బాహుబ‌లి రేంజ్‌లో ప్ర‌మాణ‌స్వీకారం చేశాడు!ఎవ‌రు, ఎక్క‌డ, ఎందుకు?

By: sujeeth kumar
Subscribe to Boldsky

అదృష్టంతోపాటు స్మార్ట్‌నెస్ తోడైతే మ‌నిషి అద్భుతాలు చేయ‌గ‌ల‌డు. స‌రైన స‌మ‌యంలో ల‌క్ త‌గిలితే రాత్రికి రాత్రే ల‌క్షాధికారి అయినా అవ్వొచ్చు.

సుయాష్ దీక్షిత్ అనే వ్య‌క్తి ఇందుకు గొప్ప ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. ఇంట‌ర్నెట్‌లో ఎంతో ప‌రిశోధించి బిర్ తావిల్ అనే ప్ర‌దేశాన్ని క‌నుగొని దాన్ని సుల‌భ‌రీతిలో సొంతం చేసుకోవాల‌నుకున్నాడు.

ఆయ‌న ఫేస్‌బుక్ పోస్ట్‌ను చూస్తే ఎవ‌రికైనా తాను రాజ్యాక్ర‌మ‌ణ ఎలా చేసింది అబ్బుర‌ప‌రుస్తుంది.

Bir Tawil ownership

1. ఇలా మొద‌లైంది...

సుయాష్ దీక్షిత్ అన‌బ‌డే నేను.. దీక్షిత్ రాజ్యంగా నామ‌క‌ర‌ణం చేసి దీనికి స‌ర్వ ర‌క్ష‌కుడినై, రాజ్యాధికారం చేప‌డ‌తాన‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లను సుఖ‌సంతోషాల‌తో ఉండేలా చేస్తాన‌ని, నా మాతృభూమి సాక్షిగా ప్ర‌మాణం చేస్తున్నాను. బిర్ తావిల్ దేశాన్ని నా ప్రాణాలున్నంత వ‌ర‌కు ఎలాంటి క‌ష్ట‌ము రానివ్వ‌న‌ని నా ఆన‌.

Bir Tawil ownership

2. ప్ర‌యాణ‌మిలా...

బిర్ తావిల్ ద‌ట్ట‌మైన ఎడారి ప్రాంతం. అక్క‌డికి వెళ్లేందుకు రోడ్లు లేవు. రాను పోను 319 కిలోమీటర్లు ప్ర‌యాణించాడు. 800 చ‌ద‌ర‌పు మైళ్ల భూమి ఏ దేశానికీ చెందింది కాదు. భూమిపైన మ‌నిషి జీవించ‌గ‌లిగి మ‌న‌గ‌లిగే స్థ‌లం అయి ఏ దేశానికి చెంద‌నది అంటే ఇదే.

ప్రాచీన నాగ‌రిక‌త ప్ర‌కారం ఏదైనా భూమి త‌న‌ది అని చెప్పుకోవాలంటే అక్క‌డ పంట పండించాలి. అక్క‌డికి చేరుకున్న రోజు దీక్షిత్ ఒక విత్త‌నం నాటి కొంచెం నీళ్లు కూడా పోశాడు. కాబ‌ట్టి ఆ భూమి త‌న సొంత‌మ‌ని చెప్పుకున్నాడు.

బిర్ తావిల్ గురించి మ‌రిన్ని వివ‌రాల‌కు ఈ వీడియో చూడండి https://www.youtube.com/watch?v=v_iaurPRhCs&t=34s

Bir Tawil ownership

3. ప్ర‌యాణ వివ‌రాలు

తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కు నేను అబు సింబెల్ అనే ప్రాంతం నుంచి బ‌య‌లుదేరాను. నాతోపాటు ముస్త‌ఫా అనే స్థానిక డ్రైవ‌ర్‌ను వెంట తీసుకెళ్లాను. మొద‌ట నా ప్లాన్ గురించి చెప్పిన‌ప్పుడు అత‌డు స‌సేమిరా అన్నాడు. అయితే ఆ త‌ర్వాత ఎక్కువ మొత్తంలో డ‌బ్బు ఇస్తే అత‌డు ఒప్పుకున్నాడు. కారులో ఎలా ప్ర‌యాణించాలి, ఏ దారి గుండా వెళ్లాలి అనేదాని పై రెండు రాత్రులు బాగా ఆలోచించాను.

ఈ ప్లాన్ ఎంత భ‌యంక‌రమైన‌దో చెప్తాను. నేను ఎంచుకున్న మార్గం ఈజిప్టు మిల‌ట‌రీ ఆధ్వ‌ర్యంలో ఉంటుంది. ఇది అంత‌ర్జాతీయ బార్డ‌ర్‌. ఇక్క‌డ ఎక్కువ‌గా తీవ్ర‌వాదులు సంచ‌రిస్తుంటారు. వారిపై షూట్ ఎట్ సైట్ ఆర్డ‌ర్లు ఉన్నాయి. ఈ దారిని చేరేందుకు మ‌ధ్య‌లో వ‌చ్చే మార్గం గుండా వెళ్లేందుకు అనుమ‌తి కూడా తీసుకోవాల్సి ఉంటుంది.

అనుమ‌తి అయితే దొరికింది కానీ 3 ష‌రుతుల‌పై... మిల‌ట‌రీ స్థావ‌రాల‌కు సంబంధించి ఎలాంటి ఫొటోలు తీయొద్దు, వెంట విలువైన వ‌స్తువులు తీసుకెళ్ల‌కూడ‌దు, ఒక్క రోజులో తిరిగి వ‌చ్చేయాలి.

6 గంట‌ల‌పాటు ఏక‌ధాటిగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాం. మ‌ధ్య‌లో ఒక మిల‌ట‌రీ బేస్ క్యాంప్ త‌గిలింది. దారిలో ఇసుక తిన్నెలు, కొండ గుట్ట‌లను దాటుకుంటూ వెళ్లాం.

నేను నా విలువైన వ‌స్తువుల‌న్నీ అక్క‌డే వ‌దిలేసి నా స్నేహితురాలైన ఇస్రాకు చెప్పాను. ఆమెతో అసలు ప్లాన్ చెప్ప‌కుండా వేరే ప‌ని మీద వెళ్తున్నాన‌ని ఒక వేళ అర్ధ‌రాత్రి దాకా రాకపోతే పోలీసుల‌కు కాల్ చేయ‌మ‌ని చెప్పి వ‌చ్చాను.

నాకు తెలిసి ఇది వ‌ర‌కు ఒక ఐదారు మంది ఈ ప్రాంతానికి వ‌చ్చి ఈ రాజ్యం నాది అని ప్ర‌క‌టించుకొని ఉంటారు. అయితే ప్రాచీన నాగ‌రిక‌త ప్ర‌కారం రాజ్యం నాదే. అలా కాద‌ని ఎవ‌రైనా ముందుకు వ‌స్తే వారితో యుద్ధ‌మే( స్టార్‌బ‌క్స్‌లో కాఫీ తాగుతూ లెండి)

రెండు చోట్ల జెండా పాతేందుకు స్థ‌లం వెతికాం. ఒక‌టి రాజ‌ధానిగా పిలిచేందుకు, ఇంకోటి స‌రిహ‌ద్దుకు గుర్తు. మేం చేసిన ప్ర‌యాణంలో భాగంగా చాలా సందేహాలు ఎదుర‌య్యాయి. కారులో ఇంధ‌నం అయిపోతే ఏం చేయాలి?

కొండ‌ల‌ను దాట‌గ‌ల‌మా? స‌మ‌యానికి ఇల్లు చేర‌గ‌ల‌మా లాంటి సందేహాలెన్నో. అయితే కొంచెం ధైర్యం, కాస్త లెక్క‌లు వేస్తే చాలు సాధించ‌గ‌లిగాం.

ఈ ట్రిప్‌తో నేను ఎంతో కొంత నేర్చుకున్నాను. ఇలాంటిది ఇంకెప్పుడు చేయ‌కూడ‌దు అని.

నా దేశానికి విదేశీ పెట్టుబ‌డుల‌ను, నేష‌నాలిటీ ద‌ర‌ఖాస్తుల‌కు నా వెబ్‌సైట్ ద్వారా ఆహ్వానిస్తున్నాను అని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

https://kingdomofdixit.gov.best

Bir Tawil ownership

4. కింగ‌డమ్ ఆఫ్ దీక్షిత్ వివ‌రాలు...

పేరుః కింగ్‌డ‌మ్ ఆఫ్ దీక్షిత్‌

జెండాః

ప్ర‌స్తుత జ‌నాభాః 1

రాజ‌ధానిః సుయాష్‌పూర్‌

రాజ్య స్థాప‌న దినంః న‌వంబ‌ర్ 5, 2017

జాతీయ జంతువుః బ‌ల్లి( ఇక్క‌డ అది త‌ప్ప ఏమీ క‌నిపించ‌లేదు)

నాన్నను దీని అధ్య‌క్షుడిగా ప్ర‌క‌టిస్తున్నాను.

సుయోష్ దీక్షిత్ అనే నేను ప్ర‌ధాన‌మంత్రిగా, మిల‌ట‌రీ నాయ‌కుడిగా ప్ర‌మాణం చేస్తున్నాను. ఇత‌ర ప‌ద‌వుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నాం.

మా నాన్నను ఈ దేశ అధ్య‌క్షుడి హోదాలో ప్ర‌క‌టించేందుకు గ‌ర్వ‌ప‌డుతున్నాను. హ్యాపీ బ‌ర్త్‌డే నాన్న‌

సాహ‌సం చేస్తేనే జీవిత‌మ‌నిపించుకుంటుంది. లేక‌పోతే చెప్పుకోవ‌డానికి ఏమీ ఉండ‌దు. చ‌రిత్ర‌లో నిలిచే విధంగ ఏమీ చేయ‌క‌పోతే ఇలాగే ఉండిపోతాం. అని ఫేస్‌బుక్ దీక్షిత్ పేర్కొన్నాడు.

నేను రాజును ప్లీజ్ ఇది జోక్ కాదు

నేను ఇప్పుడు ఓ రాజ్యానికి రాజుని. యూనైటెడ్ నేష‌న్స్‌కు మెయిల్ పెట్టాలి. చాలా ప‌నులున్నాయి.

పాఠ‌కులారా చ‌దివారు క‌దా! ఈ క‌థ‌నం పై మీ అభిప్రాయాల‌ను మాతో పంచుకోండి.

English summary

Man Who Declared The Unclaimed Land As His Own Country

Suyash Dixit, an Indian man, claimed Bir Tawil as his own country and declared himself the King of the only unclaimed land in the world. He even hoisted the flag in the desert and declared the Lizard as the national animal!.
Story first published: Wednesday, November 29, 2017, 15:00 [IST]
Subscribe Newsletter