించలేం!

ఎముకలు:

ఎముకలు:

మనం 300 కు పైగా ఎముకలతో పుడతాం. పెద్దవాళ్లం అయ్యేనాటికి వాటి సంఖ్య తగ్గి, 206కి చేరుకుంటాయి! కారణం కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోవడమే.

వెంట్రుకలు:

వెంట్రుకలు:

ప్రతి నాలుగు వారాలకు అంగుళంలో నాలుగో వంతు పెరుగుతాయి. అంటే 6 మిల్లీమీటర్లు. అలా ఒక్కో వెంట్రుకా ఆరేళ్ల వరకు పెరుగుతుంది. తర్వాత రాలిపోతుంది. అదేచోట కొత్త వెంట్రుక మొలుస్తుంది.

జ్ఞాపకశక్తి:

జ్ఞాపకశక్తి:

గర్భంలో ఉన్నప్పుడు శిశువు మెదడు ప్రతి సెకనుకు 8 వేల కొత్త కణాలతో వృద్ధి చెందుతుంటుంది. శిశువు పుట్టిన కొన్ని గంటలకే తల్లిని గుర్తుపడుతుంది.

ఇనుము:

ఇనుము:

మన దేహంలో ఉండే ఇనుము మొత్తంతో మూడంగుళాల పొడవైన మేకును తయారుచెయ్యొచ్చు.

 కన్ను:

కన్ను:

మానవ నేత్రం 576 మెగాపిక్సెల్‌ సామర్థ్యం గల డిజిటల్‌ కెమెరా వంటిది! అది కోటి రకాల వేర్వేరు రంగుల ఛాయల్ని గుర్తించగలదు.

నీరు:

నీరు:

మనిషి తన జీవితకాలంలో 75 వేల లీటర్ల నీరు తాగుతాడు. దేహం అంత నీటిని పీల్చేస్తుందన్నమాట.

ముక్కు, చెవులు:

ముక్కు, చెవులు:

మనిషి ముక్కు, చెవులు జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. ఆ పెరుగుదల ఒక్కొక్కరిలో స్పష్టంగా కనిపిస్తుంది. కొందరిలో కనిపించదు.

తుమ్ము:

తుమ్ము:

ఒక బలమైన తుమ్ము మన ముక్కులోంచి, నోట్లోంచి గంటకు 64 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.

గోళ్ళు, వెంట్రుకలను

గోళ్ళు, వెంట్రుకలను

గోళ్ళు, వెంట్రుకలను కత్తిరించినా నొప్పి పుట్టదు. కారణం ఆ రెండింటిలోనూ కెరోటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. మానవుని జుట్టు మరియు గోళ్ళు మనిషి చనిపోయాక కూడా పెరుగుతాయి.

మనిషి నవ్వటానికి

మనిషి నవ్వటానికి

మనిషి నవ్వటానికి శరీరంలో 17 కండరాలు, కోపపడానికి 43 కండరములు పనిచేస్తాయి.

మనిషి నాలుకపైన

మనిషి నాలుకపైన

మనిషి నాలుకపైన రుచిని తెలపటానికి 3000 రకాల బుడిపెలు ఉంటాయి.

English summary

Intresting Facts About The Human Body, ఒక్క మనిషిలో ఇన్ని వింతలా?

Intresting Facts About The Human Body
Story first published: Friday, June 2, 2017, 20:00 [IST]
Subscribe Newsletter