అన్యాయాన్ని ప్రశ్నించినందుకు చంపబడ్డ పాత్రికేయులు వీరే

By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

అమాయక ప్రజల్ని ఎవరో అన్యాయంగా చంపేశారు అన్న వార్తను విన్న ప్రతిసారి మన రక్తం మరిగిపోతుంది మరియు న్యాయం జరగాలని నినదించాలనిపిస్తుంది. న్యాయం జరిగితే బాగుండు అనిపిస్తుంది. ఏ వ్యక్తులైతే సమాజంలో జరుగుతున్న చెడుని అన్యాయాన్ని ప్రశ్నిస్తారో, తమ అభిప్రాయాలను ఎవరికీ భయపడకుండా అందరికి వినిపించేలా చెబుతారో అటువంటి వ్యక్తులను జాలి, కనికరం అనేదే లేకుండా ఈ మధ్య కాలంలో చంపేస్తున్నారు.

అయితే ఇలా జరిగిన ప్రతిసారి, సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత ప్రజలందరూ జరిగిన విషయాన్ని మర్చిపోతున్నారు మరియు తమ దైనందిక జీవితంతో సాగిపోతున్నారు. మళ్ళీ ఇటువంటి సంఘటన జరిగేంత వరకు మామూలుగానే ఉంటున్నారు.

journalists death

యమ ధర్మరాజు చెప్పిన మరణ రహస్యాలు

ప్రపంచవ్యాప్తంగా పాత్రికేయులు అందరి పరిస్థితి ఇలానే ఉంది, వారి పై దాడులు కూడా దారుణంగా జరుగుతున్నాయి, చాలా మంది మరణిస్తున్నారు కూడా. పాత్రికేయులు కావొచ్చు లేదా ఏ ఇతర వ్యక్తి అయినా కావొచ్చు, ఎవ్వరైనా సరే అవినీతి ఎక్కడ జరుగుతుందో దానిని ఎత్తి చూపించినా మరియు చెడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి నిజస్వరూపం వెలుగులోకి తెచ్చినా వారి జీవితాలు నాశనం అయిపోతున్నాయి, కనుమరుగైపోయాయి.

వారి యొక్క వృత్తి దైర్యంగా, నిజాయితీగా పనిచేసి సమాజంలో జరుగుతున్న చెడుని అరాచకాల్ని, అన్యాయాల్ని ప్రపంచానికి తెలియజేయాలని చెబుతుంది. ఇలా చేస్తున్న క్రమం లో ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయే సైనికులకంటే వీరు ఏమి తక్కువ కాదు.

మీరు మరణించబోతున్నరని తెలిపే లక్షణాలు

ఇలాంటి వ్యక్తులకు న్యాయం ఎప్పటికీ జరగదా ?

ఈ క్రింద వెలుగులోకి రాని కొంతమంది హీరోల జీవితాలు ఎలా ముగిసిపోయాయో తెలుసుకుందాం. అవినీతికి మరియు అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో వీళ్ళందరూ తమ ప్రాణాలను కోల్పోయారు.

గౌరి లంకేశ్ :

గౌరి లంకేశ్ :

తాజాగా ఈ నిశ్శబ్ద మారణహోమానికి ఈమె బాధితురాలిగా మారింది. కన్నడ భాషకు చెందిన 'గౌరి లంకేశ్ పత్రికే' అనే వారాంత పత్రికకు ఈమె సంపాదకురాలు. మత రాజకీయాలను, కుల వ్యవస్థను మరియు వాటి యొక్క తీరు తెన్నులకు వ్యతిరేకంగా ఆమె గళాన్ని గట్టిగా విన్పించింది.

ఎలా మరణించారంటే : ఎవరో తెలియని వ్యక్తుల చేతిలో బులెట్ గాయాలకు తన ఇంటి ముందు ప్రాణాలను విడిచింది.

సందీప్ కొఠారి :

సందీప్ కొఠారి :

జబల్ పూర్ ప్రాంతానికి చెందిన ఒక హిందీ పత్రికకు ఇతను ఒక విలేఖరిగా పనిచేస్తుండేవాడు.

ఎలా మరణించారంటే : అక్రమ గనుల త్రవ్వకాల్లో పాల్గొన్న ముగ్గురు వ్యక్తులు ఇతనిని దారుణంగా హతమార్చారని ఆరోపణలు ఉన్నాయి. వాళ్ల పై ఒక కేసు వేశాడు, దానిని ఉపసంహరించుకోమని చెప్పినా వినకపోవడంతో అతనిని అపహరించి నిప్పుపెట్టి కాల్చేశారు.

రాజ్ దేవ్ రంజన్ :

రాజ్ దేవ్ రంజన్ :

ఇతనిని రాజ్ డియో రంజన్ అని కూడా పిలుస్తారు. ఇతనొక భారతీయ విలేఖరి. భారత్ దేశంలోని బీహార్ రాష్ట్రంలో శివన్ ప్రాతానికి చెందిన హిందుస్థాన్ అనే పత్రికకు ఇతను విలేఖరిగా పనిచేస్తుండేవాడు.

ఎలా మరణించారంటే : ఇతనిని చాలా దగ్గర నుండి ఒక తుపాకీతో గురిపెట్టి కాల్చేశారు. ఒక బులెట్ అతని నుదిటికి తాకింది. ఇంకొకటి అతని మెడ నుండి చొచ్చుకొని పోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గ మధ్య లోనే ఇతను మరణించాడు.

జగేంద్ర సింగ్ :

జగేంద్ర సింగ్ :

ఇతడు ఒక ఫ్రీలేన్స్ విలేఖరి. హిందీ భాషకు సంబంధించిన ప్రముఖ పత్రికలలో మరియు ఫెస్ బుక్ లో రాజకీయాలు మరియు సమకాలిన అంశాలు పై సమాచారాన్ని సేకరించి తన అభిప్రాయాలను క్రోడీకరించి నివేదిక ఇచ్చేవాడు.

ఎలా మరణించారంటే :పోలీస్ లు అతని ఇంటి పై ఆకస్మిక దాడి చేశారు. ఆ సమయంలో ఇతడు కాలిన గాయాలతో మరణించి ఇంట్లో పడి ఉన్నాడు. పాత్రికేయులు ఒక్కరే కాదు, సామాన్యుల నుండి వేరే ఇతర రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తుల వరకు ఈ భయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది మరియు చాలా మంది వ్యక్తులు తమ అభిప్రాయాలను గట్టిగా విన్పించినందుకు తమ ప్రాణాలను కోల్పోయారు. ఇప్పుడు అందరూ న్యాయం కావాలని, న్యాయం చేయాలని గట్టిగా కోరుతున్నారు.

ఎమ్.ఎమ్.కల్బుర్గి :

ఎమ్.ఎమ్.కల్బుర్గి :

ఇతను ఒక గొప్ప విద్యావంతుడు మరియు వచన సాహిత్యంలో పేరుగాంచిన పండితుడు. హంపి ప్రాంతంలోని కన్నడ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేశారు. నివేదికల ప్రకారం విగ్రహ పూజను ఈయన విమర్శించారు. దీంతో కొంతమంది హిందువులు ఇతనికి వ్యతిరేకంగా కేసు పెట్టారు.

ఎలా మరణించారంటే : ఆగష్టు 2015 సంవత్సరంలో తన ఇంట్లో ఉండగానే ఎవరో వ్యక్తి తుపాకీ తో ఇంట్లోకి ప్రవేశించి అతనిని కాల్చి చంపాడు.

నరేంద్ర దభోల్కర్ :

నరేంద్ర దభోల్కర్ :

మూఢ నమ్మకాలకు మరియు చేతబడులకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకు వచ్చేలా చేయడంలో ఇతను ఎంత గానో కృషిచేశాడు. ఆ ఉద్యమాన్ని ముందుండి నడిపించాడు.

ఎలా మరణించాడంటే : ఆగష్టు 2013 లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇతన్ని కాల్చి చంపారు.

English summary

Indian Journalists Who Lost Their Lives While Exposing People

The list of honest journalists getting killed with no justice to their deaths is on the rise…
Story first published: Thursday, September 7, 2017, 20:00 [IST]
Subscribe Newsletter