ప్రముఖ వ్యాపారవేత్తగా, టాటా సన్స్ మాజీ చైర్మన్‌గా ర‌త‌న్ టాటా చెప్పిన 8 విజ‌య రహస్యాలు

Posted By: sujeeth kumar
Subscribe to Boldsky

విజ‌యాలు అమాంతం రాత్రికి రాత్రే ద‌రిచేర‌వు. ల‌క్ష్యాల‌ను చేధించేందుకు ఎంతో శ్ర‌మ‌ప‌డాల్సి ఉంటుంది. ఎన్నో అడ్డంకుల‌కు ఎదురీదుకుంటూ వెళ్లాల్సి వ‌స్తుంది.

మ‌న దేశంలో బిజినెస్ ఐకాన్ గా పేరు తెచ్చుకున్న ర‌త‌న్ టాటా త‌న విజ‌య ర‌హ‌స్యాల‌ను పంచుకున్నారు. విజ‌యం అసాధ్య‌మేమీ కాదు, మ‌రీ శ్ర‌మ ప‌డ‌న‌క్క‌ర్లేకుండా సులువుగా ఎలా దాన్ని దారికి తెచ్చుకోవ‌చ్చో చెబుతానంటున్నారు. ఆయ‌న చెప్పిన విజ‌య ర‌హ‌స్యాలన్నీ ఎవ‌రివో కావు. ఆయ‌న సొంత అనుభ‌వాలే ఇత‌రుల‌కు పాఠాలుగా చెప్ప‌బోతున్నారు.

ఇంకెందుకు ఆల‌స్యం? ప‌దండి ర‌త‌న్ టాటా స‌క్సెస్ మంత్ర‌ను తెలుసుకొని మ‌న విజ‌యానికీ బాట‌లు వేసుకుందాం...

మీరు పుట్టిన డేట్ ని బట్టి.. ఏ రంగంలో సక్సెస్ అవుతారు ?

1. మీ శ‌క్తిని ప‌రీక్షించుకోండి

1. మీ శ‌క్తిని ప‌రీక్షించుకోండి

మ‌న సొంత శ‌క్తిని, ప‌రిస్థితులును ప‌రీక్షించుకోమ‌ని ర‌త‌న్ టాటా అంటుంటారు. దీన్ని బ‌ట్టే మ‌న‌కున్న అవ‌కాశాల‌ను, స‌వాళ్ల‌ను ఎంచుకోవ‌చ్చు. మ‌న గురించి మ‌న‌క‌న్నా బాగా ఎవ‌రికీ తెలియ‌ద‌నే సిద్ధాంతాన్ని న‌మ్మాల‌ని ఆయ‌న అంటారు. కాబ‌ట్టి మీ అర్హ‌త‌ల‌ను, మీకున్న అనుకూల‌మైన అంశాల‌ను తీసుకొని మీరు అందిపుచ్చుకోగ‌లిగే అవ‌కాశాల‌ను బాగా వినియోగించుకోండి. అప్పుడు విజ‌యం ఎగురుకుంటూ మీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది అని అంటారాయ‌న‌.

2. మిమ్మ‌ల్ని మీరు న‌మ్మాల్సిందే

2. మిమ్మ‌ల్ని మీరు న‌మ్మాల్సిందే

మ‌నం ఎలా ఉన్నామో అలాగే మన‌ల్ని మ‌నం చూసుకోవాలి. మ‌న గురించిన వాస్త‌వాల‌ను ఒప్పుకోవాలి. మ‌న‌కున్న ప‌రిమితుల‌తో స‌రిపెట్టుకోకుండా ప్ర‌తి రోజు ఎదుర‌య్యే రోజువారీ స‌మ‌స్య‌ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కోగ‌ల‌గాలి. మ‌న పైన మ‌న‌కు న‌మ్మ‌కం లేనప్పుడు జీవితంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయ‌లేమ‌ని ర‌త‌న్ టాటా అన్నారు. కాబ‌ట్టి ఎప్ప‌టికీ ఫోక‌స్ మ‌ర‌ల‌కుండా చూసుకోవాలంటారు ఆయ‌న‌.

3. మాన‌వ‌త్వాన్ని వీడ‌కండి

3. మాన‌వ‌త్వాన్ని వీడ‌కండి

పేరు ప్ర‌తిష్ట‌లకు, వ్యాపార‌, సంప‌ద వృద్ధికి తాప‌త్ర‌య‌ప‌డుతున్న‌వారిలో మీరు ఉంటే ముందుగా మంచి మాన‌వ‌తా దృక్ప‌థం క‌లిగి ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌న చుట్టూ ఉన్న‌వారికి త‌గిన గౌర‌వం ఇవ్వ‌డం నేర్చుకోవాలి. మాన‌వ‌తావాదం మ‌న వ్య‌క్తిత్వాన్ని ఔన్న‌త్యంగా తీర్చిదిద్ద‌డ‌మే కాదు మ‌న విజ‌యానికి బాట‌లు వేయ‌డంలోనూ కీల‌క పాత్ర పోషిస్తుంది.

4. ప‌ని ప‌నే.. పెద్ద‌ది.. చిన్న‌దంటూ ఉండ‌దు

4. ప‌ని ప‌నే.. పెద్ద‌ది.. చిన్న‌దంటూ ఉండ‌దు

ఆయ‌న ఎప్పుడూ అంటుంటారు.. ప‌ని ఎప్పుడూ ప‌నే. చిన్న ప‌ని, పెద్ద ప‌ని అంటూ ఉండ‌దు. పెద్ద ప‌ని అని ఉసూరుమ‌నకుండా ఉల్లాసంగా, అంకిత‌భావంతో, మ‌న‌సు పెట్టి చేయాలి. మీరు వెళ్లేదారిలో జీవితం అనేక స‌వాళ్ల‌ను విసురుతుంది. వాటి నుంచి పారిపోకుండా ప్ర‌తి క‌ష్టాన్ని ధైర్యంతో ఎదురొడ్డి పోరాడాలి. అప్పుడే విజ‌య‌తీరాన్ని సులువుగా అందుకోగ‌లుగుతాం.

5. పెద్ద ల‌క్ష్యాలు పెట్టుకోవాలి..

5. పెద్ద ల‌క్ష్యాలు పెట్టుకోవాలి..

పెద్ద ల‌క్ష్యాల‌ను పెట్టుకోమ‌ని ఆయ‌న ఎప్పుడూ చెబుతుంటారు. అలా చేయ‌లేక‌పోతే జీవితం నిస్సారంగా మారిపోగ‌ల‌దు. మ‌న ప‌త‌నానికి కార‌ణం మ‌న‌మే అవుతాం త‌ప్ప ఇత‌రులు కాదు. అదెలా అంటే ఉక్కుకు ఏదీ హాని త‌ల‌పెట్ట‌లేదు. దాని చిలుము త‌ప్ప‌. అలాగే మ‌న సొంత ప‌రిప‌క్వ‌త‌కు మ‌న‌మే బాధ్యులుగా నిలుస్తాం.

చాణుక్య ప్రకారం : మీరు సక్సెస్ సాధించాలంటే ఈ విషయాల్లో సిగ్గు పడకూడదు!!

6. ప్ర‌తి రోజు కొత్త‌గా ఏదైనా చేయండి

6. ప్ర‌తి రోజు కొత్త‌గా ఏదైనా చేయండి

ప్ర‌తి రోజు కొత్త‌గా ఏదైనా ప్రారంభించమ‌ని ర‌త‌న్ టాటా అంటారు. అలా చేస్తే అయ్యో అన‌వ‌స‌రంగా స‌మ‌య‌మంతా వృథా చేశాన‌నే భావ‌న ఉండ‌దు. నేను ఏ రోజైతే విజ‌యం దిశ‌గా ప‌రుగెత్త‌లేనో అదే నాకు అత్యంత దుర‌దృష్ట‌మైన రోజ‌ని ర‌తన టాటా న‌మ్మే సిద్ధాంతం. ల‌క్ష్యం దిశ‌గా ముందుకెళుతుంటేనే వెన‌క్కి తిరిగి చూసేస‌రికి ఎంత దూరం వ‌చ్చామో తెలుస్తుంది. అందుకే ప్ర‌తి రోజు ఏదో ఒక కొత్త‌ద‌నం ఉండాలంటారు ఆయ‌న‌.

7. న‌మ్మ‌కం క‌లిగించుకోండి

7. న‌మ్మ‌కం క‌లిగించుకోండి

జీవితంలో న‌మ్మ‌కం, విశ్వాసాల‌కు చాలా విలువుంద‌ని ర‌త‌న్ టాటా న‌మ్ముతారు. అది వెల‌క‌ట్ట‌లేనిది, వ్య‌క్తికి ఆభ‌ర‌ణంగా నిలుస్తుంద‌ని అంటారు. మ‌న‌తో క‌లిసి ప‌నిచేసేవారితో న‌మ్మ‌కపు పునాదుల‌ను క‌ట్టుకోగ‌ల‌గాలి. వ్యాపారం చేసేవారైతే వినియోగ‌దారుల న‌మ్మ‌కాన్ని చూర‌గొనాలి. అది విజ‌యాన్ని మ‌రింత చేరువ చేయ‌గ‌ల‌దు.

8. బాగా కృషి చేయాలి

8. బాగా కృషి చేయాలి

జీవితంలో కొత్త‌గా ఏదైనా చేసేందుకు బాగా కృషి చేయాల‌ని ర‌త‌న్ టాటా అంటారు. మ‌న ప‌క్క‌వారి విజయాన్ని స్పూర్తిగా తీసుకోవాలి. అదే స‌మ‌యంలో గుంపులో గోవింద‌లా కాకుండా మ‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను సంత‌రిచుకోవాలి. ప్ర‌తి వ్య‌క్తికి ఓ ప్ర‌త్యేక‌త ఉంటుంది. దాన్ని సాన‌బెట్టి అద్భుతంగా వాడ‌గ‌ల‌గాలి.

ఆయ‌న చెప్పిన ఈ విజ‌య‌పు మంత్రాల‌ను పాటించేందుకు ప్ర‌య‌త్నించండి. ఇలాంటి ప్ర‌ముఖ వ్య‌క్తుల‌ ఆస‌క్తిక‌ర‌మైన విజ‌య ర‌హ‌స్యాల‌ను మ‌రిన్ని తెలుసుకోవాల‌నుకుంటే మాకు తెలియ‌జేయండి.

English summary

Exclusive Tips From Ratan Tata To Get Rich

These exclusive tips of success are from Ratan Tata himself and we must say, they are totally worth it!
Story first published: Friday, November 10, 2017, 13:30 [IST]