నవరాత్రుల స్పెషల్ : కుమార్తులి - కలకత్తాలో దుర్గా విగ్రహాల తయారీ

By: Lakshmi Perumalla
Subscribe to Boldsky

కలకత్తాలో దుర్గా పూజ సమయంలో పూజ పాండాలు మరియు దుర్గా విగ్రహాల విస్తృతమైన ప్రదర్శన ఉంటుంది. కళాకారుల అద్భుతమైన క్రియేషన్స్ ఈ 5 రోజుల పండుగలో ప్రజలను మంత్ర ముగ్ధులను చేస్తుంది. మీరు సృజనాత్మకతకు ఆరాధకుడిగా మరియు ఒక సౌందర్య భావనను కలిగి ఉంటే, ఈ అద్భుత క్రియేషన్స్ వెనుక ఉన్న మేకర్స్ ని చూడడానికి మీకు చాలా ఉత్సాహం ఉంటుంది. మీ ఉత్సుకతను సంతృప్తిపరచడానికి మరియు దేవుని విగ్రహాల తయారీకి స్వర్గ ధామంగా ఉన్న కుమార్తులిని తప్పనిసరిగా సందర్శించాలి.

నవరాత్రుల స్పెషల్ : ఎలాంటి నియమాలు పాటించాలి ?

మీరు కలకత్తాలో నివాసం ఉంటున్నారా లేదా బయట నగరంలో ఉంటున్నారా? మీరు దుర్గా పూజ సమయంలో జాయ్ నగరంలో ఉంటే కనుక కుమార్తులి సందర్శన తప్పనిసరి. ఈ ప్రదేశానికి వెళ్లాలంటే పండుగకు కొన్ని వారాల ముందు నగరంలో ఉండాలి. దీని గురించి మరింత సమాచారం కోసం ఈ వ్యాసాన్ని చదవండి.

పేరు

పేరు

కుమార్తులి "కుమార్" మరియు "తులి" అనే రెండు పదాలను కలిగి ఉంది. కుమార్ అంటే "కుమ్మరులు " మరియు తులి అంటే "కుమ్మరులు నివసించే చిన్న ప్రదేశం" అని అర్ధం. అందుకే కుమార్తులిని కుమ్మరులు నివసించే చిన్న ప్రదేశం అని అంటారు. వీరిని ఐడల్ మేకర్స్ లేదా చేతివృత్తులు - కుమ్మరులు అని పిలుస్తారు. ఒక కుటుంబంలోని వారు తరతరాలుగా ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉన్నారు.

ఎక్కడ ఉంది

ఎక్కడ ఉంది

ఉత్తర కలకత్తాలోని బనామాళి సర్కార్ స్ట్రీట్ లో కుమార్తులి ఉంది. ఇది హుగ్లీ నది మరియు రబీంద్ర షరాని మధ్య ఉంది. కుమార్తులికి దగ్గర మెట్రో స్టేషన్ షోబాబజార్ మెట్రో స్టేషన్. మీరు సెంట్రల్ కలకత్తాలో ఉన్నట్లయితే టాక్సీలో కూడా చేరవచ్చు. సుమారు 30 నిమిషాల సమయం పడుతుంది.

హూగ్లీ నది ఒడ్డున బంకమట్టి ఎక్కువగా లభించటం వలన కుమ్మరులు ఇక్కడ విగ్రహాలను తయారుచేస్తారు. ఇక్కడ దొరికే బంక మట్టి దుర్గా విగ్రహాలను రూపొందించుటకు సరైన మట్టిగా పరిగణించబడుతుంది.

చేతి వృత్తులు

చేతి వృత్తులు

కుమార్తులి ప్రాంతంలో చేతి వృత్తులు దాదాపుగా 300 సంవత్సరాల నుండి ఉన్నాయి. వారు ఈ ప్రాంతంలో స్థిరపడి జీవనం సాగిస్తున్నారు. విగ్రహాలను తయారుచేసి డబ్బును సంపాదిస్తారు. ఈ కుమ్మరులు వేర్వేరు ఉత్సవాలకు విగ్రహాలను తయారుచేస్తారు. ప్రస్తుతం 150 కుటుంబాలు కుమార్తులిలో నివసిస్తున్నాయి.

దుర్గా విగ్రహాల తయారి

దుర్గా విగ్రహాల తయారి

దుర్గా పూజకు ఒక వారం ముందు దుర్గా విగ్రహాలను పూర్తిచేయటానికి 550 వర్క్ షాప్స్ లో నిపుణులు పనిచేస్తారు. విగ్రహాలను అత్యంత అంకితభావంతో మరియు ఓర్పుతో రూపొందిస్తారు. దేవత యొక్క అన్ని విగ్రహాలను వెదురు మరియు గంగా మాటి (మట్టి) తో తయారు చేస్తారు. ఇవి పర్యావరణానికి అనుకూలమైనవి.

పూజ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న విగ్రహాల అధిక డిమాండ్ ని పూర్తి చేయడానికి ఇతర ప్రదేశాల నుండి అనేక మంది కళాకారులు ఇక్కడకు వస్తూ ఉంటారు. దుర్గా దేవి విగ్రహాలతో పాటు గణేష, లక్ష్మి, కార్తికేయ మరియు సరస్వతి విగ్రహాలను కూడా తయారుచేస్తారు.

దుర్గా మాతా సింహం మీద అధిరోహించి దెయ్యాన్ని చంపుతుంది. సాదారణంగా దుర్గా దేవి యొక్క ఈ రూపం పాండల్లో ప్రదర్శించబడుతుంది. ప్రతి సంవత్సరం కుమార్తులిలో సుమారుగా 4000 దుర్గా దేవి విగ్రహాలను తయారుచేస్తారు. కొన్ని విగ్రహాలు విదేశాలకు కూడా వెళ్ళుతూ ఉంటాయి. విగ్రహాలను తయారు చేసే ఈ జటిలమైన పని కోసం కృషి మరియు అంకితం భావం చాలా అవసరం. ఈ విగ్రహాలు రెడీ అవటానికి సుమారుగా 2-4 నెలలు పడుతుంది.

ఈ కళాకారులు దుర్గా దేవి విగ్రహాలను తయారుచేయటమే కాకుండా అందంగా అలంకరణ కూడా చేస్తారు. విగ్రహాలు సాధారణంగా వైట్ షోలాతో అలంకరించబడి ఉంటాయి.విగ్రహాలలో అధిక శాతం నిజమైన వేషధారణతోనే అలంకరిస్తారు.

కుమార్తులి వెళ్ళటానికి ఉత్తమ సమయం

కుమార్తులి వెళ్ళటానికి ఉత్తమ సమయం

అనేక ఉత్సవాలకు విగ్రహాలను సంవత్సరం మొత్తం తయారుచేస్తున్న సరే కుమార్తులి వెళ్ళటానికి ఉత్తమ సమయం జూన్ మరియు జనవరి నెలల మధ్య అని చెప్పవచ్చు. దుర్గ పూజ నిస్సందేహంగా అతి పెద్ద మరియు అత్యంత ముఖ్యమైన ఉత్సవం. పూజకు ముందు కళాకారులు రెండు మూడు వారాల ముందు నుండి పనిచేస్తారు.

మహాలయ యొక్క పవిత్రమైన రోజు దుర్గాదేవి కళ్ళకు పెయింటింగ్ వేసే పురాతనమైన సంప్రదాయం ఉంది. ఈ ఆచారాన్ని "చోఖు దాన్" అని పిలుస్తారు. చోఖు దాన్ ను చూడడానికి, మీరు మహాలయపు రోజు (శుక్రవారం ఉదయం) వెళ్ళవచ్చు. ఇది దుర్గా పూజకు దాదాపుగా ఒక వారం ముందు జరుగుతుంది.

English summary

Kumartuli: The Making Of Durga Idols In Kolkata

Kumartuli: The Making Of Durga Idols In Kolkata
Story first published: Sunday, September 24, 2017, 15:00 [IST]
Subscribe Newsletter