Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పది నెలల బాలుడు.. తొమిదేళ్ల బరువు
ఈ పిల్లాడి వయస్సు కేవలం పది నెలలు. కానీ బరువులో మాత్రం 9 ఏళ్ల వయసున్న వారుండాల్సిన వెయిట్ ఉన్నాడు. ఈ బాలుడు తన బరువుతో అందరినీ షాక్ చేస్తున్నాడు. ఈ బాలుడి పేరు లూయిస్ మాన్యుఎల్. ఇతనిది పశ్చిమ మెక్స
ఈ పిల్లాడి వయస్సు కేవలం పది నెలలు. కానీ బరువులో మాత్రం 9 ఏళ్ల వయసున్న వారుండాల్సిన వెయిట్ ఉన్నాడు. ఈ బాలుడు తన బరువుతో అందరినీ షాక్ చేస్తున్నాడు.
ఈ బాలుడి పేరు లూయిస్ మాన్యుఎల్. ఇతనిది పశ్చిమ మెక్సికన్ రాష్ట్రం. అక్కడ కొలమిమాలోనికి చెందిన కుటుంబానికి చెందినవాడు. ప్రస్తుతం ఈ బాలుడి బరువు ముప్పై కిలోల దాకా ఉంది. దీంతో ఇతను ప్రపంచంలోనే అత్యంత బరువున్న కిడ్ గా రికార్డుకెక్కాడు.

పుట్టినప్పుడు మామూలుగానే ఉన్న ఈ బాబు.. వారానికో తీరుగా బరువు పెరిగిపోతున్నాడు. ఈ బరువును తక్షణం అదుపుచేయకపోతే బాలుడికి గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు.

1. ఆరోగ్యంగానే జన్మించాడు
లూయిస్ మాన్యుల్ జన్మించినప్పుడు 3.5 కిలోలు. అంటే 7 పౌండ్లు 11 ఓజెడ్ అన్నమాట. పుట్టినప్పుడు ఇలా ఆరోగ్యంగానే జన్మించాడు. అయితే ఒక నెల తర్వాత నుంచి ఒక్కసారిగా బరువు పెరిగాడు.

2. ఆందోళన చెందుతున్న తల్లి
లూయిస్ తల్లి పేరు ఇసాబెల్ పాన్టోజా. ఈమెకు 24 సంవత్సరాలు. అయితే తన బిడ్డ లావు అవడం చూసి మొదట ఆమె తాను పుష్టికరమైన పాలు ఇవ్వడం వల్లే ఇలా తయారవుతున్నాడనుకుంది. తర్వాత ఆమె కూడా ఆశ్యర్యానికి లోనుకావాల్సి వచ్చింది. తన కుమారుడు ఇలా భారీగా బరువు పెరగడంపై ఆమె చాలా ఆందోళన చెందుతున్నారు.

3. ఒక రేంజ్ లో బరువు పెరిగిపోతున్నాడు
లూయిస్ రోజుకురోజుకు ఒక రేంజ్ లో బరువు పెరిగిపోతున్నాడు.
అధిక బరువు వల్ల కొన్ని సందర్భాల్లో లూయిస్ ఊపిరి అందేది కాదని, సరిగా నిద్రపోవడం లేదని అతని తల్లి చెప్పారు. నెల వయసు ఉన్నపుడే అతనికి రెండెళ్ల పిల్లాడికి సరిపోయే దుస్తులు కొనాల్సి వచ్చిందని చెప్పారు.

4. ప్రిడర్ విల్లీ సిండ్రోమ్
లూయిస్ మాన్యుఎల్ పిల్లలకు అరుదుగా వచ్చే ప్రిడర్ విల్లీ సిండ్రోమ్ అనే డిసీజ్ తో బాధపడుతున్నాడని డాక్టర్లు తెలిపారు. ఇది చిన్న పిల్లల్లో గుండెకు సంబంధించిన వ్యాధులకు కారణం అవుతూ ఉంటుంది. అయితే జన్యులోపంల వల్ల కూడా ఇలాంటి సమస్య తలెత్తుతుంటుంది.

5. చికిత్సకు సరిపడా డబ్బులేదు
లూయిస్ కు చికిత్స చేయించలేని స్థితిలో అనతని కుటుంబం ఉంది. ఎవరైనా దాతలు స్పందించి తమ కుమారుడి శస్త్ర చికిత్సలకు విరాళాలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. లూయిస్ మాన్యుఎల్ వెంటనే కోలుకుని ఆరోగ్యంగా ఉండాలని మనం కూడా ఆశిద్దాం.



Click it and Unblock the Notifications