For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాణక్య ప్రకారం మగవారికి ఇవే అత్యంత దురదృష్టకరమైన సందర్భాలు..!!

గుడ్ లక్ లేదా బ్యాడ్ లక్ ఇవి మన కంట్రోల్లో ఉండవు. ఏదైనా మంచి , లేదా చెడు విషయాలను అనుభవ పూర్వకంగా మనకు తెలిసినప్పుడు గుడ్ లక్, బ్యాడ్ లక్ గురించి తెలుస్తుంటుంది.

|

గుడ్ లక్ లేదా బ్యాడ్ లక్ ఇవి మన కంట్రోల్లో ఉండవు. ఏదైనా మంచి , లేదా చెడు విషయాలను అనుభవ పూర్వకంగా మనకు తెలిసినప్పుడు గుడ్ లక్, బ్యాడ్ లక్ గురించి తెలుస్తుంటుంది. ఏదైనా ఒక విషయంలో మంచి జరిగితే గుడ్ లక్ అని, అదే విషయంలో చెడు జరిగితే బ్యాడ్ లక్ అని అనుకుంటుంటారు. అది మానవ సహజం. అవి పరిస్థితులు బట్టి, సర్ధుకుపోవడం సహజం.

జీవితంలో ప్రతి ఒక్కరూ మంచే జరగాలని కోరుకుంటారు కానీ, చెడు జరగాలని ఎవరూ కోరుకోరు. ఈ విషయంలో మన రాజనీతజ్ఝడు చాణుక్య అర్థం శ్రాస్తం ప్రకారం పురుషులకు బ్యాడ్ లక్ అంటే ఏంటో వివరించాడు.

చాణుక్యుడి ప్రకారం: ఈ 6 లక్షణాలున్న వ్యక్తి జీవితంలో విజయం సాధిస్తాడు..!!

సహజంగా మగవారు ప్రతి విషయం అంటే ఉద్యోగం, పిల్లలు, ఇల్లు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఆందోళన పడతారు. కొన్ని సందర్భాల్లో అదృష్టం గురించి మాట్లాడుకుంటారు. ఆస్తులు కూడబెట్టుకోవడానికి అదృష్టం కలిసి రావాలని అంటారు. పనులు వాయిదా పడినా, ఎలాంటి పురోగతి లేకపోయిన దురదృష్టం వెంటాడిందని అంటారు. అపజయాలకు కారణం అదేనంటూ దురదృష్టాన్ని సాకుగా చూపుతారు.

ప్రస్తుత స్థితిని బట్టి మీరు అదృష్టవంతులా లేదా దురదృష్టవంతులా విశ్లేషిస్తారు. అయితే అదృష్టం అంటే ఏంటో ఆచార్య చాణక్యుడు భాష్యం చెప్పాడు. పురుషుడికి ఈ కింది మూడు సందర్భాలే అత్యంత దురదృష్టకరమని ఆ రాజనీతి కోవిదుడు పేర్కొన్నాడు.

వృద్ధాప్యంలో భార్యను కోల్పోయిన వ్యక్తి

వృద్ధాప్యంలో భార్యను కోల్పోయిన వ్యక్తి

వృద్ధాప్యంలో భార్యను కోల్పోయిన వ్యక్తి అత్యంత దురదృష్టవంతుడట. ఒక వేళ యుక్త వయసులో భార్యను కోల్పోయిన లేదా భార్య నుంచి విడిపోయిన వ్యక్తులు మళ్లీ పెళ్లి చేసుకోవాలట. ఎందుకంటే వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి సహచర్యం చాలా అవసరమట. ముసలి వయసులో భార్య చనిపోతే వివాహం చేసుకోవడం సాధ్యం కాదు. దీని వల్ల తీవ్ర కుంగుబాటుతో పాటు మానసిక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందట.

పురుషులను వెంటాడే మరో దురదృష్టకర పరిస్థితి :

పురుషులను వెంటాడే మరో దురదృష్టకర పరిస్థితి :

కష్టపడి సంపాదించిన సొమ్ము రోగాల కారణంగానూ, శత్రువుల కారణంగానూ కోల్పోతే చాలా దురదృష్టకరమట. డబ్బు వల్ల శ‌తృత్వం ఏర్పడితే లేనిపోని ఆటంకాలు, సమస్యలు ఎదుర్కొంటారట. తప్పుడు పనులకు సొమ్ము వినయోగించినా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోకక తప్పదు.

చాణుక్యుడి ప్రకారం మరో బ్యాడ్ లక్ లక్షణం:

చాణుక్యుడి ప్రకారం మరో బ్యాడ్ లక్ లక్షణం:

పురుషులు ఇతరుల ఇంట్లో తలదాచుకోవడం కంటే దురదృష్టం మరొకటి ఉండదట. ఎందుకంటే ప్రతి విషయంలోనూ వారి అనుమతి తీసుకుని బానిసలా బతుకాల్సి వస్తుందట. ఇలా పరాయి పంచన చేరడమంటే దుర్భరమైన జీవితాన్ని గడపడమే.

 ఆచార్యుడిగా పేరుగాంచిన చాణక్యుడు

ఆచార్యుడిగా పేరుగాంచిన చాణక్యుడు

స్వర్ణయుగంలో ఆర్థశాస్త్రం ఆచార్యుడిగా పేరుగాంచిన చాణక్యుడు రాజకీయాలపై అపారమైన ఙ్ఞానాన్ని, అవగాహనను సంపాదించాడు. రాజకీయాల్లో దౌత్యాన్ని ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి చాని పుత్ర చాణక్యుడే. తన రాజకీయ చతురతతో విశ్వవిజేత అలెగ్జాండర్‌ను భారతదేశం నుంచి వెళ్లిపోయేలా చేశాడు.

English summary

Lucky Or Unlucky? 3 Life Lessons That Indicate Bad Luck Of A Man, According To Chanakya

Good or bad luck is something which is simply not under our control. Experience tells us to wait before labeling any situation good or bad. Because what we judge as bad initially, may prove to be good in the long run or vice versa. Let's check out what Chanakya's Arthshastra says about bad luck of a man.
Story first published: Tuesday, February 7, 2017, 16:46 [IST]
Desktop Bottom Promotion