మీ బొడ్డు ఆకారం మీ గురించి అనేక విషయాలు చెప్తుందని మీకు తెలుసా?

Subscribe to Boldsky

నిజంగానా? ఏంటి ఇలాంటి విషయంతో కూడా మన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చా? ఆశ్చర్యంగా ఉంది కదూ, కానీ అది నిజమే!

ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎలాంటిదో అతను/ఆమె బొడ్డు ఆకారం చూసి తెలుసుకునే సులభమైన పద్ధతి ఇదిగో.

బొడ్డు ఆకారం వ్యక్తిత్వం గురించి అనేక రహస్యాలను బయటపెడుతుంది, అంతే కాదు దాచిపెట్టిన రహస్యాలను కూడా.

బొడ్డు గురించి 18 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ...!

బొడ్డు ఆకారం మీ వ్యక్తిత్వాన్ని ఎలా నిర్వచిస్తుంది?

బొడ్డు ఆకారం మీ వ్యక్తిత్వాన్ని ఎలా నిర్వచిస్తుంది?

బొడ్డు ఆకారాలని చదివే శాస్త్రాన్ని ‘ఒంఫాలోమన్సీ’ అని అంటారు.దీంతో మనుషుల వ్యక్తిత్వాలను అంచనాలు వేయవచ్చు. అయితే మరిక వివిధరకాల బొడ్డు ఆకారాలను, వాటితో వ్యక్తిత్వ లక్షణాలను తెలుసుకోండి.

గుండ్రటి బొడ్డు

గుండ్రటి బొడ్డు

ఒకవేళ మీకు గుండ్రటి,లోతైన బొడ్డు ఉన్నట్లయితే, మీరు చాలా ఆశావాదులని అర్థం. మీరు ప్రతివిషయంలో సానుకూల అంశాలను చూస్తారు. ఉదాహరణకి, జీవితంలో ఎన్ని నీలిమేఘాలు ఎదురైనా వాటి చివర మెరిసే అంచులనే చూపిస్తారు. మీ ఆలోచనలను సరిగా పంచుకోవటంలో సిద్ధహస్తులు మరియు మీ బంధాలన్నీ ఆరోగ్యకరంగా ఉంచుకుంటారు. ఇవేకాక మీరు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండే స్వభావం కలిగివుంటారు.

బెల్లీ బటన్ ఇన్ఫెక్షన్ నివారించే ఎక్సలెంట్ హోం రెమెడీస్

పెద్ద బొడ్డు

పెద్ద బొడ్డు

మీకు పెద్ద మరియు లోతైన బొడ్డు ఉన్నట్లయితే మీరు చాలా దయాస్వభావం కలవారని అర్థం. మీ దయకి హద్దులు ఉండవు.మీరు వయసుకి తగ్గట్టుగా అందరితో మంచిగా ప్రవర్తిస్తారు. ఇవికాక వయస్సుతో పాటు జ్ఞానం పెంచుకుంటూ, మంచి నిర్వహణా నైపుణ్యాలను కూడా కలిగివుంటారు.

లోతులేని పైపైన బొడ్డు

లోతులేని పైపైన బొడ్డు

లోతులేని మరియు చిన్న బొడ్డు మీ వ్యక్తిత్వంలో నీలివైపును సూచిస్తుంది. మీరు రహస్యాలను జాగ్రత్తగా దాచగలరు అని పేరుంటుంది. మనుషుల రహస్యకోణాలను అర్థంచేసుకోవటం మీకు సహజంగా వచ్చే విద్య. మీకే ఒక అనుమానాస్పద, రహస్యప్రపంచం ఉంటుంది, మరియు అది ఇతరులకి అర్థం కావటం కష్టం.

పైకి పొడుచుకొచ్చే బొడ్డు

పైకి పొడుచుకొచ్చే బొడ్డు

పొడుచుకొచ్చే బొడ్డు గట్టి,బలమైన మనస్తత్వాన్ని సూచిస్తుంది. మీరు మొండివారిలా కన్పిస్తారు. కానీ అసలు నిజం ఏమిటంటే మీ అభిప్రాయంపై మీరు నిలబడాలనుకుంటారు.ప్రేమ ఎప్పుడూ సమస్యగానే ఉంటుంది. మీ ఆలోచనలకి సరిపోయేవారు దొరకటానికి సమయం పడుతుంది, కానీ దొరకగానే అది జీవితాంతం ఉంటుంది.

పైవైపు తిరిగిన బొడ్డు

పైవైపు తిరిగిన బొడ్డు

ఇది బొడ్డు సరిగ్గా ఉండాల్సిన ఆకారం. ఇది ఆరోగ్యకరంగా పుట్టారని,ఆరోగ్యకర మనసని కూడా సూచిస్తుంది. మీరు ఉల్లాసంగా, శక్తికలిగి, మీరు చేసే అన్నిపనుల్లో ఉత్సాహంగా ఉంటారు. మీ ఈ ఉల్లాసకర స్వభావం అందర్నీ ఆకర్షిస్తుంది. జీవితంలో సాధించాలనుకున్న ఏదో లక్ష్యం మీ మనస్సులో రహస్యంగా దాగివుంటుంది.

బొడ్డులో ఒకటి రెండు స్పూన్ల నూనె అప్లై చేయడం వల్ల అనేక లాభాలు

కిందకి తిరిగిన బొడ్డు

కిందకి తిరిగిన బొడ్డు

మీకు ఇలాంటి బొడ్డు ఉంటే, ఇది శారీరకంగా బలహీనపడతారని సూచిస్తుంది. మీకు శారీరకంగా పనులు చేయటం అంత నచ్చదు కానీ మెదడుతో ఎంతైనా చేయగలరు. సోమరిపోతుగా ముద్రపడతారు కానీ కొన్నిసార్లు ఇతరులు కూడా మీ మేధస్సును మెచ్చుకోకుండా ఉండలేరు.

గుడ్డు ఆకారంలో బొడ్డు

గుడ్డు ఆకారంలో బొడ్డు

మీకు ఓవల్ ఆకారంలో బొడ్డు ఉన్నట్లయితే, మీరు అధికంగా పనులు చేస్తూ, అత్యంత సున్నిత స్వభావం కూడా కలిగివుంటారు. ఎప్పుడూ అశాంతితో ఉంటూ, ఏదో ఒకటి చేయాలనే అన్పిస్తుంటుంది. సులభంగా బోరుకొడుతుంది మరియు ఎప్పుడూ కొత్తదనాన్నే కోరుకుంటారు. మరోవైపు మీరు సున్నితంగా కూడా ఉంటారు.ప్రతిదీ మనసుకి తీసుకుని సులభంగా హర్ట్ అవుతారు.

వెడల్పైన బొడ్డు

వెడల్పైన బొడ్డు

ఇలాంటి బొడ్డు ఎప్పుడూ తమని తాము రక్షించుకోటానికి అలర్ట్ గా ఉండే వారిలో ఉంటుంది. మీరు సులభంగా ఎవర్నీ నమ్మరు. మరోవైపు మీరు ఎవరినైతే నమ్మి మీ జీవితంలో స్థానమిస్తారో, వారే మీ ప్రపంచం మరియు వారిని రక్షించకుండా ఉండలేరు. మీ వ్యక్తిత్వానికి నమ్మకం,విధేయత ముఖ్య అంశాలు. ఇతరులతో మీ ప్రవర్తన వారు మిమ్మల్ని ఎలా చూసారన్నదానిపై ఆధారపడుతుంది.

తిరగేసిన వై ఆకారపు బొడ్డు

తిరగేసిన వై ఆకారపు బొడ్డు

ఇది అరుదైన బొడ్డు ఆకారం. మీ బొడ్డు ఆకారం ఇలా వుంటే అన్నిపనులను వెనకవుండి నడిపించే వారై ఉంటారు.మీరు కీర్తిని కోరుకోరు ఎందుకంటే మీ బలాబలాలు మీకు బాగా తెలుసు. విజయం అనేది మీకు చాలా వ్యక్తిగతమైనది అలాగే సంతోషం కూడా.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Did You Know That The Shape Of Your Belly Button Reveals A Lot About You?

    Did You Know That The Shape Of Your Belly Button Reveals A Lot About You?, Read to know more about..
    Story first published: Wednesday, November 1, 2017, 20:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more