బీచ్ వెడ్డింగ్: చైతూ, సమంతల పెళ్లి వేదికగా మారిన గోవాలోని వెగాటర్‌ బీచ్‌

Posted By:
Subscribe to Boldsky

ఈ రోజు పెళ్ళి పీటలెక్కిన వారు. టాలీవుడ్లో అత్యంత ప్రియమైన జంట. అవును ఈ రోజు పెళ్ళి చేసుకున్న జంట, నాగ చైతన్య మరియు సమంతా రూత్ ప్రభు గురించి మాట్లాడుతున్నాం. ప్రేమపూర్వక-ప్రేరేపిత జంటగా పేరు పొందిన వీరు ఈ రోజున ఒక్కటైపోనున్నారు.. ఈ రోజు గోవాలో సాంప్రదాయ వేడుక జరుగుతోంది. వారి కుటుంబం మరియు స్నేహితుల సమక్షంలో ఇది ఒక విలాసవంతమైన బీచ్ వివాహంగా మారనుంది.

దాదాపు నాలుగేళ్లగా ప్రేమలో ఉన్న అక్కినేని నాగచైతన్య, సమంత మూడు ముళ్ల బంధంతో శుక్రవారం(అక్టోబర్‌ 6) పెద్దల సమక్షంలో ఒకటి కాబోతున్నారు. గోవాలోని వెగాటర్‌ బీచ్‌లోని డబ్ల్యూ రిసార్ట్‌లో వీరి వివాహ వేడుక జరగనుంది. ఏయన్నార్‌, రామానాయుడు కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిపి వంద మంది మాత్రమే హాజరుకానున్నారని సమాచారం.

Naga Chaitanya, Samantha's beach wedding in Goa

చైతూ, సమంతల పెళ్లి పత్రిక ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అందులో ఉన్న సమాచారం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నుంచి 6 గంటల వరకూ మెహందీ కార్యక్రమం, 8.30 నిమిషాల నుంచి విందు, 11:52 నిమిషాలకు హిందూ సంప్రదాయం పద్ధతిలో వివాహం జరగనున్నాయి.

Naga Chaitanya, Samantha's beach wedding in Goa

రామానాయుడు సతీమణి రాజేశ్వరి(నాగచైతన్య అమ్మమ్మ) తీసుకొచ్చే చీరను సమంత ధరించనుంది. అలాగే శనివారం (అక్టోబర్‌ 7) సాయంత్రం 5.30 నిమిషాల నుంచీ 6.30 సమయంలో క్రిస్టియన్‌ సంప్రదాయ పద్ధతిలో వివాహం జరగనుంది.

Naga Chaitanya, Samantha's beach wedding in Goa

నాగ మరియు సమంతా కుటుంబాలు ఈ వేడుకకోసం ఎన్ని రోజుల నుండో వేచి చూస్తున్నారు.. అలాగే పెళ్లి జరిగిన వెంటనే ఈ జంట వారి విలాసవంతమైన హనీమూన్ కోసం ఇది వరకూ ప్లాన్ చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. డెక్కన్ క్రానికల్లో ఒక నివేదిక ప్రకారం, ఈ జంట రెండు నెలల పాటు హనీమూన్ ప్లాన్ చేస్తోంది, ఎందుకంటే వారు ప్రపంచాన్ని అన్వేషించాలనుకుంటున్నారు.

English summary

Naga Chaitanya, Samantha's beach wedding in Goa

Naga Chaitanya, Samantha's beach wedding in Goa,Tollywood's favourite couple- Naga Chaitanya and Samantha will reportedly have a beach wedding in Goa.
Subscribe Newsletter