ఓరి దేవుడా! కొలంబియాలో ముగ్గురి (స్వలింగ సంపర్కుల) పెళ్ళి చట్టబద్ధం అయిందట!

Posted By: Lekhaka
Subscribe to Boldsky

గే, లెస్బియన్ వంటి స్వలింగ సంపర్కులు ఈనాటికీ ప్రతిరోజూ తమ హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా పోరాడుతూనే ఉన్నారు. వీటన్నటి మధ్యలో కూడా, ప్రపంచంలో కొన్ని దేశాల్లో ఈ విషయం చట్టబద్ధం అయిపోయింది.

ముగ్గురు పురుషుల పెళ్ళి, అది కూడా చట్టబద్ధమవటంతో చాలా మందిని ఆకర్షిస్తోంది.

2016 ఏప్రిల్ లో కోర్టు ఇచ్చిన తీర్పుతో, కొలంబియాలో స్వలింగ పెళ్ళిళ్ళు చట్టబద్ధం అయిపోయింది. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు పెళ్ళిచేసుకోడానికి ఏ అభ్యంతరం లేకపోవటంతో, వారిని 'త్రియేజా'గా పిలుస్తున్నారు. ఈ పదం ట్రియో మరియు పరేజా ; ట్రియో మరియు జంట అనే పదాల నుంచి వచ్చింది.

ఈ పెళ్ళి వలన ముగ్గురు పురుషులు ఒక కుటుంబంగా పిలవబడతారు. వారికి ఆస్తిలో వారసత్వ హక్కులు కూడా లభిస్తాయి.

ముగ్గురితో నిర్మితమయ్యే ఈ ప్రత్యేక కుటుంబం గూర్చి మరింత తెలుసుకోండి...

ఇలాంటి నిర్ణయం తీసుకున్న వారిలో వీరు మొదటివారు…

ఇలాంటి నిర్ణయం తీసుకున్న వారిలో వీరు మొదటివారు…

స్వలింగ సంపర్కులలో ముగ్గురు పెళ్ళిచేసుకోవడం ఇదే మొదటిసారి. వారు చాలా ఏళ్ళు ప్రేమించుకున్నారు.

వీరెవరంటే…

వీరెవరంటే…

విక్టర్ తన ఇద్దరు భాగస్వాములు -జాన్ అలెజాండ్రో మరియు మాన్యుయెల్ జోస్ బెర్ముడెజ్ తో కలిసి జీవిస్తుంటాడు. ఈ ముగ్గురు మెడెల్లిన్ నగరంలో న్యాయస్థానం సమక్షంలో, చట్టబద్ధంగా ఒక బంధంలో ఒకటై కుటుంబంగా మారి, ఆస్తిహక్కులు పొందారు.

ప్రభుత్వం ఇచ్చే హక్కులను వారు పంచుకోవాలనుకుంటున్నారు…

ప్రభుత్వం ఇచ్చే హక్కులను వారు పంచుకోవాలనుకుంటున్నారు…

వారిలో ఒకరైన, కొత్త పెళ్ళికొడుకు విక్టర్ హ్యూగో పరాడా మాట్లాడుతూ, "మా త్రియేజా బంధం ప్రకారం మేము ఒక కొత్త ఆర్థిక వ్యవస్థ ఆశిస్తున్నాం" అని అన్నారు.

మాటల్లో చెప్పాలంటే…

మాటల్లో చెప్పాలంటే…

ప్రేమతో పాటు తమ వారసత్వ సంపదను కూడా సంరక్షించడానికి ఈ పెళ్ళి చేసుకున్నట్టు అతను వివరించాడు.

తమ బంధాన్ని వివరిస్తూ…

తమ బంధాన్ని వివరిస్తూ…

అందులో మరొక భాగస్వామి అలెజాండ్రో మాట్లాడుతూ, "మేము మా సంబంధాన్ని ఒంటరితనం, సహజీవనం ఆధారంగా సాగిస్తున్నాం. ఇందులో మాకు ప్రత్యేక అధికారాలు, పాత్రలు లేవు. ముగ్గురం ఒకే స్థితిలో ఉండి ఒక ఒప్పందంపై జీవించడానికి ప్రయత్నిస్తున్నాం."

వారికి శుభాభినందనలు అందిద్దాం…

వారికి శుభాభినందనలు అందిద్దాం…

ప్రపంచం మరింత స్వేచ్చా వాతావరణం పొందుతున్నవేళ, ప్రతిఒక్కరికీ వారికి నచ్చిన విధంగా జీవించే హక్కులు పొందుతున్నవేళ, ఇలాంటి వార్తల వల్ల మనచుట్టూ ప్రపంచం బ్రతకడానికి మరింత అందమైన స్థలంగా కన్పిస్తుంది!

దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మాతో పంచుకోండి.

All Images Source

English summary

OMG! Three-man Gay Marriage Is A Legal Thing In Colombia!

These 3 men are legally married in Colombia. Check their interesting story...
Subscribe Newsletter